అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి కి , అన్యమత " క్రీస్తు "కి ఏమిటి సంబందం ?
అమెరికా అద్యక్షుడు ఒబామా గారు ,మొన్న భారత పర్యటన సందర్భంలో, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ గా ఉండి ఇక్కడ మత స్వేచ్చ చక్కగా ఉన్నంత కాలం, భారత పురోభివ్రుద్దికి డోకా లేదు అని సెలవిచ్చారు .దాని గురించి ఇండియాలో మెజార్తీ మతస్తులు అయిన హిందువులు పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకంటే హిందూ జీవన విదానంలోనే సెక్యులరిజమ్ కొన్ని వేల యేండ్లుగా పాతుకు పోయి ఉంది . కుక్క ,పంది లో సైతం దేవున్ని దర్శించే హిందువులు, అన్య మతస్తుల దేవుళ్ళలో దర్సిస్తున్నాం అంటే అభ్యంతరం చెపుతారా?కాక పొతే ఈ గడ్డ మీద పుట్టిన వారిని హిందువులు దేవుళ్ళను చెస్తే ,పరాయి గడ్డ మీద పుట్టిన వారిని అన్య మతస్తులు దేవుళ్ళుగా కొలుస్తున్నారు . అంతే తేడా! అయితే ఒబామా గారి మత స్వెచ్చ గురించి చెప్పిన దానిని, వేరొక రకంగా అర్ధం చేసుకున్నట్లు ఉంది ఆంద్ర ప్రదేశ్ లోని అంతర్వేది కి సంబందించిన రెవెన్యూ మరియు ఎండొమెంట్ డిపార్త్మెంట్ లోని కొంత మంది కిరస్తానీ అధికారులు . ఒబామా మత స్వేచ్చా గురించి నొక్కి వక్కాణించేట్టప్పుడు, మన ప్రదాని కౌంటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ,తమకు కావలసినంత