అంగార గ్రహానికి " మామ్ "(MoM) లు పంపుతున్న విజ్ఞానులు, భూమి మీదకు "అమ్మ" లు రాకుండా అడ్డుకుంటున్నారు !
ఆడపిల్లలు పుట్టి పెరిగాక, తలయెత్తే స్వేచ్చా ,స్వాతంత్ర్యాలు , రక్షణ సంగతి కంటే అసలు వారిని భూమి మీదకు రానియ్యకుండా చేస్తున్న మనలోని అజ్ఞానం తో కూడిన ఆధునిక విజ్ఞానం , దానికి దోహద పడుతున్న నేటి వ్యాపార వాద సంస్క్రుతి మరియు శాస్త్ర విజ్ణాన అభివృద్ధి గురించి మనిషి అన్న వాడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశం లో చాలా మంది విజ్ఞానులు ప్రజల్లో మూడత్వం పారద్రోలుతున్నామని ప్రచారం చేసుకుంటూ, కేవలం హిందూ జీవన విదానం లోని ,కొంతమంది పొట్ట కోటి కోసమో, లేక ప్రజల్ని ఆకర్షించడం కోసం చేసే గారడీ విద్యలను ఎత్తి చూపుతూ , హిందువుల మత విశ్వాసాలు వలననే దేశం లో అజ్ణానం ఉందని ప్రచారం చేస్తున్నారు. దీనికి అన్య మ...