అడవుల్లో నాగు పాములను చంపేవారిని పట్టించుకోకుండా , నగరం లో స్త్రీలకు "నాగపూజ " వద్దని చెపుతున్న ఆటవిక అధికారులు!!?

                                                                                   

                        రేపు నాగ పంచమి ! శ్రావణ మాసం లో 5 రోజును నాగపంచమిగా జరుపుకోవడం హిందువులకు ఆచారం. ఉత్తరాది వారి సంగతేమో కాని , మన తెలుగు వారు నాగపంచమి నాడు కంటే దీపావళి తర్వాత వచ్చె "నాగచతుర్ది " కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు . దానినే మనం నాగుల చవితి పండుగ అంటాం.
       
                             నాగపంచమి నాడు అయినా , నాగుల చవితి నాడైనా స్త్రీలు చేసేది ఒక్కటే . నాగుపాముల అరాదించడం . నాగుపాములకు ప్రతీకలుగా జనావాసాలకు దగ్గర్లోనో, దేవాలయాల్లోనో ఉండె పుట్టలు వద్దకు వెళ్లి అందులో  ,పిండి పదార్దాలు తో పాటు పాలు పోసి , భక్తీ బావంతో పుట్ట చుట్టు తిరిగుతూ  పాటలు పాడుతూ, నాగ జాతి పట్ల తమకున్న భక్తీ బావంతో కూడిన ఆత్మీయతను చాటుకుంటారు. ఆ రోజంతా ఉపవాసం కూడా ఉంటారు. ఈ  విదమైన  నాగ పూజ వలన తమ అలస్యపు వివాహాలకు కారణమవుతున్న అడ్డంకులు తొలగిపోతాయని  అవివాహితులు  నమ్ముతుంటే  , తమ అలస్యపు సంతాన ప్రాప్తికి కారణమయ్యే గ్రహ దోషాలనుంచి విముక్తులు అవుతామని వివాహితులు నమ్ముతున్నారు . అలాగే రుణ పీడ బాద , గ్రహపీడ బాద నుంచి విముక్తులు అయి తమ బవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంతుందని ఎక్కువ మంది నమ్మడం వలననే మన దేశం లో "నాగ ఆరాధన " ఈ  నాటికి   సజీవంగా ఉంది. నాగదేవతను  తరాలుగా కొలుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో మా కుటుంభం కూడా ఒకటి కావడం మాకు ఎంతో మానసిక సంతృప్తి ఇస్తుంది.

                                                                             
for full details see http://ssmasramam.blogspot.in/2013/05/the-great-miracle-of-lord-nagendra.html

          చరిత్ర లేక పురాణాల ప్రకారం మన పూర్వీకులు నాగ జాతీయులు. నాగ సర్పాలను కొలవడం అనేది మన నర నరాన  జీర్ణించుకోని పోవడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ  నాగ   ఆరాధన పద్దతే కారణం. నాగులు ప్రక్రుతి మిత్రులు అని , వాటి ఉనికి మానవ అభివృద్దికి అవసరం అని బావించబట్టె , నాగు పాములును దేవతలు గా చేసి తాము   నాగజాతికి చెందిన వారమని ప్రకటించుకోవడమే కాక , నాగప్రతీకలు ధరిస్తూ , నాగులును కొలిచే అపూర్వ జాతికి చెందిన వారం మనం . ఒకవేళ నాగ సర్పాలు అన్నీ జీవులు లాగ  మామూలు పాములే అని బావించి ఉన్నట్లైతే చైనా లో మాదిరి ఆ జాతి కూడా మన  ఆహారంగా మారి పోయి ఉండెది. అలాంటి  బౌతిక జ్ఞానం  .ఉన్న వారే నాగు పాములు ను పట్టి వదించి, వాటి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు.  అంటే ఏమిటి? నాగు పాములను పూజించడం అంటె ఆ జాతిని సంరక్షించడమే . నాగుపాములను బౌతిక  దృష్టితో  చూడడం అంటె వాటికి హాని కలిగించడమే.

