పదేళ్ళకే కొడుకు చేతికి "సెల్" ఇస్తే , పాతికేళ్ళు వచ్చేసరికి వాడి ఒంట్లో ఏ "సెల్స్ " పనిచేయవట!
ముద్దు మురిపెం కోసం , డాబు దర్పం కోసం, లేక పిల్లలకి ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించడం లో నిర్లక్ష్య వైఖరితో, చాలా మంది తల్లితండ్రులు పిల్లలను సెల్ వాడకం కు అలవాటు పడేలా చేస్తున్నారు. "ఏమండి , నాకు ఇంతవరకు సెల్ పోన్ లో ఎర్ర బటన్, ఆకుపచ్చ బటన్ నొక్కడం తప్పా ఏమితెలియదండి, కానీ మావాడు అయితే ఏకంగా అన్నీ విప్పదీసి మరీ తగిలిస్తాడు తెలుసా! ,అని తన పదేళ్ళ కొడుకుకు సెల్ టెక్నాలజీ పట్ల ఉన్న అవగాహనకు తెగ మురిసి పోతుంటారు అమాయక , అజ్ఞాన చక్రవర్తులైన తల్లి తంద్రులు. పిల్లలలో 21 వ సంవత్సరం వచ్చే దాక అవయవ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. మెదడు లోని సంక్లిష్ట బాగాలు 21 వ సంవత్సరం వరకు అభివృద్ధి చెందుతూనే ఉం...