మంత్రాలకు చింత కాయలు రాలుతాయో లేదో కానీ , ఆ మహిళల బ్రతుకులు మాత్రం రాలిపోతున్నాయి !!

                                                                         


                                   మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? ఇది మన పెద్దలు తరచూ వాడే మాట .   వెనుకటి కాలం లో కొంతమంది హేతు దృక్పధం గలవారు , మంత్రాలు తంత్రాలు మీద నమ్మకం లేని వారి నోటినుండి పుట్టిన మాట కావచ్చు ఇది . చెట్టుమీద ఉన్న చింతకాయలు కావాలంటే చెట్టెక్కి కోసుకోవడమో , పెద్ద గడ పెట్టి కోయడమో చేయాలి కానీ , చెట్టు క్రిందకు వెళ్లి చింతకాయలు ను చూస్తూ మంత్రం పఠిస్తే అవి రాలవు కదా? అని దీనిలోని భావం.

                    చింతకాయలు రాల్చె   విషయం లో మంత్రాలు ఫెయిల్  కావచ్చేమో కానీ   అన్య  మతం ను పాటి స్తున్న  మహిళల విషయం లో మాత్రం మంత్రం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది . కొన్ని శతాబ్దాలుగా ఆ మంత్రం పఠిస్తున్న ఆ మతం లోని పురుషులకు మంత్రం పారకపోవడం అన్న ప్రశ్నయే ఉత్పన్నం కాలేదు. 30 , 40 ఏండ్లు తనతో కలసి సంసారం చేసిన స్త్రీని అయినా సరే, లేకుంటే పెండ్లి అయి 2 గంటలు గడవని కన్యనైనా సరే , వారి  భర్తలు  ఆ మంత్రం పఠించి తమ మధ్య ఉన్న సంబంధాలను , అనుబంధాలను , అన్నింటిని పుట్టుకున్న త్రెంచి  వేసి    విజయగర్వం తో అట్టహాసాలు చేయచ్చు. ఆ పవిత్ర మంత్రమే "తలాక్ -తలాక్-తలాక్ ".  ఈ  తలాక్     అనే మాటను ముచ్చటగా మూడు సార్లు పఠిస్తే చాలు అంట . ఆ పఠించిన వారి భార్య బ్రతుకు రాలిపోయినట్లే . ఆ నిర్భాగ్యురాలికి కనీసం ఏ కోర్టులో కూడా ఇదేమిటని అడిగే హాక్కు కూడా లేని పరిస్థితి. ఇక కొంత మంది అయితే సెల్లో తలాక్ , తలాక్, తలాక్ అని SMS లు చేసి మరి విడాకులు పొందుతున్నారట. సదరు తలాక్ మంత్రాన్నీ, తన కారు కావాలన్న కోరికను  సకాలం లో తీర్చలేదని , పెండ్లి అయిన 2 గంటలకే ప్రయోగించిన ఒక ప్రబుద్దుడి గురించి ఆంధ్రజ్యోతి వారు , నిన్నటి ఎడిషన్ లో ఏమి తెలిపారో చూడండి .

