Posts

Showing posts from August, 2016

ఇంటర్నెట్లో ఆనందాలకు అలవాటు పడి, ఇంట్లో అనందాన్ని పట్టించుకోకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది!!

Image
                                                        మనిషి యొక్క ఆనందనమనేది అతని జీవన శైలి ని అనుసరించి ఉంటుంది. పెండ్లి కాక ముందు జులాయిగా తిరుగుతున్న కొడుకులను చూసి చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే " వీడికి మంచి అమ్మాయిని చూసి ముడి పెట్టేస్తే , దారి కొచ్చి బుద్దిగా ఉంటాడు" అని. అంటే జులాయిగా తిరుగుతూ తన ఆనందం తానూ వెత్తుకునే వాడి వల్ల  అతని ఆరోగ్యానికే కాక, కుటుంబానికి తద్వారా సమాజానికి మంచిది కాదు అని పెద్దల బావన .    ఉదాహరణకు ఈడోచ్చిన కుర్రాడు సావాసా ల రుచి మరిగి ఇంటి పట్టున ఉండకుండా , చెప్పిన పని చెయ్యకుండా బలాదూర్ తిరుగుతుంటే , ఎప్పుడు ఏ గొడవల్లో ఇరుక్కుంటారో అని తల్లి తండ్రులు బయపడుతూ ఉంటారు. అందుకే అతనిని ఇంటి పట్టున ఉంచటానికి పెండ్లి చెయ్యటం కూడా  ఒక మార్గం అనుకుని తగిన సంబందం చూసి పెండ్లి చేస్తుంటారు. సాదారణంగా కొత్త పెళ్ళాం మోజులో తన తిరుగుళ్ళకు స్వస్తి చెప్పి, ఇంట్ పట్టున ఉండి వేళకు తిండి తింటూ , నిద్ర పోతూ ఉండటం వలన చూడటానికి పెండ్లి కాక మునుపు కంటే బాగుండటం జరుగుతుంది. అటువంటి వారిని చూసి "వీడికి పెండ్లి నీళ్ళు పడ్డాయిరోయి" అని స్నేహితులు కూడా 

ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

Image
                                                                                                                                                            గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .                                                                                     మన దేశం లో కొన్ని  తప్పుడు వాదాలు ఉన్నాయి. అందులో స్త్రీ లను, పురుషులను మొత్తంగా వేరు చేసి చూసే "ఆదునిక స్త్రీ వాదం" ఒకటి. దీనినే "ఫెమినిజం " అని అంటారు కాబోలు. ఒక స్త్రీకి వ్యతిరేకంగా మరొక స్త్రీ నేరం చేస్తే దానిని పట్టించుకోదు స్త్రీ వాదం. ఆ నేరం లో ప్రమేయం ఉన్న పురుషుడిదే పూర్తి బాద్యత అని అడ్డగోలు వాదం చేస్తుంది . ఉదాహరణకు ఒక పెండ్లి అయిన వాడిని , అతని భార్య హక్కులుకు వ్యతిరేకంగా , అతనితో సహజీవనం చేస్తున్న   మరొక స్త్రీ  

మనిషిని "రోగి"ని చేసి,"రోడ్లు" మీద పరిగెత్తిస్తుంది ఎవరో తెలుసా?

