ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

                                                                     

                             
                                                        గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .

                                                                         

          మన దేశం లో కొన్ని  తప్పుడు వాదాలు ఉన్నాయి. అందులో స్త్రీ లను, పురుషులను మొత్తంగా వేరు చేసి చూసే "ఆదునిక స్త్రీ వాదం" ఒకటి. దీనినే "ఫెమినిజం " అని అంటారు కాబోలు. ఒక స్త్రీకి వ్యతిరేకంగా మరొక స్త్రీ నేరం చేస్తే దానిని పట్టించుకోదు స్త్రీ వాదం. ఆ నేరం లో ప్రమేయం ఉన్న పురుషుడిదే పూర్తి బాద్యత అని అడ్డగోలు వాదం చేస్తుంది . ఉదాహరణకు ఒక పెండ్లి అయిన వాడిని , అతని భార్య హక్కులుకు వ్యతిరేకంగా , అతనితో సహజీవనం చేస్తున్న   మరొక స్త్రీ  , ఆ విషయం తెలియగానే బార్య తరపు బందువులు అనుసరించే సహజ న్యాయం ఏమిటి? భర్త తో పాటు ఆ ఉంచుకున్న ఆవిడను కూడా బడితే పూజ చేస్తారు. ఆ బయం తోనైనా  కొంత మంది స్త్రీలు అటువంటి కొంపలు కూల్చె పని చెయ్యడానికి వెనుకాడతారు. కాని విచిత్రంగా స్త్రీ వాదులు అలాంటి పనిని చేయరు. ఇందులో నేరం లో బాగస్వామి అయిన స్త్రీ కూడా తమ పార్టి యే కాబట్టి , ఆమెను ఏమనకుండా  తప్పంతా మగాడి మీద నెట్టి , తప్పు చేసిన ఆమెకు కూడా న్యాయం చేయాలి అంటారు. చివరకు అన్యాయమయ్యేది  తాళి కట్టించుకున్న ఇల్లాలు , ఆమె పిల్లలే . ఇలాంటి అసహజ న్యాయాలు కోసం పోరాడుతున్నందు వలననే స్త్రీ వాదం ఆబాసు పాలు అవుతుంది.

         కుటుంబం లో జరిగే తప్పులకు , నేరాలకు కేవలం పురుషులను బాద్యులు చేసే వాదం ఎటువంటిదైనా లోప భుఇష్టమైనదే . స్త్రీల మీద జరిగే హింస వెనుకాల పురుషుల పాత్ర కంటే స్త్రీలదే ఎక్కువ అని నిరూపించే ఆదారాలు ఎన్నో ఉన్నా , దానిని పట్టించుకోకుండా స్త్రీల తప్పుల పట్ల ఊదాసీనంగా ఉండడం కరెక్టు కాదు. ఇప్పటి వరకు మనది పితృస్వామ్య వ్యవత్స గా  పైకి చెపుతున్నా , దానిని అడ్డం పెట్టుకుని నడుస్తున్న అత్త స్వామ్యం,  ఆడబిడ్డల స్వామ్యం లాంటి కుటుంబ స్త్రీ పెత్తన గృహ హింస  వలన కోడళ్ళు బాదింపబడుతుంటె , గ్రుహ హింస  చట్టాలను అడ్డం పెట్టుకుని కొంత మంది కోడళ్ళు చేసే అరాచకపు పనులకు  భర్తలతో పాటు  అతని తరపు స్త్రీలు బాదింపబడుతున్నారని దేశ వ్యాప్తంగా కోర్ట్ కేసుల రికార్డులు తెలియ చేస్తున్నాయి.  కాబట్టి పురుషులంతా చెడ్డ వారు కానట్లే , స్త్రీలందరూ ఉత్తమ జాతీ వారు కారు. అవకాశాలు లేక  అణమణగి ఉన్నట్లు కనిపించినా అవకాశ మోస్తే ఎంతకైనా  తెగించే ఇంద్రాణి లాంటి హై క్లాస్ ఇల్లాళ్ళు  మాత్రమే కాదు, సాదా సీదా మహిళలు ఎంత మందో! కావాలంటే ఉదహరణకు ఒక ముదుసలి అత్తా పై  ఈ కోడలి   దాష్టికం చూడండి .

