మూడ వాదం ఎవరిది? పిరమిడ్ వాదులదా,సైన్స్ వాదులదా?
మా బ్లాగులొ శాస్త్రీయ వాదం గురించి ఒక టపాలో చెపుతూ, దేనినైనా గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో, వ్యతిరెకించడం అంతే తప్పు అని చెప్పడం జరిగింది. ఈ రోజు "మహా న్యూస్" చానల్ వారు నిర్వహించిన ఒక ప్రత్యక్ష వాదులాట కార్యక్రమం చూశాక ఈ దేశం లో సైన్స్ వాదులు అని చెప్పుకునె వారు కూడ ఎటువంటి పరిశోదనలు చెయ్యకుండానే, తాము నమ్మినదే సత్యం అని వాదించడానికి చానల్ స్టూడియోలలో ప్రత్యక్షమవుతున్నారంటే,వారిని ఏ విదంగా అర్థం చేసుకోవాలి? వారు కూడ చీప్ పబ్లిసిటీకి అతీతులు కాదనుకోవాలా? విషయం ఏమిటంటే ఈ రోజు మహా న్యూస్ వారు పిరమిడ్ ద్యానమ్ యొక్క శాస్త్రీయత గురించి ఒక అభిప్రాయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవలం ఇద్దర్నె కూర్చో పెట్టారు. వారివురూ పిరమిడ్ వాదాన్ని వ్యతిరెకించె వారే. అసలు పిరమిడ్ వాదుల ప్రకారం ద్యానమ్ అనేది పిరమిడ్ ఆకారం లొ ఉన్న ఏ వస్తువు లేక కట్టడం క్రింద కూర్చుని చేస్తే త్వరగా ద్యాన పలితాలు పొందవచ్చని, అంతే కాక పిరమిడ్ వల్ల విశ్వవ్యాప్తంగా ఉండే విశ్వ శక్తిని మనిషి గ్రహించడం వలన అనేక రుగ్మతల నుండి విముక్తుడు కావచ్చని చెపుతారు. కాదు ఇదంతా బోగస్ అని సైన్స్ వాదుల ద్రుడ అభిప్రాయం.