Posts

Showing posts with the label పింక్ కోచ్ మహిళా చోరులు

మగాళ్ళు అసబ్యంగా ప్రవర్తిస్తున్నారు అనుకుని జాగర్త పడితే ,ఆడాళ్ళు ఏకంగా దోచేస్తునారు అంట !

                                                                                      ఇది నా మాట కాదు . డిల్లి సెంట్రల్ ఇండస్త్రియల్ సెక్యురిటి పోర్స్ వారి గణాంకాల ఆదారంగా వారు చెపుతున్న మాట . డిల్లి మెట్రో రైళ్ళలో జరిగే పిక్ పాకేటింగ్ తరహా  దొంగతనాల్లో నూటికి 94%దొంగతనాలు మహిళా చోర శిఖామణులు చెస్తున్నవెనట !గత సంవత్సరం డిల్లి మెట్రో రైళ్ళలో మొత్తం 193 దొంగ తనాలు జరిగితే అందులో 175 దొంగ తనాలు స్త్రీలు చేసినవే ! అయితే ఈ  సంవత్సరం వారిలో చైతన్యం ఎక్కవ అవ్వడం వలన , జనవరి నుండి మార్చ్ వరకు మొత్తం 124 దొంగ తనాలు చేస్తే వాటిలో 118 దొంగ తనాలు మహిళా దొంగల ఖాతాలో జమ అయ్యాయి అట ! ఇలా జరగడానికి కారణ మేమిటబ్బా ? అని ఔత్సాహికులు అరా తీస్తే , దానికి కారణం కూడా మగబుద్దే నని తేలిందట !  డిల్లి మెట్రో రైళ్ళలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా "గులాబి రంగు భోగి " లు ఉంటాయ...