Image
                         ఇంకెవరు? మనం ఎంతో గొప్పదని చెప్పుకుని మురిసి పోతున్న మన సాంకేతిక పరిజ్ణానం.అదేమిటి అని ఆశ్చర్య పోతున్నారా? చూడండి ఎలాగో!   వెనుకటి రోజుళ్ళో ఒక చిన్నదో, పెద్దదో ఎవరి స్తాయికి తగ్గటు వార్కిఒక  ఇల్లు ఉండేది.ఇంటికి ముందూ, వెనుక కోంత ఖాళి స్తలంఉండేది.ఇంటిలో ఒక చేద బావి ఉండేది.పొద్దునే సూర్యోదయానికి ముందే  లేచే అలవాటు అందర్కి ఉండేది.                లేవగానే చీపురు పట్టి, వళ్లు వంచి,ఇంటి ముందు, వెనుక ఊడ్చే వాళ్ళు.అదొక పావుగంట  పని. కళ్ళాపి చల్లి, అందంగా  ముగ్గులు వేసేవారు. పశువులు ఉంటే వాటి దగ్గర శుబ్రం చేసి,వాటి పాలు పిండి ఆడవాళ్ళు తమ ఉదయం పనులు తెమిలే సరికి రెండు గంటలు గడిచేవి. ఇక మగాళ్ళు అయితే చేద బావి లోనుంచి నీళ్ళు తోడి,గాబుల నిండా నీళ్లు నింపేవారు. ఆ తర్వాత ఇంటి పెరట్లోని కూరాగాయల మొక్కలకు,పూల మొక్కలకు, నీళ్ళు పోసే వారు.పొలం పనులు ఉంటే పొలాలకు వెళ్లే వారు, అది లేని వారు స్త్రీలకు పనులలో సహాయం చేసే వారు. ఈ విదంగా రోజు ఉదయం పూట కనీసం 2 గంటలైనా తమ శ్రమ్ శక్తిని,తమ ఇంట్లో వినియోగించే వారు.                          పై విదంగా వారు కష్టపడటం వల్ల, వారికి దక్క

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

Image
                                                                                                                                   హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో  ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు.   అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. అందరకు మాదిరే వివాహమ్ చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగా సాగిందనడానికి ఆనవాలుగా వారికి పిల్లలు కలిగారు. ఆ తర్వాత బార్యకి భర్త అంటే మొహం మొత్తింది కాబోలు, గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి పోయింది. పాపం ఆ భర్త పెద్ద మనుషుల ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్సాడు. అవ్వన్నీ విపలమయ్యాయి. చివరకు చేసేదేమి లేక, మరో

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

Image
                                                                                                  ఆమె ఒక సినిమా నటి . ఆతను టెన్నిస్ ప్లేయర్ . 1993 లో "స్తెర్న్' అనే జర్మన్ మేగజైన్ కోసం వీరిద్దరూ నగ్నంగా ఉన్న ఒక పోటో ని తీసి మాగజైన్ కవర్ గా ప్రచురించారు . దానినే తిరిగి ఇండియా లోని కలకత్తాకు చెందిన స్పోర్ట్స్ మాగజైన్ మరియు డైలీ పత్రికలు ఆర్టికిల్ ను పోటోలను రెపబ్లిష్  చేసారు . దాని మిద ఒక న్యాయవాది చేసిన కంప్లైంట్ మేరకు విచారణ జరిపిన స్తానిక కోర్టు మెజిస్ట్రేట్ కేసు నమోదుకు ఆదేసింఛి ప్రాసిక్యూషన్ చేపడితే దాని మిద సదరు పత్రికల వారు సుప్రింకోర్టు  దాక రావడం జరిగింది . చివరకు సుప్రీం కోర్టు వారు స్త్రీ నగ్న చిత్రం ప్రచురిo నంత మాత్రానా అశ్లిలం కాదు , దానివలన సామాన్య ప్రజల మనసులులొ సెక్స్ పూరితమైన తప్పుడు బావాలు ప్రేరేపించ బడితే తప్పా అది నేరం కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది . వివరాలు లోకి వెళితే  తెల్ల జాతికి చెందినా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ తన ఉడ్ బి నల్ల జాతి కి చెందిన మోడల్ బార్బరా ఫెల్తుస్ ని నగ్నంగా పట్టుకుని ఉన్న పోటొ ని స్వయంగా ఆమె తండ్రి పోటో తీసి

మొగుడు అంటే మోసేవాడు అని నిరూపించిన కేరళ అయ్యప్పన్ , ఒడిశా దానామాజీ !!!

Image
                                                                                                        భర్త అంటే భరించే వాడు అని భారతీయ సాంప్రదాయం లో పుట్టి పెరిగిన మగాళ్లు అందరికి తెలుసు. దానిని వేరొక రకంగా కూడా చెప్పవచ్చు . అదే "మొగుడు అంటే మోసే వాడు "అని కూడా . దానినే అక్షరాలా నిజం చేసి చూపారు భారతీయ సాంప్రాదాయం లో భాగమైన గిరిజన సంస్కృతీ పుత్రులు. నిజంగా భార్యా భర్తల బంధానికి మన సాంప్రాదాయం  ఎటువంటి నిర్వచనం ఇచ్చ్చిందో వీరిని చూసి తెలుసుకోవచ్చు . ఎందుకంటే ఇంకా ఆధునిక వాసనలు ఇంకా వీరికి అబ్బలేదు కాబట్టి పూర్వపు మనుషులు భార్యా భర్తల బంధానికి , కుటుంబ సంబంధాలకు ఎలాంటి విలువ నిచ్చారో, భార్యల పట్ల వీరు చూపిన ప్రేమ తో కూడిన   నిబద్ధతే సాక్ష్యం  . ఇక వివరాలు లోకి వెళితే ;                                                                         భార్యా శవాన్ని 10 కిలోమీటర్లు మోస్తున్న డానామాజీ! చోద్యం చూస్తున్న నాగరికులు.                                                        నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది . ఒరిసా కు చెందిన దానామాజీ ఒక గిరిజనుడు అతని

అత్త మీద కోపం , జిల్లా జడ్జ్ మీద చూపించిన రాకాసి కోడలు !

Image
                                                                                                              అత్తమీద కోపం దుత్త మిద చూపింద ని మనకొక సామెత ఉంది . పూర్వం ఇండ్లలో అన్నింటికీ మట్టి పాత్రలే వాడేవారు . వెనుకటి కుటుంబాలు అన్ని ఉమ్మడి కుటుంబాలే కాబట్టి , సాదారణంగా అత్తల పెత్తనమే ఇండ్లలో కొనసాగేది . కోడళ్ళు కాపురాలు చేయడం వరకే కొడుకులు తో పని. మిగతా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా అత్తల చేతిలో ఉంటుంది . అటువంటి కంట్రోల్ కోడలికి రావాలంటే ఆమె అత్త గా మారిన తర్వాతే అది సాద్యం . అలా మన కుటుంభ వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టి వ్యవస్థ లాగా ఒక క్రమ విదానం కలిగి ఉండేది . మరి అలాంటి కుటుంబాలలో అత్తల మిద కోడళ్ళకు కొన్ని సందర్బాలలో కోపం రావడం అనేది సహజంగానే జరుగుతుంటుంది . అలా వచ్చిన కోపాన్ని డైరెక్టుగా అత్తల మిద చూపించే స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోడళ్ళకు లేవు గనుక తమ చేతిలో ఉన్న' దుత్తలూ' అంటే మట్టి కడవ మిద చూపించే వారట ! అంటే అత్తగారు తిట్టగానే , కోడలు గారు చేతిలో మట్టి కడవని  విసిరి నేలకేసి కొట్టి పగుల గొట్టే వారు అట ! అప్కోర్స్ , ఆ పనికి కూడా అత్తలు చేత తిట్లు , తన్నులు తప్ప

అద్దెకడుపుల విపరీతపుపోకడల విషయం లో " మనవు" కోరికను మన్నించిన కేంద్ర మంత్రి మండలి !! ?

