మాజీ నక్సలైట్ కు ఉన్న "మరదలి మీద మోజు" అతనిని మట్టుపెట్టెలా చేసిందట!

                                                                     


                                          గతి తార్కిక బౌతిక వాదం గురించి, ఆ మాజీ నక్సలైట్ గారికి ఏమి తెలుసో మనకు తెలియదు కానీ , గతి తప్పిన వైవాహిక సంబందాలు మనుషులుని ఎంత నీచానికి దిగ జారేలా చేస్తాయో అతని జీవన విదానమే తెలియ చేస్తుంది. వివరాల్లోకి వెలితే,

                         అతనొక మాజీ నక్సలైట్. అసలైన అన్నలతో కుదరక బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలసినట్లుంది. అతని పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు కి ఆరేళ్ళ క్రింతం సంద్య అనే ఆమె తో పెండ్లి అయింది. సంద్య కు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సుమ. మరదలి పెండ్లి శ్రీనివాసరావే దగ్గరుండి మరీ చేయించాడట! మరదలి అత్తగారిది వరంగల్ . మరదలకి మూడేళ్ళ బాబు. ఆమెకు మొగుడుతో సరిపడక విడాకులు తీసుకుందా మనుకున్నారట! ఈ  లోపు టైం వెస్ట్ ఎందుకని ఒక ప్రముఖ (?) దినపత్రిక ఉప సంపాదకుడితో పాత పరిచయం కొనసాగించిదట. దీనికి ఒళ్ళు మండిన శ్రీని వాసరావు " మొగుడు లేకపోతే అక్కమొగుడు దిక్కు కానీ, వేరేవాడితో వ్యవహాఅరాలేంటి " అని మరదలని తన తో సహజీవనం సాగించమని చెప్పట్టమే కాక, అందుకు చెల్లెల్ని ఒప్పించే బాద్యత పెళ్ళానికి అప్ప చెప్పాడట! అంతే కాక ఆమె బాయి ప్రెండ్ సూర్యకిరణ్ ని  కూడా  చంపుతానని బెదిరించాడట! అంతె! అతనితో ఎప్పటికైనా తమకు ముప్పే అని బావించిన బార్య , మరదలు, ఆమె ప్రియుడు కలసి శ్రీనివాస రావును మట్టుపెట్టడానికి ప్లాన్ వేసారు.

                           ఆ ప్లాన్ లో బాగంగా సంద్య,సుమ  తమ బంగారం తాకట్టు పెట్టి, 2 లక్షలు తీసుకున్నారు. ఇద్దరూ కలసి ఖమ్మం లో ఉన్న సూర్యకిరణ్ దగ్గరకు వచ్చి గట్టి ప్లాన్ ఒకటి రచించారు. దాని ప్రకారం సూర్య కిరణ్ , తన బందువుని, స్నేహితులని  హైదరాబాద్ నుంచి పిలిపించాడు.వారితో 2లక్షల ముప్పై వేలకు డీల్ కుదిరింది. సంద్య, సుమ జానం పేట లోని తమ పుట్టింటీకి వెళ్ళారు . వారి కోసం శ్రినివాసరావు అతారింటికి వచ్చాడు. ఆ తెల్లవారు జామునే అతనిని ముందుగా వేసుకున్న పడకం ప్రకారం సంద్య, సుమ, సూర్యకిరణ్, అతని బందువు, స్నేహితులు  కలసి దారుణంగా చంపారట! అతనిని చంపటానికి వారుపయోగించిన ఆయుదాలు ఏమిటో తెలుసా? రాళ్ళు, కత్తి , అట్లకాడ. అంటే అతని బార్యకు, మరదలికి అతని మీద ఎంత కసి ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది.

                               ఆ తర్వాత సూర్య కిరణ్ మీద అనుమానంతో నిఘా పెట్టిన పోలిసులు, అతడు హత్య తాలూకు సొమ్ము కోసం జానం పెట వచ్చినప్పుడు వల వేసి పట్టుకున్నారు. నాలుగు పీకులు పీకితే మొత్తం కద బయటకు వచ్చింది. అందరిని అరెస్ట్ చేసిజైలు కు పంపారు. అదీ సంగతి. చూసారా! వైవాహిక బందాలకు కట్టుబడని బ్రతుకులు ఏనాటికైనా ఇలాగే తయారు అవుతాయి. ఎంత చదువు ఉన్నా, ఎటువంటి హోదాలో ఉన్నా, తనను తాను నియంత్రించుకోలేని వాడు పర నియంత్రణకు గురి కాక తప్పదు . సమాజపు కట్టుబాట్లు అనేవి  ట్రాష్ అనుకునే వారు , తమ ఇచ్చాఅను సారం నడచుకునే స్వేచ్చ తమకుందని బావించి, నాయకులు పార్టీలు మారినట్లు,సంసార గృహాలు మారుస్తూ ఉంటే అటువంటివారిమీద ఎవరికీ సదభిప్రాయం ఉండదు. కానీ తనకు నచ్చిన వారితో సహజీవనం కొనసాగించే హక్కు తమ కుందని సుమ లాంటి వారు బావిస్తే, వారికిశ్రినివాస రావు లాంటి వారు తారసపడినపుడు చట్టపరమైన చర్యలకు కాకుండా , చట్టవిరుద్దమైన పనుల ద్వారా అతని పీడ విరగడ చేసుకుందామనుకున్న వారి నైజం ఎంత క్రోరమైందో అర్దమవుతుంది. ఇటువంటి వారి సంబందాలు గురించి,   సమాజం జాగరూకతో  ఉండడం మంచిది.
                                                           (4/12/2013 Post republished)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )