అత్త మీద కోపం , జిల్లా జడ్జ్ మీద చూపించిన రాకాసి కోడలు !
అత్తమీద కోపం దుత్త మిద చూపింద ని మనకొక సామెత ఉంది . పూర్వం ఇండ్లలో అన్నింటికీ మట్టి పాత్రలే వాడేవారు . వెనుకటి కుటుంబాలు అన్ని ఉమ్మడి కుటుంబాలే కాబట్టి , సాదారణంగా అత్తల పెత్తనమే ఇండ్లలో కొనసాగేది . కోడళ్ళు కాపురాలు చేయడం వరకే కొడుకులు తో పని. మిగతా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా అత్తల చేతిలో ఉంటుంది . అటువంటి కంట్రోల్ కోడలికి రావాలంటే ఆమె అత్త గా మారిన తర్వాతే అది సాద్యం . అలా మన కుటుంభ వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టి వ్యవస్థ లాగా ఒక క్రమ విదానం కలిగి ఉండేది . మరి అలాంటి కుటుంబాలలో అత్తల మిద కోడళ్ళకు కొన్ని సందర్బాలలో కోపం రావడం అనేది సహజంగానే జరుగుతుంటుంది . అలా వచ్చిన కోపాన్ని డైరెక్టుగా అత్తల మిద చూ...