మెడ మీద కత్తి పెట్టినా అసదుద్దీన్ ఒవైసీ గారు "భారత్ మాతా కీ జై " అననిది ఎందుకంటె, ఇందుకే !?
మొన్న మహా రాష్ట్రలో ఒక పబ్లిక్ మీటింగ్ లో MIM పార్టి అధక్షులు తెగ ఆవేశం తో ఊగిపోతూ " నా మెడ మీద కత్తి పెట్టినా సరే భారత్ మాతా కి జై అని అనను " అని గొంతు ఎత్తి అరచాడు. ఏమిటబ్బా ఈయనకి భారత మాత మీద ఇంత కోపం అని కొంచం ఆశ్చర్య పోవలసి వచ్చింది. దానికొక రీజన్ కూడా సెలవిచ్చాడు అయన గారు. "భారత రాజ్యాంగం లో ఎక్కడైన భారత మాతాకి జై అనమని రాసి ఉందా? లేదు కాబట్టి నేను అనే ప్రసక్తే లేదు " అన్నారు . అయన మాటలు వినే వాడి చెవిలో పువ్వులు ఉంటె "బహూశా ఈయన గారు భారత రాజ్యాంగాన్ని తు. చ . తప్పకుండా పాటించే వ్యక్తీ కాబోలు అనుకుంటారు. అలా అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన చట్టాలు ఎన్నికల్లో రిగ్గింగ్ లు చేయడం, బెదిరించడం నేరం ...