అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?
తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం శ్రీ చంద్ర శేఖర్ రావు గారు ఎన్నికల వేల అనేక ముఖ్యమైన వాగ్దానాలు చేసారు . అందులో హిందూ సమాజానికి అయన ఇచ్చిన వాగ్దానం తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే , హిందూ సంస్తలకు ప్రభుత్వ పెత్తన పీడ నుండి విముక్తి కలిగిస్తా