                                                                             

 ఇలాంటి స్త్రీలు దేశం లో  చాలా మందే ఉన్నారు. కాని అందరి ఇండ్లలో C C TV లు ఉండవు కాబట్టి , వారి దుచ్చర్యలు వెలుగు చూడవు .  ఇంద్రాణి లాంటి వారు  సమాజం లో రెచ్చి పోవటానికి ప్రస్తుతం  స్త్రీ వాదం  పేరిట వేల్లివిరిస్తున్న విశ్రుంఖల స్వేచ్చా వాదం కారణం కాదా?

         తల్లి తండ్రుల అదుపులో లేకపోతే ఆడదైనా , మగాడైనా చెడిపోక తప్పదు అని రుజువు చేసే ఉదంతం గురించి చెపుతాను. నాగపూర్  దగ్గర్లో ఉండె పల్లేటూల్లల్లో ఉండె ఆడపిల్లలు , చదు వులుకని, ఉద్యోగాల కనీ  నాగపూర్ లో ఉంటుంతారు అట . వారిలో 70% స్త్రీలు చేసే పనేమిటో తెలుసా ? పక్కా వ్యభిచారం. ఈ విషయం వారిలో చాలా మంది తల్లి తండ్రులకు తెలియదు. తమ కూతుళ్ళు చదవి బాగుపడతారు అని అమాయకంగా వారు తలపోస్తుంటె , ఇక్కడ ఆడపిల్లలు వెలగపెట్టె ఘన కార్యం వేశ్యా తనం . వారిలో 10% పొట్టకూటి చేస్తున్నారని అనుకుంటే , క్షమార్హులు కావచ్చు. కాని , అంతో ఇంతో కలిగిన మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లలు కూడా , ఆడంబరాల కోసం ఇలా దిగజారి పోతున్నారు అంటే , " నా బట్ట , నా ఇష్టం " అనే ఆదునిక స్త్రీ వాదం లోని విశ్రింఖల స్వేచ్చా దోరణి కాదా? పురుషులతో పాటు సమానత్వం  అంటె , వారి చేసే తప్పుల్లో సమానత్వం కావాలని అని అర్ధమా? దారి తప్పిన పురుష సమాజం ని  సంస్కరించడమే ద్యేయంగా పని చేస్తున్న  వారికి, నిత్యం స్త్రీ రక్షణ గురించి ఆలోచిస్తున్న వారికి , ఆదునిక స్త్రీ వాదం , దాని వలన జరుగుతున్నా పరిణామాలు  తీవ్ర అడ్డంకిగా మారాయి. ఇలాంటివి సమాజం లో ఎక్కువైతే , తిరిగి, మనువు  చెప్పాడని  అంటున్న "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " కరక్టే అని అనిపించక మానదు.

    స్త్రీ పురుషులు  అన్నింటిలో సమానంగా చూడ బడాలి. ఒప్పు చేసినప్పుడు సత్కరించడం లోనైనా , తప్పు చేసినప్పుడు శిక్షించడమ్  లోనైనా  అది సమానంగానే ఉండాలి . లేకుంటే స్త్రీ వాదులకు  వ్యతిరేకంగా  పురుష వాదులు బయలు దేరి , ఎవరి తప్పులను వారు కప్పెటుకుని , ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీలు లాగా , స్త్రీ పురుష   వాదాలు  ఏడుస్తాయి అనడం లో ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు.

Nagapur information SOURCE :http://timesofindia.indiatimes.com/life-style/people/College-girls-by-day-sex-workers-by-night/articleshow/24738353.cms
                                 (Republished Post . OPD:30/8/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం