రెడ్డిగారి పాలనలో కళ కళ లాడిన కేశవ రెడ్డి గారు , బాబు గారి పాలనలో విల విల లాడే "కేసుల రెడ్డి " గా ఎందుకు మారారు ? !!
ఎవరైనా సరే , సామాన్యులుగా ఉన్న వారు, గొప్ప పబ్లిసిటి తో, ఆనతి కాలం లో కోటాను కోట్లకు పడగలెత్తి "అధిపతులుగా " గా మారారు అంటే ఖచ్చితంగా వారు ఎవరి నెత్తినో చేతులు పెడితే కాని వారు ఆ స్తాయికి చేరుకుని ఉండరు అని, ఇంతవరకు మన కళ్ళముందు జరిగిన చరిత్ర చెపుతుంది. అలా నెత్తిన చేతులు పెట్టించుకునే వారు ప్రభుత్వ ఆదీనం లోని బ్యాంకులు కావచ్చు , ప్రజలు కావచ్చు. మొన్నటి రామ లింగ రాజు గారి దగ్గర్నుంచి నేటి కేశవరెడ్డి గారి దాక ఎవరి విషయం చూసినా ఇదే తంతు. మనకు తిండి పెట్టె రైతుకు పది వేలు ఇవ్వడానికి సవా లక్ష ప్రశ్నలు సందించే సంస్తలు , ఈ బడాబాబులు విషయం లో మాత్రం కిమ్మన్నకుండా రుణాలు ఇవ్వడానికి కారణం బహుసా వారికి ఉన్న ఫాల్స్ పబ్లిసిటి యే కారణం కావచ్చు....