Image
                                                                               ది .28/6/2016 న తేదీన ఇదే   బ్లాగులో   దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!! అనే పోస్ట్ ప్రచురించడం జరిగింది. అందులో నటుడు తుషార్ కపూర్ తాను వివాహం చేసుకోకుండా కేవలం సింగిల్ పేరెంట్ గా సరోగసి పద్దతిలో ఒక బాబుకు తండ్రిగా మారిన విధానం ని నిరసిస్తూ "     ఈ  ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ  సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ  "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు  ఇచ్చారు?  చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది? అని అడగడం జరిగింది. ఇదే

సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకోని "పురం నాగమణి "

Image
                             రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత  P.V.  సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు  పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది.                ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్రకారం , నిజమాబాద్ లోని దుర్కి గ్రామానికి చెందిన పురం అశోక్ ,నాగమణిలకు మూడెల్ల క్రితం పెండ్లి అయింది. వారికి మొదటి సంతానంగా కూతురు పుడితే తేజశ్రీ

గోపిచంద్ గారు లాంటి గురువులు ఉన్నంత కాలము, P.V. సిందూ లాంటి క్రీడా తారలు మిల మిల మెరుస్తూనే ఉంటారు!!!

Image
             అటు ప్రభుత్వ దన్ను , ఇటు గురువు ఆశీర్వచనం ఉంటే ఇటువంటి పతకాలు ఎన్నో !!.                                               ఈ దేశం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స్కానింగ్ ల ద్వారా ఆడ  శిశువుల  ఆచూకీ కనుక్కుని వారిని హతమార్చే దుష్ట సంస్కృతీ ఉంది. దీనికి తండ్రులది ఎంత పాపపు బాధ్యతో అంతకంటే ఎక్కువ బాధ్యత తల్లులది . అదిగో అలాంటి పాపపు తల్లి తండ్రులను వరుసగా నిలబెట్టి , మొన్న ఒలంపిక్స్ లో విజయం సాధించిన భారత క్రీడాకారిణులు ఇద్దరు సింధు మరియు సాక్షి మాలిక్   ల కాలి చెప్పులతో సత్కారం చేస్తే కానీ వారికి బుద్ధి  రాదు. మన రాష్ట్రం మరియు హరియానాకు చెందిన ఆ ఇద్దరు ఆడ  పిల్లలు  ఒకరు రజతం , మరొకరు కాంస్య పతాకం సాధించినందు వలననే అంతర్జాతియ ఒలంపిక్స్ క్రీడా మైదానం లో మన దేశం యొక్క జాతీయ గీతం ఆలకించే  భాగ్యం దక్కింది. 125 కోట్లమంది ప్రజలు ఉన్న ఒక దేశం రియో  ఒలంపిక్స్ 2016 లో కనీసం ఒక స్వర్ణం  వచ్చినా బాగుండు అనే దౌర్భాగ్యపు పరిస్థితికి నెట్టబడింది అంటే దానికి ఎవరు కారణం ?                                                                       సింధు ఎత్తింది అమ్మోరి బోనం మాత్రమే కాదు ,రెం

మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?

Image
                                                                                                                                                  ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట్టడానికి కాదు. ఒక వేళా నేరస్తుణ్ణి చంపాలన్నా అదీ కూడా  చట్టబద్ద విదానాల ద్వారానే జరగాలి తప్పా , చట్ట వేదింపులు గురి అయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితుల్లో కాదు. అలా 95% దుర్వినియోగ మవుతూ భారతీయ భర్తల ఆత్మహత్యలకు కారణ మవుతున్న 498-A  నేరస్మ్రుతి నిబందన పై తక్షణం సమీక్ష జరిపి సవరించాల్సిన అవసరం  ఉంది.   భారత దేశానికి ఉన్న విశిష్టతల్లో బలమైన కుటుంభ వ్యవస్థ కూడా  ఒకటి . స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమ

5 గురు కలసి అమ్మాయిని "గాంగ్ రేప్ " చేసిన వాళ్ళు "భాయ్ ప్రెండ్లు " అవుతారా?

