మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి , మృగాడు ముద్దుపెట్టుకుంటుంటే ఏమి చేయలేక పోయింది ఎందుకని ?!!
మొన్న 1 వ తేదీన అర్ధరాత్రి , బెంగళూరు లోని రెసిడెన్షియల్ ఏరియా అయినా కమ్మనహళ్లి లో జరిగిన ఒక సంఘటన, మీడియాల ప్రసారాలు వలన భారతదేశం లో సెన్సేషనల్ విషయం గా మారింది. సదరు మీడియా వాళ్ళు చెప్పేది ఏమిటంటే , ఒక అమ్మాయి అర్ధరాత్రి 2 ఇంటికి తన ఇంటికి దగ్గరగా ఉన్న సందులో ఆటో దిగి , ఇంటికి వెడుతుంటే ఇద్దరు వ్యక్తులు ద్వి చక్రవాహనం మీద ఆ సందులోకి వచ్చి, ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకోవడమే కాక, బలవంతంగా టూ వీలర్ మీదకు ఎక్కించబోతే , ఆమె ప్రతిఘటించడం తో అది సాధ్యపడక ఆమెను అమానుషంగా రోడ్డు మీదకు త్రోసివేసి వెళ్లి పోయారు . అది జరిగిన విషయం. అయితే ఈ సంఘటనకు ముందు ఏమి జరిగిందో , ఆ తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు . ఎందుకంటే అవి ఏవి c.c కెమెరాలలో రికార్డు కాకపోవడం ఒక కారణమైతే , సదరు బాధితురాలు పోలీస్ వారికి సమాచారం ఇవ్వకపోవడం రెండవ కారణం . తనకున్న పర్సనల్ కారణాలు వలన కావచ్చు ఆమె ఏ పిర్యాదు చేయనప్పటికీ , సమాజ హితo స...