అంటరాని కంపు భరించలేక క్రిస్టియన్ మతంలోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?
భారత దేశంలో హిందూ జీవన విదానంలో ఒక ఘోరమైన అమానవీయ విదానం ఒకప్పుడు చోటు చేసుకుంది . అదే అంట రాని తనం . దీనిని ప్రవేశ పెట్టింది ఎవరైనా , కొనసాగించడంలో మాత్రం అన్ని వర్ణాల వారి పాత్ర ఉంది . తోలి వేద కాలంలో అందరికీ దేవుడు ఒక్కడే . అతడే ప్రజాపతి అనబడే సూర్యుడు . ఆ తర్వాతి కాలం లో త్రి మూర్తులు , ఇంకా అనేక మంది దేవతలు వచ్చి , చివరకు భరత ఖండాన్ని హిందూ దేశం చేశారు . ఈ దేశంలో ఉన్నన్ని మతాలూ, దేవుళ్ళు ఏ దేశంలో కానరారు . అందుకే ఇది ఒక మినీ ప్రపంచం. హిందూ మతం అని అపోహ పడుతున్నడి నిజంగా మతం కాదు . అది జీవన విదానం. ఈ జీవన విదానంలో అన్నీ మతాలూ ఉన్నాయి. మతం కి ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటె ఏదైతే ఒక వ్యక్తీచేత ప్రబోదించబడిన సూత్రాలు అనుసరించే వర్గం , లేక ప్రత్యేక ఆరాధనా పద్దతి కల వర్గం ఉంటుందో వారు అనుసరించే విదానం ని " మతం " అంటాం. కాని "హిందూ" అనేది ఆ నిర్వచనం పదిలోకి రాదు. అందుకే దానిని జీవన విదానం అన్నారు మన సుప్రీం కోర్టు వారు . ఈ జీవన విదానంలో , ఈ దేశంలో ఉద్బవించిన వ