Image
                                                                                                                              వేయి గంగా నదులు నీరు తెచ్చి కడిగినా ప్రస్తుత భారతీయ సమాజం లోని మలినం తొలగిపోయేలా లేదు. ఈ  సమాజాన్ని మతిమాలిన స్వేచ్చా విదానాలు, కట్టుబాట్లు లేని పిల్లల పెంపకాలు, బ్రష్టు పట్టి పోతున్న కుటుంబ సంబందాలు అన్నీ, అన్నీ కూడి  సర్వ నాశనం చేస్తున్నాయి. పట్టుమని పదిహేనేళ్ళు దాటని మగ పిల్లలు ఆడపిల్లలను గాంగ్ రేప్ లు చేసే హీన స్తాయిలో ఈ  సమాజం ఉందంటే, దానికి కారణO  ఎవరు? ఇప్పుడు సమాజం లో ఏమి జరుగుతుందో తెలియక ఎప్పుడో సమాజం లో ఉన్న దురాచారాలు , వాటికి కారకులైన పూర్వికులను నిరంతరం తిడుతూ , సమాజం లో మరింత విశ్రుంఖల మైన స్వేఛా  బావ  వ్యాప్తికి కారకులవుతున్న ఆదునిక వాదులా ? , పరిస్తితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకుండా , ఎప్పుడో తమ తాతలు చెప్పిన దానినే వల్లెవేస్తూ, పరమ చాందసంగా ప్రజలు త్రుణికరించే బావాలను ఇంకా సజీవంగా ఉంచాలనుకునే చాందస వాదులా? నన్నడిగితే అటు ఆదునిక వాదులు, ఇటు చాందస వాదులు ఇరువురూ ఈ  సమాజాన్నిఎంతవరకు దిగజారా లో అంతవర

ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా యే ఫస్ట్ అట!!?

Image
                                                                                                              నిన్న ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు కాకపోయినా , చదువరులను ఆకర్షించే అంత అక్షరాలతో "మహిళలను అవమానించడం లో మనమే ముందు" అనే శిర్షికతో ఒక వార్తను ప్రచురించారు. దాని పక్కనే చిన్న అక్షరాలతో "సిగ్గు, సిగ్గు" అని కూడా ఉంది. ఏంటబ్బా అని విషయం మొత్తం చదివితే ఆడవాళ్ళను గోకడం లో ఆంద్రా స్టేట్ మొదటి వరుసలో ఉంటె , అత్యాచారాల విషయం లో మాత్రం ఆ క్రెడిట్ మద్యప్రదేశ్ వాళ్ళు కొట్టేసారు.తెలుగు రాష్త్రాలుకి , మద్యప్రదేశ్ కి అత్యాచారాల  సంఖ్య విషయంలో చాలా తేడా ఉంది. ఈ  లెక్కలు ఎవరో చెప్పిన కాకి లెక్కలు కావు. సాక్షాత్తు మనదేశ జాతీయ నేరాల నమోదు సంస్థ వారు ప్రకటించినవి కాబట్టి నమ్మదగినవే . వారు 2014 సంవత్సరానికి గాను దేశం లో  జరిగిన రక రకాల వేదింపులు , నేరాలు కు సంబందించి ఒక చిట్టా విడుదల చేసారు . అదేమిటో క్రింద చూడండి.                                                                                                                                             

చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?

Image
                                                                                                                                మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం వివిద ప్రాంతాలనుండి కొంత మంది అన్య మత భోదకులను కొండ మీద ఉన్న ప్రైవేట్ హోటల్లు లాంటి ఇతర సంతలలో వర్కర్స్ గా చేర్పించి, వారి ద్వారా చాప క్రింద నీరులా మత ప్రచారం చేయించారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, తిరుమల కొండలు  అంటే ఏదు కొండలు కాదని, ఒక కొండ మాత్రమే అని మిగతా వాటి మీద అందరికి హక్కు అంటే ముఖ్యంగా ఆ వంకతో తమ మత సంస్తలు నెలకొల్పుకునే హక్కు ఉందని ప్రాచారం చేయడం వరకూ వెళ్ళింది. కాని తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్లు, వారు గోర దుర్ఘటనలో మ్రుతిచెందడంతో అన్యమత విశ్వాసులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది.    కాని కాసులకు కక్కుర్తి పడే మన అధికారులు గురించి తెలుసు కాబట్టి, తమ పద్దత్తులను వారు ఇంకా గుట్టు చప్

ఎంత ఘోరం ! అమ్మాయిల మాదిరి ఆవులను కూడా కారులో కిడ్నాప్ చేస్తారా ఈ కసాయీలు !!!

