"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.
ఆ మధ్య ఢిల్లీ కి చెందిన ఒకావిడ గారు తన కూతురికి పాస్ పోర్ట్ కావాలని సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయం లో అప్లై చేస్తే , ఆ అప్లికేషన్ పరిశీలించిన అధికారులు అమ్మాయి తండ్రి పేరు అన్న కాలం ఖాళీగా ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టం అప్లికేషన్ తీసుకోవటం లేదు కాబట్టి తండ్రి పేరు ఏమిటో చెప్పండి అన్నారట . దానికి అగ్గి మీఁద గుగ్గిలం అయిన సదరు మాతృమూర్తి " పిల్ల పుట్టగానే తండ్రి వదిలేసి పొతే, నేనే తల్లి తండ్రి అయి పెంచితే , ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం ,వాడి పేరు నా కూతురు కి తండ్రిగా చెప్పాలా ? నెవ్వర్ !" అందట . దానితో తెల్లబోయిన అధికారులు "చూడమ్మా నీ మొగుడికి నీకు ఉన్న గొడవలు గురించి , కంప్యూటర్ క...