'అన్యాయంగా విడగొట్టారు'అని బాదపడుతున్న వారిని ' ఆవిర్బావ దినం'అంటూ అవమానించటం కరెక్టా ?
జూన్ 2,2014 ! తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావ దినం . ఆ రోజుని తెలంగాణా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిoచ వలసిన రొజు. తెలంగాణా ప్రజలు నిజంగా ఆ రోజు "సంబురాలు" జరపుకోవడమే కాక , ప్రతి యేట ఘనంగా అధికారికoగా "తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం" జరుపుకునే రోజుగా మారనుంది . అంతవరకూ సంతోషమే . కాని అదే రోజును ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం గా పరిగణిస్తామని కేంద్ర ప్రబుత్వం ప్రకటించడం చూస్తుంటే , కాంగ్రెస్ వారికి ఎందుకో కాని , సిమాంద్ర వారు అంటే చెప్పలేని కసి ఉన్నట్లు అనిపిస్తుంది . వారిని అవమానిoచటానికే ఆ ప్రకటన విడుదల చేసినట్లు కనిపిస్తుంది . నిజానికి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది నవంబర్ 1 1956. ఇప్పుడు తెలంగాణా అందులో నుండి విడిపోయినంత మాత్రానా అది ఆంద్ర ప్రదేశ్ పేరుతోనే ఉంది తప్పా , దానికి కొత్త పేరు ఏమి పెట్టలేదు కదా ! కనీసం సిమాంద్ర అనో , న్యూ ఆంధ్రా అనో పేరు మారిస్తే అప్పుడు నూతన ...