అనుగ్రహంలోను, ఆగ్రహంలోను,గంగమ్మా!ఇలలో నీకు సాటి వేరే లేరమ్మా!
అమ్మా గంగమ్మా,భగీరథులమై నిను ప్రార్థించిన వేళ మా వెంట నడచి మా బీళ్లను సస్యశ్యామలం చేశావు తల్లీ భక్తితో నిను పూజించిన వేళ, కరుణాంతరంగవై,తటాకమై నిలచి గ్రామసీమలలో మా పాడి పంటలకు ఆలంబనవైయావు. మాతా! వినమ్రులమై మ్రొక్కినందుకు జలధివై అంతులేని సంపదకు మము వారసులను చేసావు. కన్ను,మిన్ను కానక అంతులేని గర్వముతో విర్రవీగి,ప్రక్రుతికి హాని తలపెట్టిన వేళ ప్రళయమై మమ్ము ఒక్కపెట్టున ఊడ్చి పెట్టావు. ...