అన్న "బంగారు కొండ " అయినంత మాత్రానా , వదిన "వజ్రాల గని " కావాలని రూలేమైనా ఉందా ?, ?
"మానవ సంబoదాలు అన్నీ ఆర్దిక సంబందాలే " అని అన్నారు మార్క్స్ మహాశయుడు . అందరి విషయం లో ఇది నిజమైనా కాకపోయినా , దివంగత సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంభ సభ్యుల విషయం లో ఇది నిజమే అనిపిస్తుంది . సాదారణంగా ఇంట్లో పెద్ద మరణిస్తే , వారి తాలూకు ఆస్తి పంపకాలు విషయంలో , కుటుంబ సభ్యుల మద్య గొడవలు ఉంటె వాటి గురించి మాట్లాడడానికి కనీసం 11 రోజులు అంటె చని పోయిన వారి ఖర్మ కాండ , దశదిన ఖర్మ యావత్తు అయిన దాక వేచి చూస్తారు . ఎవరైనా తొందరపడిన కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, స్నేహితులు అటువంటి వారిని మందలించి , దశ దిన ఖర్మ అయ్యే దాక ఆగాలని , అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కలసి కార్యక్రమాలు పూర్తీ చేయాలని సలహా ఇస్తారు. మరి అటువంటి సలహా ఇచ్చే పెద్ద మనుషులు ఎవరూ , సుప్రసిద్ద సిని సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంబ సభ్యులకు లేనట్లుంది . అందుకే అయన గారి బార్య అవివేకంగా తన భర్త తరపు కుటుంబ సబ్యుల పై మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేస్తున్నా , అలాగే చక్రి గార