Image
                                                                                                    అస్సలు నమ్మబుద్ది కావటం లేదు . ఇంత దారుణానికి తెగించిన మనుషులు ఈ  భూమి  మీద మన మధ్యనే ఉన్నారా? ఇలాంటి కసాయి వాళ్లు రాక్షస సంతతికి  కాక మరే సంతతికి చెందిన వారై ఉంటారు . ఇలాంటి  అకృత్యాలు చూస్తున్నప్పుడు మనిషి అన్న వాడికెవరికైనా ఒళ్ళు మండదా? అలా మండి ఏదైనా అన్నా , చేసినా  దేశ వ్యాప్తంగా గగ్గోలు !.        ఈ  దేశం లో రక్షణ లేని ఆడపిల్లలను కారుల్లో ఇతర వాహనాల్లో బలవంతంగా తీసుకువెళ్లి పాడు చేసి చంపుతున్న కామాంధులు గురించి వింటున్నాం . అటువంటి వారికి అంగ చేదం చేసి పబ్లిక్ గా ఉరి వేసి చంపాలని కోరుకుంటున్నాం. ఈ  దేశం విధుల్లో ఇన్నాళ్లు  ఆడపిల్లల కు మాత్రమే రక్షణ లేదని అనుకుంటున్నాం . కానీ క్రింది వీడియో చూస్తుంటే ఆడపిల్లలకు మాత్రమే కాదు ఆవులకు కూడా రక్షణ లేదని యిట్టె అర్ధమవుతుంది. ఒక అబలని కిడ్నాప్ చేసి కామాంధులు ఎలా బలవంతంగా తీసుకెడతారో అచ్చం అదే మాదిరి ఒక అవును కూడా కారులో కి బలవంతంగా ఎక్కించి తీసుకు వెళ్లారు అంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి. కేవలం గో మాంసంకోసమే  వారు అలా చేశారా? లేక ఇం

"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!.

Image
                                               స్తీ వాదం పేరుతో  ఎంతో మంది రచనలు చేసి ఉంటారు. అందులో అందరిది ఒకటే బాధ .సంసార స్త్రీకి సంసారంలో  భర్త ఆదరణ తగినంతంగా లభించని వారు దాని కోసం వేరొకరితో లేచిపోయినా తప్పు లేదని తేల్చెయ్యడానికే మొగ్గు చూపారు. సెక్స్ విషయంలో సమాజంలో పురుషునికి ఉన్న స్వేచ్చ స్తికి లేదని అందువల్ల స్తికి చాలా అన్యాయం జరుగుతుందని స్తివాదుల ఆరోపణ. వీరికి "వీర గురువైన "చలం" గారు లేకపోయీనా ఆయన అందించిన  మైదాన సాహిత్యం ఇంకా ఆదుకుంటూనే ఉంది. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. దానిని ఖండించడంలో తప్పులేదు. కాని మగవాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆడదానికి ఆ స్వేచ్చను ఇమ్మని అనడం ఎంత దిగజారుడు తనం!    మనిషి అన్నాకా బలహీనతలు ఉంటాయి. కాని ఆ బలహీనతలు సంసారాలు పాడు చేస్తాయి కాబట్టే దానికి నియంత్రణలు అవసరం. ఇందులో ఆడ మగ అనే బేదం ఉండటానికి వీలు లేదు. వ్యవ సాయం చెయ్యడానికి గిత్తలకు "వ్రుషణ నియంత్రణ" చేస్తారు. అవి ఎద్దులుగా మారి వ్యవసాయం చెయ్యడానికి ఉపయోగ పడతాయి. సంతానోపత్తి కోసం కొన్నింటిని వదలివేస్తారు అవే "

అమ్మా బొమ్మా M.P లను అదరగొట్టిన లగడ పాటి వారి "లైంగిక రక్ష" నే వాడండి !

