ప్రియురాలికోసం భర్త భార్యను చంపితే , భార్య శవం పక్కనుండగా భర్త తో 2 రాత్రులు కులికిన ప్రియురాలు !!
ఢిల్లీకి చెందిన ఫిరోజ్ , హలీమా భార్యా భర్తలు. 12 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకుని 10 ఏండ్లు సజావుగా కాపురం చేసిన వారు , 2ఏండ్ల క్రితం ఏర్పడిన మనస్పర్థలతో విడివిడిగా ఉండాల్సి వచ్చ్చిందట. వారిద్దరూ ఒక రెస్టారెంట్ లో వెయిటర్ , వెయిట్రేస్ గా పని చేస్తున్నారు . భార్యా విడిగా ఉండడం తో అదే రెస్టారెంట్ లో పని చేసే సుమన్ @పూజిత అనే ఆమే తో సంబంధం ఏర్పరచుకుని ఆమె తో కలసి తన ప్లాట్ లో సహజీవనం చేయడం మొదలు పెట్టాడు.
వీరిద్దరి సహజీవనం సంగతి తెలుసుకున్న హలీమా , తన ఇంటికి తానూ వచ్చి తన భర్త తనకే కావాలనిసుమన్ ని అతని విడచి వెళ్లాలని , గొడవ చేయడం మొదలు పెట్టింది . ఆ క్రమం లో పోయిన బుధవారం ఫిరోజ్ ,సుమన్ ఉంటున్న ప్లాట్ కి వచ్చి నానా గొడవ చేయడం తో , వారు ఎలాగైనా హలీమా ను వదిలించుకోవాలని , ఆమెను క్రింద పడవేసి గొంతు నులిమి చంపివేశారు. ఆ తర్వాత ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా హలీమా శవాన్ని మంచం కి అమర్చి ఉన్న పెట్టెలో పడవేసి , హ్యాపీగా 2 రాత్రుళ్ళు అదే మంచం పై అనందం అనుభవించారు.
ఇలా ఆ 2 రోజులు ఏమి జరగనట్లే ప్రవర్తించారు వారు. ఇంటికి అతిధులు వస్తే వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా అన్ని మర్యాదలు చేసి పంపారట . ఆ తర్వాత ఎక్కువ రోజులు శవాన్ని అక్కడ ఉంచితే తాము పట్టుబడడం ఖాయం అని భావించి ఆ శవాన్ని శుక్రవారం రాత్రి బయటకు తీసి , ఒక గొనె సంచిలో పడవేశారు అట. ఆ సంచిలో శవం పట్టనందుకు , మరియు శవం ఎవరు గుర్తించకుండా ఉండేందుకు ముఖాన్ని క్రష్ చేసి , ఆసవం ఉంచిన సంచిని తీసుకు వెళ్లి అదే లొకాలిటీలో ఉన్న ఒక చెత్త కుంది వద్ద పడవేసి , కామ్ గా అదే రాత్రి వారు ఇంటికి తాళం పెట్టి శక్రపూర్ అనే ప్రాంతానికి వెళ్లి పోయారు.
వాసన వస్తున్నా శవం నిగమనించి చుట్టుప్రక్కల వారు ఇచ్చిన సమాచారం తో కేసుబుక్ చేసి రంగం లోకి దిగిన పోలీసులకు మొదట్లో ఆ శవం ఎవరిదో తెలియక ఇబ్బంది పడాల్సి వచ్చింది . చివరకు కొన్నాళ్లుగా తాళాలు వేసి ఉన్న ప్లాట్ లలోని వారి గురించి విచారణ జరిపే క్రమంలో ఫిరోజ్ , సుమన్ లు 4 రోజులుగా లేరని తెలిసింది. ఫిరోజ్ ఇంటి ఓనర్ హలీమా ను గుర్తించడం తో ఇన్వెస్టిగేషన్ ఈజీ అయిపోయింది. ఫిరోజ్ సుమన్ లు ఎన్ని వెదవ వేషాలు వేసినా చివరకు పోలీసులకు చిక్కక తప్పలేదు. పోలీస్ వారి మర్యాదలకు తట్టుకోలేక అసలు నిజం క్రక్కేసరికి , దానిని విన్న పోలీసులు , ఆ చుట్టుప్రక్కల వారు "మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉంటుందా " అని విస్తుపోయారు అట. అది విషయం.
.స్త్రీకి స్త్రీయే శత్రువు అనేది హలీమా విషయం లో నిజం అయింది . కనీసం సుమన్ లో ఏ మాత్రం మానవత్వం ఉన్న ఆమెను ఫిరోజ్ చంపేవాడు కాదు. ఇష్టం లేకపోతె చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వారు బ్రతికే అవకాశం ఉన్నప్పటికీ , అలా ఆమెను ఘోరంగా చంపి ఆ శవం సాక్షిగా 2 రోజులు ఎంజాయి చేసారూ అంటే అది వారిలోని రాక్షసత్వానికి నిదర్శనం . ఫిరోజ్ , సుమన్ లు సభ్యసమాజం లో ఉండ తగిన వారు కారు. వారిని ఉరివేసి చంపడమే హలీమాకు సమాజం ప్రసాదించే న్యాయం
Comments
Post a Comment