రోటిలో చేసిన పచ్చడికి ఉన్న రుచి,మిక్సీలో చేసిన దానికి ఉంటుందా?


                                                                     

  "జీవితమంటే అంతులేని ఒక ఆరాటం".పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు, ఒకటే పరుగు,ఒకటే పరుగు, కొంతమందికయితే నిద్రలో కూడ పరిగెడుతున్న కలలే వస్తుండొచ్చు. ఎందుకీ అరాటం? ఎవరి కోసమీ ఆరాటం? అని ఒక క్షణమైనా కూర్చొని ఆలోచించేంత తీరిక లేని బ్రతుకు పోరాటాలు మనవి!

 నిజంగా ఈ స్పీడ్ జీవన శైలిని అలవర్చుకోవడం,  తెలిసో తెలియకో మనం చేసుకున్న స్వయంక్రుతాపరాదమే అని చెప్పవచ్చు. మెరుగైన,సౌఖ్యమైన జీవితం కోసం అని పరిగెత్తుకెళ్లి చాలా అసౌఖర్యానికి గురి అవుతున్నాం.జీవితాలను ఆశాంతిమయం చేసుకుంటున్నాం.ఈ పరుగుల జీవితం వలన నిజమయిన జీవితానందాన్ని కోల్పోయాం.

  అసలు మన కిష్టమయిన వ్రుత్తిని చేసే అద్రుష్టం మనకుండదు.వ్యాపార ఆభిలాష ఉన్న  వాడికి,తల్లి తంద్రుల బలవంతం మీద  టీచర్ గా పని చెయ్యాల్శి వస్తే,పిల్లలకు చదువు చెప్పడం మీద ఉండే శ్రద్ద కన్నా,తోటి టిచర్లు అందరిని తన "చిట్స్ బిజినెస్" లో జాయిన్ చేస్తే ఎంత లాబసాటిగా ఉంటుంది, అనే దాని మీద ఉంటుంది. అంటే ఒక టీచర్ గా అతనికి ఆనందం లేదు.దీని వలన ఇటు సమాజానికి అటు వ్యక్తికి నష్టమే.ఒక టీచర్ గా అతను జీవన గమ్యం చేరడం,అంటే ఇదొక   ఆనందానివ్వని పిచ్చి పరుగు పందెం లాంటిది.

 ఇక పోతే జీవితాన్ని ఆస్వాదీంచడం.నిజానికి నూటికి తొంబయి మంది ఈ అద్రుష్టానికి నోచుకోనివారే.కారణాలు అనేకం.చాలి చాలని జీతాలు కావచ్చు, వచ్చే ఆదాయంతోనే ఆనందమ్గా ఎలా గడపాలో తెలియని తనం కావచ్చు,ఆడంబరాలకు పోయి అప్పులపాలవడం కావచ్చు, వ్యసనాలకు బానిసలై,సంసారాల్ని గుల్ల చేసుకోవడం కావచ్చు,పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, గొప్ప వారి స్నేహాల మత్తులో ఆర్థికంగా దిగజారడం కావచ్చు, ఏదైతేనేం వీటన్నిటికి కారణం మనం అనుసరిస్తున్న "పరుగుపందాల" జీవన విదానమే.

  మనం సాదించాం అనుకుంటున్న అభిరుద్ది మొత్తం మనకు రుచీ పచీ లేని జీవితాన్నే కట్టబెడుతుంది.ఒక చిన్న ఉదాహరణతో దీన్ని ముగిస్తాను. వేడి వేడి ఇడ్లీలో రోటిలో చేసిన ఏ పచ్చడినయినా వేసుకుని తినండి. ఎంత కమ్మగా ఉంటుంది. అదే నిమిషంలో చేసిన మిక్సి లో పచ్చడి వేసుకుని చూడండి. తేడా ఉంటుందా ఉండదా?తేడా ఏమిటి? రోటిలో పచ్చడి నలగడానికి పట్టే టైమ్, ఆ టైం ప్రకారమే అందులో చేరే ఇతర పదార్దాలు,నీరు,గాలి అన్నీ కలిసి ఆ రుచిని ప్రసాదిస్తాయి. జీవితమూ అంతే.నిదాణంగా ప్రతి క్షణాని ఆలోచిస్తూ,ఆస్వాదిస్తూ గడిపే జీవితమే నిజమయిన జీవితం.ప్రతిదానికి కాల విభజన,ఆరాట రహితం అవసరం. ఆశ్రమ జీవన విదానం ద్వారా దానిని అనుసరించి మన జీవితాలను సారమయం చేసుకోవచ్చు. "ఆశ్రమ జీవన విదానం" గురించి తర్వాతి టపాలలో తెలిసుకుందాం  

                                    (Republished post. OPD:29/11/2012)    

Comments

  1. చక్కగా విశ్లేషించి చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. దన్యవాదాలు చిన్ని గారు

      Delete
  2. ఎందుకుండదూ? చమటోడ్చి రోట్లో రుబ్బితే :D

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన