ఒకప్పుడు వీరులతో అలరారిన "చైనా ",ఇప్పుడు వీర్యం కోసం అల్లాడిపోతుందంట !!?
"మీరు 20 నుంచి 45 ఏండ్ల మధ్య వయసుగలవారా? మీకు ఏ రోగాలు రొష్టులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా ? అయితే మీకు మంచి అవకాశం. మీరు డబ్బులు కోసం కిడ్నీలు దానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ వీర్యం దానం చేస్తే చాలు!. మీకు 10000 డాలర్ల క్యాష్ కానీ , రోజ్ గోల్డ్ ఐ ఫోన్ కానీ ఇవ్వబడుతుంది . రండి రండి ! ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి " పై ఆఫర్ ఇస్తుంది ఎవరో తెలుసా? ఘనత వహించిన కమ్యూనిస్ట్ చైనా లోని" స్పెర్మ్ బ్యాంక్ " లు. ఇలాంటి ప్రకటనలతో యువకులను ఆకర్షించి వారి వీర్యం తో తమ బ్యాంక్ లు నింపుకుంటున్నాయి ఆట. అంటే కాదు మన దేశం లో రక్త దానం చేస్తే సమాజ సేవ చేసినట్లే అని ఎలా మన బ్లడ్ బ్యాంక్ ల వారు చెపుతున్నారో, చైనా లో వీర్యం దానం చేస్తే దేశ సేవ చేసినట్లే అని అక్కడి స్పెర్మ్ బ్యాంక్ ల వారు తెగ ఉదరగొడుతున్నారట. ఇదంతా ఏమిటి ? సాంప్రదాయ పద్దతిలో ఆలుమగల కలయికతో జరగాల్సిన సంతానాభివృద్ధి ని ఇలా స్పెర్మ్ బ్యాంక్ లనుండి సేకరించి...