అంగార గ్రహానికి " మామ్ "(MoM) లు పంపుతున్న విజ్ఞానులు, భూమి మీదకు "అమ్మ" లు రాకుండా అడ్డుకుంటున్నారు !
ఆడపిల్లలు పుట్టి పెరిగాక, తలయెత్తే స్వేచ్చా ,స్వాతంత్ర్యాలు , రక్షణ సంగతి కంటే అసలు వారిని భూమి మీదకు రానియ్యకుండా చేస్తున్న మనలోని అజ్ఞానం తో కూడిన ఆధునిక విజ్ఞానం , దానికి దోహద పడుతున్న నేటి వ్యాపార వాద సంస్క్రుతి మరియు శాస్త్ర విజ్ణాన అభివృద్ధి గురించి మనిషి అన్న వాడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది
ఈ దేశం లో చాలా మంది విజ్ఞానులు ప్రజల్లో మూడత్వం పారద్రోలుతున్నామని ప్రచారం చేసుకుంటూ, కేవలం హిందూ జీవన విదానం లోని ,కొంతమంది పొట్ట కోటి కోసమో, లేక ప్రజల్ని ఆకర్షించడం కోసం చేసే గారడీ విద్యలను ఎత్తి చూపుతూ , హిందువుల మత విశ్వాసాలు వలననే దేశం లో అజ్ణానం ఉందని ప్రచారం చేస్తున్నారు. దీనికి అన్య మతాలు కు చెందిన విదేశి సంస్తలు నుండి పెద్ద ఎత్తున నిధులు అట్టి విజ్ఞాన ప్రచార సంస్తలకు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేవలం హిందూ సంస్తలు , వ్యక్తులు ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్న ఈ విజ్ఞానులు చెప్పే దానిలో నిజమున్నా , వారి ప్రచార విదానం వలన అన్య మతాలు ఈ దేశం లో లాబ పడుతున్నాయి అని గ్రహించిన హిందువులు వారిని కానీ, వారు చెప్పే దానిని కానీ పెద్దగా పట్టించుకోవటం లేదు సరి కదా , ఈ మద్య ప్రజలు వారి నిజాయితిని ప్రశ్నించడం ఎక్కువైంది. దీని వలన గారడీ చేసే వాడు, దానిలోని మర్మం విప్పి చెప్పే వాడు ఇద్దరూ ప్రజల ద్రుష్టిలో ఒకటే ! జస్ట్ ఎంటర్ టైన్మెంట్ ! అంతె!
ఒకనాడు మతపరమైన విద్యా జ్ఞానంతో కొంతమంది మత వాదులు ఎలా విర్రవీగి ఈ సమాజ పతనానికి కారకులయ్యారో, ఈ నాడు అదే పాత్రను శాస్త్ర విజ్ఞానం తో కొంతమంది విజ్ఞానులు అని చెప్పబడుతున్నవారు చేస్తున్నారు. ఏ విజ్ఞానం అయినా అంతిమంగా ప్రజలకు మేలు చేకూరిస్తేనే సార్దకత. దానిని పది కాలాల పా టు ప్రజలు ఆదరిస్తారు. గాందీ గారు చెప్పినట్లు "సమాజానికి మానవ హననానికి కారణమైన అణుబాంబు ను కనిపెట్టిన శాస్త్రవేత్త కన్నా , ఒక గుడ్డివాడిని రోడ్డు దాటించడం లో సాయపడే బాలుడు ఎంతో మిన్న" అన్నదే సమాజానికి ఎంతో అవసరం. హిందూ జీవన విదానం లో శాస్త్రీయ దృక్పదం కి ఎప్పుడో పెద్ద పీట వేసారు. మన సాంప్రదాయాలు లో ఇంచుమించు శాస్త్రీయ దృక్పదాలు ఉన్నవే ఎక్కువ. కానీ రాను రాను కొన్ని విదేశి శక్తులు మన సమాజం లోకి ప్రవేశించడం వలన , వారి నుండి మన మతాన్ని కాపాడుకోవటానికి కొంత చాందస వాదాన్ని కూడా భరించవలసిన పరిస్తితి. అది ఇప్పటికి కొనసాగుతోనే ఉంది.
హిందూ జీవన విదాన విశిష్టతను విదేశాలలో చాటి చెప్పిన వివేకానందుల వారు సహితం" సన్యాసులు రోజూ ఒక నల్ల బోర్డు , చాక్ పీస్ తీసుకువెళ్ళి , సామాన్యులకు సైన్స్ గురించి చెప్పండి " అన్నారు తప్పా , చాందస వాదాన్ని ప్రబోదించ మనలేదు. కానీ హిందువులలోనే కాదు , అన్య మతాలలో కూడా చాలా మందికి , వారికి కరువైన మానసిక ప్రశాంతత ను శాస్త్రీయ విజ్ఞానం కంటే అలౌకిక బావనలే కలుగ చేస్తున్నాయి కాబట్టి శాస్త్రీయ బావనలోతో పాటు అలౌకిక బావన లు సజీవంగా ఉంటున్నాయి. ఒక్క హిందూ జీవన విదానమే అటు అలౌకిక తత్వాన్ని, ఇటు శాస్త్రీయ దృక్పదాన్ని సమానంగా ఆదరిస్తుంది కాబట్టే విజ్ఞానులు అని చెప్పుకుంటున్న కొంత మంది ఎంతగా హిందూ బావనలను గేలి చేస్తున్నా వారి మీద ప్రజలు హింసాయుత దోరణిలో రియాక్షన్ చూపటం లేదు. అదే ఇతర మత విశ్వాసాల జోలికి వెలితే ఏమి జరుగుతుందో వారికి తెలుసు కాబట్టి వారి జోలికి వెళ్ళడానికి సాహసించరు విజ్ణానులు. ఈ కారణం వలన కూడా ఈ దేశ సాంప్రదాయక బావనలు మాత్రమే ఎక్కువుగా దాడికి గుర్వతున్నాయి. ఇది మెజార్తీ ప్రజలకు బాద కలిగిస్తుంది. అందుకే శాస్త్రీయ దృక్పదం అవగతం చేసుంకున్నా , దాని పేరుతో మత విశ్వాసాలను విమర్శిస్తే ఊరుకోడు . ఉదాహరణకు "కర్ణుడు కుంతికి, సూర్యుడు కు పుట్టాడు అంటే , ఇప్పుడు ఎవరూ నమ్మరు.కారణం సూర్యుడు తను ఉన్న చోటు నుంచి ఒక అంగుళం భూమికి దగ్గరగా జరిగినా భూమిఉండదు అన్న సంగతి తెలుసు కాబట్టి! కానీ దాని పేరుతో భారతాన్ని కించపరస్తే ఊరుకోరు. ఈ చిన్న పాయింట్ చాలా మంది విజ్ఞానులకు అర్దం కాక , ఏదేదో చెప్పి ,వారు చివరకు ప్రజలకు అంటరాని వారయ్యారు. అంటే ప్రజలు వారి మాటలు పట్టించుకోవడం మాని వేసారు. తెలివిగల సంస్కరణ వాదులు మతం లోనే ఉండి అజ్ఞానాన్ని రూపుమాపాలనుకుంటారు .. తెలివిలేని వారు నాస్తికత్వంతోనో, అన్యమత విశ్వాసాల పేరుతోనో అజ్ఞానాన్ని రూపు మాపాలని ప్రయత్నించి, చివరకు వారు చెప్పే మాటలు ప్రజలు ఎందుకు వినటం లేదో అర్ధంకాక, అసహన పరులై, వీరంగం వేస్తూ ఆబాసు పాలు అవుతూ ఉంటారు.
