Posts

Showing posts from June, 2015

ఈయన గారు సినిమా నటన లో సింహం లెక్క ! చిత్తం మాత్రం "చిత్త కార్తె కుక్క "లెక్క!!!?

Image
కమల్ హాసన్ ! ది గ్రేట్ సిని ఆర్టిస్ట్ . నేను N.T.R గారి నటన తర్వాత అభిమానించే నటన ఈయనదే ! నటన అంటె మూస తరహ పాత్రలు పోషించడం కాదని , వైవిద్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని నమ్మి ఆచరిస్తున్న గొప్ప వ్యక్తీ అతను. అందుకే నటన పరంగా అయన గారు సింహం . కాని నైతిక జీవనం విషయం లో మాత్రం అయన  ఆలోచనలు  గ్రామ సింహం లాగా ఉన్నాయి అనిపిస్తుంది.

   ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది నైతికంగా దిగజారిన పెద్దల సంతానాన్ని ఉద్దేసించి చెప్పే మాట. దాన్ని నిజం చేయాలని చుస్తున్నట్టుంది శ్రీ మాన్ కమల్ హాసన్. అయన వ్యక్తిగత జీవితం అయన ఇష్టం అయినప్పటికి , అయన సెలెబ్రిటి కాబట్టి , అయన ఉంటున్న సమాజం లోని నైతిక జీవన విలువలును  గుర్తించి మసలుకుంటె మంచిది. ఒక ప్రకటన ఇస్తున్నప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో తెలుసుకుని ఇవ్వడం కనీస ధర్మం. 
           అయన గారు, సహచర్యం అని చెప్పబడే "మోడ్రన్ కీపింగ్ " పద్దతిని ఎందుకు అవలంభించాడొ , దానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటో ఆయనకే తెలియాలి. అటువంటి పరిస్తితులే అయన గారి కూతుళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు తాను ఆచరించిన నైతిక హీ…

"కెమెరామెన్ T V 9 తో యాంకర్ పద్మావతి " ఎపిసోడ్ లో T V 9 కు పెరగడం తప్పా , పద్మావతికి ఒరిగిందేమిటి?

Image
ఈ  రోజు కొన్ని మీడియా చాన్నల్లలో ఒక స్క్రోలింగ్ చూశాను. హైదరాబాద్ కి చెందిన యాంకర్ పద్మావతి అనే ఆవిడ తన భర్త సతీష్ ని ప్రియురాలి తో ఉండగా పట్టుకుని దేహశుద్ది చేసి బుద్ది చెప్పిందని. చాలా సంతోషం వేసింది ఆ వార్తా చూసి. కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేసి మరో ప్రియురాలితో కులుకుతున్నందుకు అతడికి ఆ ఇల్లాలు తగిన బుద్ది చెప్పి ఉంటుంది అనుకున్నాను. కాని ఇదే వార్తా కొన్ని చానల్లలో ఇంకొక రకంగా అంటే యాంకర్ కి వ్యతిరేకంగా రావడం తో ఆసక్తి పెరిగి అసలు కద ఏమిటా అని ఆరా తీస్తే , T V 9 వారి పుణ్యమాని యాంకర్ పద్మావతి ఎపిసోడ్ దొరికింది. అది చూసాక మొగుడు పెళ్ళాల పంచాయతీలు వారికి ఏ మాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కాని T V చానల్లు తమ రేటింగ్ లు పెంచుకోవటానికి మాత్రం పిచ్చ పిచ్చగా ఉపయోగ పడుతున్నాయని అర్దమవుతుంది.

             పద్మావతి కదనం ప్రకారం ఆమెకు సతీష్ తో పెళ్లి అయి 10 యేండ్లు  అవుతుంది.  వారిది ప్రేమ వివాహం. ఆమె మాటలు బట్టి వారి పెండ్లి అబ్బాయి ఇంట్లో వారికి ఇష్టం లేదు. వారి మోజులు తీరగానే గొడవలు ప్రారంబం అయ్యాయి కాబోలు , ఆటను వేరే ఆమె తో తన తండ్రి ఇంట్లో ఉన్నట్లు ఉంది. ఆ రెండవ ఆవిడకి 3 సంతానం అని చ…

తన పిల్లల దన విజ్ఞానానికి బలై పోయిన "జన విజ్ఞాన వేదిక " నాయకుడు !

Image
మన సమాజం లో కొంతమంది నిస్వార్దంగా జనం కోసం అహర్నిశలు పని చేస్తూ , తాము నమ్మిన సిద్దాంతం కోసం తన సర్వసాన్ని చివరకు తన ఆస్తి పాస్తులను సైతం సమర్పించేసి " మహాత్ములు " మహా పురుషులు అనిపించుకుంటారు . వీరి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయం లో ఎలాంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. కాని వీరి అంతులేని ఉదార స్వబావం వలన బాదితులుగా మారేది సదరు మహాత్ముల "కుటుంబ సబ్యులు". అందుకే జనానికి "గాడ్ పాదర్" అయిన వారు కూడా  , ఇంట్లో పిల్లలకి   "గుడ్ పాధర్ " కాలేరు. ఇంట గెలిచి రచ్చ గెలవడమనేది విజ్ఞుల లక్షణం . కాదు సమాజమే నా దేవాలయం . ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నప్పుడు ముందు కుటుంబ బాద్యతలు నెరవేర్చి , ఇంట్లో ని సబ్యులందరిని సమావేశపరచి , తన ఆస్తి పాస్తులును ఎవరి వాటా వారికి ఇచ్చివేసి , తనకు వచ్చిన వాటాని , ఇక బవిష్యత్ లో తానూ సంపాదించే దానిని పూర్తిగా తానూ నమ్మిన సిద్దాంతం కోసమో , ప్రజల కోసమో వెచ్సిస్తాను అని స్పష్టంగా చెప్పివేస్తే , అది ధర్మబద్దంగాను, న్యాయబద్దంగాను ఉంటుంది. పిల్లల మనస్సుల్లో కూడా ఎలాంటి దురభిప్రాయాలు , అపోహలు ఉందే అవకాశం ఉండదు.

   పిల్లలందర…