     రేపు నాగ పంచమి వస్తుందని  తెలుగు రాష్ట్రాల ఆటవిక అంటే అడవులకు సంబందించిన అధికారులు ఒక స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారట. వీరికి T V 9 లాంటి బౌతిక మీడియావారు , ఇతర విజ్ఞాన సంస్తలు వారు తోడై ఒకటే ఉదర గొట్టడం మొదలు పెట్టారు. పుట్టలు దగ్గరకు వెళ్ళవద్దని , వాటిలో పాలు , ఇతర పదార్దాలు వేయవద్దని , అలా చేస్తే అందులో ఉన్న పాములకు టైపాయిడ్ , మలేరియా వస్తుందని ఎవో పనికి మాలిన మాటలు చెప్పడం మొదలు పెట్టారు. T V 9 వారైతే ఏకంగా తమ దిక్కు మాలిన అవేర్ నెస్ ప్రోగ్రామ్ కోసం  ఒక పాములు పట్టె వ్యక్తి ద్వారా నాగు పామును ను తెప్పించి , ఒకరిద్దరు స్త్రీలను ప్రేరేపించి బలవంతంగా ఆ పాము నోరును తెరిపించి , దానిలో పాలుపోయించడమే కాక పసుపు కుంకుమ వేసి ,ఆ పాము ఉక్కిరి బిక్కిరి అవుతుండగా  వీడియో తీస్తూ , ప్రజల కు జ్ఞాన  బోద లో బాగంగా ఇదంతా చూపిస్తున్నామని చెప్పడం ఎంత దుర్మార్గం. ఇదే పనిని అరబ్ దేశాలలో వారి విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసినట్లైతే ఈ  పాటికి   మీడియా వారిని అడ్డంగా నడి రోడ్డు మీద అధికారికంగా నరికి పారేసే  వారు. ఎవరైనా నాగ భక్తులు ఈ  విదంగా  పాములను పట్టి బందించి , బలవంతంగా నోరు తెరచి పాలుపోయడం మనం ఎప్పుడైనా చూసామా? వీళ్ళ  హిందూ వ్యతిరేక  బావజాల ప్రచారం కోసం ఇలాంటి  తప్పుడు   సంకేతాలు ఇచ్చే ప్రోగ్రాం లు ప్రసారం చేస్తారా? మరి ఇంతకి ప్రోగ్రాం లో చూపించిన ఆ పామును పట్టి హింసించిన   వ్యక్తులను, , దానిని పైశాచిక ఆనందం తో వీడియో షూట్ చేసిన T V 9 సిబ్బంది మీద పారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు కేసులు పెట్టారా? పెట్టక పోతే ఎందుకు పెట్ట లేదు? భక్తులు  పాలు
పోసే పుట్టలు వద్ద జన సంచారం ఉంటుంది కాబట్టి వాటిలో పాములు ఉండే అవకాశాలు స్వల్పాటి స్వల్పం. కేవలం నమ్మక్కం వలన కలిగే అలోకిక ఆనందం కొరకే నాగ భక్తులు చేసున్న నా గ పుట్ట పూజ ఉద్దేస్యం.


           ఇక పోతే ఆటవిక అధికారులు సంగతి. అసలు పుట్టలో పాలు పోసే భక్తులు ఎవ్వరూ అడవిలోకి పోయి పుట్టలో పాలు పొయ్యరు. పైన చెప్పినట్లు జనావాసాలకు దగ్గరగా ఉన్న పుట్టల్లో నే పోస్తారు. పుట్టలను నాగా ఆవాసాలకు ప్రతీకలుగా బావిస్తారు కాబట్టి అందులో పాలు పోస్తారు తప్పా , నిజమగా అందులో పాము ఉందంటె ఆ చాయలకు కూడా వెళ్ళరు. నాగ పూజ అనేది ప్రతీకాత్మకమైనదే . విగ్రహరాదనలో బాగంగానే ఇది ఉంటుంది. బౌతిక పూజా పద్దతి ద్వారా అలౌకిక ఆనందం పొందటమే "పుట్టలో పాలు పోసే " ఆరాధన పద్దతి. దానికి అటవీ శాఖ వారు  నాస్తికులతో కలసి హిందూ ఆరాధనా పద్దతులను  అవమానించే విదంగా అవేర్ నెస్ వంకతో నగరాల్లో కార్యక్రమాలు చేపట్టడం ఎంత వరకు సమంజసం? అసలు మీ మీ అటవీ జూరిస్ డిక్షన్ ఏరియాలో ఉన్న నాగు పాములు , ఇతర పాముల సంఖ్య ఎంతో మీ దగ్గర లెక్క ఉందా? అందులో ఏటా ఎన్ని పాములు స్మగ్లర్ల దన దాహానికి బలి అవుతున్నాయో  తెలుసా? మీలో ఎంతమంది అవినీతి అధికారులు వారికి సహాయం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసారా?ఇటువంటి "నాగపూజ " వ్యతిరేక అవేర్ నెస్ ప్రోగ్రామ్ కొరకు మీరు ఖర్చు చేస్తున్న ప్రజాదనం ఎంత?  ముందు వాటి వివరాలు ప్రజకు తెలియ చేయండి. అడవుల్లో పామును చంపే వారిని పట్టించుకోకుండా నగరాల్లో ని స్త్రీలకు నాగ పూజ వద్దని చెపుతారా !? స్నేక్ అవేర్ నెస్ పేరుతో నగరం లోని పోరగాళ్ళకు  పాటలు చెపితే అడవుల్లోని స్మగ్లర్లకు జ్ఞానోదయం కలుగుతుందా? నాగ జాతి వేట ఆగుతుందా? మీకు చేత కాకపోతే చెప్పండి . పుట్టలో పాలు పోసి పూజించే హిందూ జాతి యే, తాము దైవంగా బావించే నాగ జాతిని రక్షించుకోవడానికి స్మగ్లర్ ల అంతు చూస్తుంది.

                         హిందువు లకు  ఒక విన్నపం . ఇక నుండి ఎవరైనా నాగు పాములను పట్టి ఆడిస్తుంటె దానిని చూచి వినోదించడమ్ పాపం గా బావించాలి . అలా పట్టి ఆడించే వారి మీద దగ్గర్లోని సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చి వారి మీద చర్యలు తీసుకునే లా చూడాలి. పాముల పుట్టల్లో పాలు పొద్దాం. కాని పాముల నోట్లో కాదు. నాగు పాములకు మనస్దులో పూజ  చేద్దాం . కాని పాములను హింసించే వారికి బడితే పూజ చేదాం. ఇది ప్రతి హిందువుకు సంకల్ప దీక్ష కావాలి.

       ఈ రోజు  "నాగ పంచమి " సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు . జై నాగేంద్రాయ నమః !

                           స్నేక్ అవేర్ నెస్ ప్రోగ్రాం కూడా క్రింది విడియోలో చూడండి మరి.       

                      

                                       (Republished Post. 18/8/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!