నేను పైన చెప్పినట్లు ఏ దృక్పదం అయినా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. ఉదాహరణకు మనం భూమి మీద నుండి విశ్వ పరిశోదనల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర గ్రహాల మీదకు వ్యోమ నౌక లను పంపుతున్నాం. విదేశియులు సేకరించిన సమాచారం మనకు పనికి వచ్చినా, విశ్వ శొదనలో మేమూ పోటిదారులమే అనే అహం తృప్తి పరచుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ సమాజానికి ఎంతో అవసరమైన "అమ్మ" ను ప్రసాదించే ఆడపిల్లను మాత్రం ఈ భూమి మీదకు రావడానికి మాత్రం అంగికరించలేని మనస్తత్వాన్ని పారదోలడానికి , రాకెట్లకు పెట్టే ఖర్చులో పది వంతు అయినా పెడుతున్నామా? ఆలోచించండి? ఏది మనకు పనికి వచ్చే శాస్త్రీయ దృక్పదం? అంగారక గ్రహానికి స్పేస్ షిప్లు పంపేదా? ఆడపిల్లలను బూమి మీదకు రానిచ్చేదా? శిశువుల్లో లింగ నిర్దారణ కి కారణం పురుషుడే కానీ స్త్రీ కాదు అని ఈ నాడు ప్రజలలో ఎంత మందికి తెలుసు? తెలిస్తే పుట్టిన ఆడపిల్లను అంత దారుణంగా బండ కేసి కొట్టి చంపుతారా వెదవలు ! ఆ పేరుతో రెండవ పెండ్లి చేసుకోవాడానికి సిద్ద పడతారా మగ పుంగవులు. కనీసం ఈ విషయం తెలిస్తే ఆడపిల్లలను కన్ననిందను తాము భరిస్తారా ఆడపిల్లలు? బరించరు కాక బరించరు. కానీ ఈ విషయం లో ప్రజలకు శాస్త్రీయ దృక్పదం కలిగించరు. ఎందుకంటే అది వారి లింగ నిర్దారణ వ్యాపారానికి దెబ్బ కాబట్టి, డాక్టర్లకు లాస్ కాబట్టి! పెరిగిన శాస్త్ర విజ్ఞానం ఆడపిల్లలను దారుణంగా పుట్టకముందే చంపేస్తుంటే, అది తప్పు అని మత విశ్వాసాలు గొంతెత్తి అరుస్తుంటే , వాటి మీద యుద్దం చెయ్యరే విజ్ఞాన వీరులు? ఇటువంటి డాక్టర్లు , లేబరిటరీలు మీద ఎన్ని కేసులు పెట్టారు సో కాల్డ్ విజ్ఞాన వాదులు. ఈ ప్రమాదం ముందే గ్రహించడం వలననే "ఆడపిల్ల పుడితే మహా లక్ష్మి" అనే విశ్వాసాన్ని హిందూ జీవన విదానం లో కలిగించారు పూర్వులు. కానీ వరకట్నం, పెరిగిన శాస్త్రీయ విజ్ఞానం ఆడపిల్లల్ని భూగ్రహం మీదకు రాకుండా చేస్తున్నాయి.
అందుకే ప్రజలకు పనికి వచ్చే శాస్త్రీయ విజ్ఞానమే ప్రజలకు అందాలి ,దాని కోసమే ప్రబుత్వాలు క్రుషి చెయ్యాలి తప్పా , పోటి తత్వంతో ప్రస్తుతం పనికి రాని వాటి కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించవలసిన పనిలేదు అని నా అభి ప్రాయం.అంగార గ్రహానికి " మామ్ "(MoM) లు పంపటం కాదు, , భూమి మీదకు "అమ్మ" లు ను రానిచ్సెదే నిజమైన శాస్త్రీయ విజ్ఞానం అని నా దృడాభిప్రాయం
Comments
Post a Comment