చక్కగా సంసారం చేసుకుoటే చాలు !. "బ్రెస్ట్ క్యాన్సర్ " ప్రచారం లో బెలూన్ లు ఎగరేయాల్సిన పనిలేదట !!?
పైన సమాచారం లో తెల్పిన అమెరికా పరిశోధకుల ఫలితానుసారం ఒంటరి తనం తో జీవిస్తున్న మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 60% ఎక్కువట. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ ని జయించే అవకాశాలు వారికి తక్కువేనట . ఎందుకంటే వీరికి మందులు వాడిన తర్వాత కూడా తిరిగి ఈ రోగం వచ్చే అవకాశాలు ఎక్కువే కాబట్టి . అయితే ఈ విషయం లో వారు ఒక ఆసక్తికర విషయం చెప్పారు . అదేమిటంటే, శ్వేతా జాతేతర మహిళలు బంధువులు , స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటె రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువైనట్లే , శ్వేత జాతి మహిళలకు భర్తలతో సత్సంబంధాలు ఉంటె బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తక్కువట . దీనివలన మనకు అర్ధమవుతుంది ఏమిటంటే శ్వేత జాతి స్త్రీలు మొగుళ్లు తో కలసి ఉంటానికి ఇష్టపడరు , శ్వేతా జాతేతర స్త్రీలు అత్త మామలు , ఇతర బంధువులతో సఖ్యతతో ఉంటానికి ఇష్టపడరు . పైకి మంచిగా , నవ్వుతూ మాట్లాడుతున్నట్లు అనిపించినా , మనసులో వారి పట్ల ఒకరకమైన విరోధ భావం తో ఉండటం వలన , సదరు విరోధ భావం చివరకు వారి ఆరోగ్యం మీదనే ప్రభావం చూపుతుంది అన్న మాట . అదే "రొమ్ము క్యాన్సర్ " రూపం లో బయటపడి "ఈ భూలోకం లో ఉండ తగిన దానివి కావు ,పై లోకానికి పద ,పద , అని తొందర చేస్తుంది అన్న మాట .
కాబట్టి అమ్మాయిలూ , పెద్దలు మెచ్చిన నచ్చినోణ్నిచేసుకుని , అత్తా , ఆడబిడ్డలు , స్నేహితులు ,ఇరుగుపొరుగుతో మంచిగా ఉంటూ , ఉన్నంతలో హ్యాపీగా జీవించగలిగితే బ్రెస్ట్ క్యాన్సర్ మీ దరి దాపులకు రాదు అన్నమాట . కుటుంబ సంబంధాలను , సామాజిక సంబంధాలను చెడగొడుతున్న నేటి TV సీరియల్స్ కి దూరంగా ఉంటే మీ ఆరోగ్యాలను పాడుచేసే అనేక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు . ఒకవేళ సీరియల్స్ ఏవైనా చూడాలి జోక్స్ సీరియల్స్లో చూసి హ్యాపీగా నవ్వేసుకుండీ . ఏదైనా మన ఆరోగ్యం తరవాతే కదా .
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఉద్దేశించిన "పింక్ రిబ్బన్ " క్యాంపెయిన్ లో "ఎవ్వరితో తో గొడవలు వద్దు,సర్దుకుపోయే సంసారమే ముద్దు" అనే స్లోగన్ చేరిస్తే మంచి ఫలితాలు వస్తాయేమో నిర్వాహకులు ఆలోచించాలి . ఏది ఏమైనా చక్కగా సంసారం చేసుకుoటే చాలు !. "బ్రెస్ట్ క్యాన్సర్ " ప్రచారం లో బెలూన్ లు ఎగరేయాల్సిన పనిలేదన్న మాట. స్త్రీల పాలిట మహమ్మారిగా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ని అరికట్టే విషయం లో ఏంటో ప్రాధాన్యత ఉన్న ఈ విషయాన్ని పేపర్లో ఎక్కడో ఒక మూలన చిన్నఐటెం గా ఇవ్వడం జరిగింది . దీని వెనుక ఉన్న కారణాలు ఏవైనా ఈ పరిశోధనా ఫలితాలు జనబాహుళ్యానికి తెలియాల్సిన అవసరం ఉంది . ఈ పోస్ట్ ని పదిమందికి షేర్ చేయగలరని మనవి !!.
Comments
Post a Comment