జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !
సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి అ నాటి సమాజ పరిస్తితులే కారణం. అ రోజుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ,అలా పెట్టుకున్న స్త్రీని సమాజం హీనంగా చూసేది. జరిగిన తప్పు లో బాద్యత ఎవరిదైనా ,సమాజం మాత్రం ఆమెను మాత్రమె బాద్యురాలిగా చేసి ఆమ