Image
                                                                                                                                                                            మొత్తానికి పార్లమెంట్  పరువు పొతే పోయింది కాని , పెప్పర్ స్ప్రే పవర్ ఏమిటో బారత జాతికి  తెలిసి వచ్చింది . ఇన్నాళ్ళు దేశంలో మ్రుగాల్లు ఆడవాళ్ళ మిద  లైంగిక దాడులు చేస్తూ ఉంటె , వారి నుండి రక్షిo చుకోవడానికి  "చేతిలో సెల్ ఉoచుకోoడి , అందులో ఒక అప్ ఉంచుకోండి " అని చెప్పారు కాని , పర్స్ లో పెప్పర్ స్ప్రే ఉంచుకోండి అని ఎవరైనా చెప్పారా ! రాఖి కట్టిన ప్రతి చెల్లికి డబ్బులు బదులు,  ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ కొనివ్వాలి అని ఏ  అన్నైనా ఆలోచించాడా ? పోలిస్ వారు చెప్పే జాగర్తలలొ అయినా "బయటకు వెళ్ళే ప్రతి స్త్రీ "పెరఫూం స్ప్రే ఉన్నా లేకపోయినా పెప్పర్ స్ప్రే మస్ట్" అని చెపుతున్నారా ? లేదే ! ఎందుకని అంటే దాని పవర్ ఏమిటో ఇంతవరకు సగటు భారతియుడుకే  కాదు చాలా మందికి తెలియదు . అదిగో అలాంటి వారందరికీ సాక్షాత్తు భారత పార్లమెంటులోనే దాని శక్తిని ప్రదర్శించి అందరిని "అబ్బా " అనేలా చేసారు విజయవాడ M.P

ఆమె ను అతడు 3 ఏండ్ల నుండి లాడ్జ్ ల వెంట తిప్పుతూ రేప్ చేస్తున్నాడు అంటా !!

Image
                                     కొంతమంది అత్యాచార బాదితులం అని చెప్పుకునే వారి కంప్లయింట్ లు చూస్తుంటే , వారు పోలీస్ వారి చెవిలో మాత్రమే కాకుండా యావత్ సమాజం చెవిలో కూడా ఎంతెంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టాలని చూస్తున్నారో యిట్టె అర్థమై పోతుంది . ఒక స్త్రీ పై అత్యాచారం జరిగిందని రుజువు చెయ్యడానికి ఆమె మీద అనేక రేప్ లు జరిగి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటంటే ఒకే సారి ఆమె ఇష్టం లేకుండా ఏ పర పురుషుడైనా లయింగిక దాడి జరిపితే చాలు. అది అత్యాచారం గానే పరిగణిస్తారు. ఒక వేళా ఆ పురుషుడితో కొంతకాలంగా సంబంధం కలిగిఉన్నపటికి , వారి మధ్య వైవాహిక సంబంధం లేకుంటే , ఏ ఒక్కసారి అయినా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిపే లయింగిక దాడిని అత్యారాచారం గానే పరిగణిస్తోంది ఇండియన్ పైనల్ కోడ్ లోని 376 సెక్షన్ . మరి ఇంత స్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు  కాకమ్మ కధలు చెపుతూ అటు కోర్టులను ఇటు సమాజాన్ని నమ్మింప చేయడమెందుకో?      పై ఉపోద్గాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే ఇటీవల ముంబాయి దగ్గర థానే లో ఒక స్త్రీ ఇచ్చిన కంప్లయింట్ చూసి . ఆమె కార్మికురాలు  అంట . ఆమెకు 50 ఏండ్ల పై బడిన మరో కార్మికుడితో  అనుకోని ప