ఉప్పెనతో ఊళ్లు కొట్టుకుపోతుంటే,'ఉత్సవ సభకు 'రమ్మంటునాడు 'ఉత్త'రాకుమారుడు !.
ఈ రోజు టి.వి. చానళ్ళు చూసారా , 'ఊరిదంతా ఒక దారి అయితే ,ఉలిపికట్టెది ఇంకో దారీ' అన్నట్లు ఉంది ,ఒక చానల్ వారు చెసే ప్రసారాలు చూస్తుంటే . అన్ని చానల్లోను సింహబాగం ,గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెతుతున్న వర్షాలు, వాటి వలన ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు గురించి ప్రసారం చేస్తుంటే , ఒకే ఒక చానల్ మాత్రం హైదరాబాద్లో జరుగబోతున్న "సమైఖ్య శంఖారావం " సభ గురించి ప్రసారాలు చేస్తుంది. "ఉప్పెనలా కదలి రండి" "ఊరువాడాఏకమై రండి" "తెలుగుతల్లి విలపిస్తుంది " ...