                                                                        మీరట్: అందరిలాగే తనకు మంచి మొగుడు రావాలని కలలు కంది.. తను చేసుకోబోయే భర్త అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కంది. పెళ్లైంది.. ఇక హాయిగా జీవితాన్ని గడిపేద్దామనుకుంది. పాపం వివాహం అయిన రెండు గంటలకే భర్త నుంచి ఊహించిన షాక్ ఎదురైంది.పాపం యువతి కన్న కలలన్నీ కల్లలైపోయాయి. ఆఖరికి ఆ కలలు కన్నీటిని మిగిల్చాయి.
ఉత్తరప్రదేశ్‌‌లో మీరట్‌‌లో దహా అనే గ్రామానికి చెందిన ఓ యువతిని పక్క ఊరిలో ఉన్న మహ్మద్ ఆరీఫ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో మాట్లాడుకున్న కట్నకానుకలు ఇచ్చారు కానీ కారు మాత్రం ఇవ్వలేదు. కాస్త ఆలస్యంగా ఇస్తామని చెప్పారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన కొత్త పెళ్లికుమారుడు గొడవపడి పెళ్లైన రెండు గంటలకే తలాఖ్..తలాఖ్..తలాఖ్ (విడాకులు) చెప్పేశాడు. దీంతో నివ్వెరపోయిన పెళ్లి కుమార్తై తల్లిదండ్రులు, బంధువులు పెద్దలతో పంచాయితీ పెట్టించారు. అయినా నవ వరుడు ససేమిరా అన్నాడు. దీంతో చేసేదేమీలేక వారు కూడా అతనికి తగిన బుద్ధి చెప్పడానికి రూ. 2.5 లక్షలు భరణం చెల్లించాలని తీర్మానించారు. అంతేకాదు మూడేళ్లపాటు పెళ్లి చేసుకోకూడదని షరతు విధించారు. వీటన్నింటికి ఒప్పుకుంటే సరే లేకుంటే కఠిన చర్యలు తప్పవని పంచాయితీ పెద్దలు చెప్పగా అందుకు సరేనని మహ్మద్ తల ఊపాడు.
ఈ తలాక్ తో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఈ పదం ఎవరు కనిపెట్టారో ఏమోగానీ దేశవ్యాప్తంగా మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రద్దు చేయాలని ముస్లీం మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని మహిళలే కాకుండా పురుషులు కూడా డిమాండ్ చేస్తున్నారు.ఇందుకుగాను గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లోని ముస్లీంలు 50వేల మంది సంతకాలు చేసిన ఫిటీషన్‌ను 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమిషన్ కు సమర్పించారు. ఇందుకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందిస్తున్నారు. తలాక్‌‌ను రద్దు చేయాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.(http://www.andhrajyothy.com/artical?SID=291327)
                                                           


   ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో , అప్పటి వారి జీవన విధానం కు అనుగుణంగా ఏర్పరచుకున్న నియమ నిబంధలను పాటించే అన్యమతస్తులు , కాలక్రమేణా భారతదేశాన్ని ముట్టడించి ,ఇక్కడి ప్రజలను బలవంతంగా తమ మతం లోకి మార్చి , వారి నిబంధనలో పురుషులకు  అనుకూలంగా ఉన్నవి  పాటిస్తూ , స్త్రీలకు ఉండే సహజ హక్కులను కాల రాస్తున్నారు.  దీని గురించి ముస్లిం మహిళలు గొంతెత్తి అరుస్తున్న వాటి గురించి పట్టించుకునే మేధావులు కానీ , రాజకీయ నాయకులు కానీ ఆ మతం లో లేకపోవడం    దురదృష్టకరం .

                                                                           

 
                          హిందూ మతం లోని దేవుళ్ళని , సంప్రదాయాలను ఎద్దేవా చేసే కొంతమందికి , ఇలా తమ మతం లో ఉన్న దురాచారం గురించి మాట్లాడే దమ్ము లేదు. 15 నిముషాలు టైం ఇస్తే హిందువులను నాశనం చేస్తాను అని ప్రగల్బాలు పలికే నవాబ్ లకు తమ జాతిలోని స్త్రీల కన్నీళ్లు తుడిచే తెగువలేదు . వీరా  హిందూ మతస్తులను గురించి  అవాకులు చవాకులు పేలేది ?   మీరు నిజంగా వీరులే అయితే , ఆ వీరత్వాన్ని కనీసం మీ స్త్రీల కన్నీళ్లు తుడవడానికి  ఉపయోగించండి. మీ కళ్లెదుటే మతం పేరుతొ అబలలని అరబ్ షేక్ లకు అమ్ముకుంటుంటే   నివారించలేని వారు స్త్రీల కన్నీళ్లు గురించి పట్టించుకుంటారా ? అనుమానమే? . ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే , పిల్లలు , స్త్రీలు ఏడ్చే ఏ కుటుంబం , రాజ్యమైన సుభిక్షంగా ఉండే ప్రశ్నయే లేదు. కాబట్టి హిందువులైనా , అన్యమతస్తులైనా  తమ తమ కుటుంబాలలో   , స్త్రీలు , పిల్లలు, వృద్దులు  సంతోషంగా ఉండేటట్లు చేయడమే నిజమైన మగతనం  .   అలాంటి కుటుంబాలు ఉన్న రాజ్యమే వీరుల రాజ్యం.    

       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన