మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర తెలుస్తుoది అన్నట్లుంది సిమాంద్ర సమైక్యత సంగతి!
అరె రే ! ఎన్ని మాటలు చెప్పారు ! తెలంగాణా విడిపోతే తెలుగుజాతి ఐక్యతే పోతుంది అన్నారు . తెలంగాణా విభజన వాదులు తెలుగు జాతిని చిలుస్తున్నారు అన్నారు . తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని 2 నెలలు పైగా సమ్మె చేసారు . ఆంద్ర ప్రదేశ్ ను విడదిస్తే తమ తడాఖా డిల్లికి చూపిస్తాం అని ప్రగల్బాలు పలికారు . తమకు జెండాలు , ఎజెండాలు ఏమి లేవు , సమైక్యతా ఒకట్టే తమ ఎజెండా అని రాష్ట్ర విభజన ప్రకటించక ముందు సమైక్యా రాగాలు తీస్తుంటే దేశం అంతా నిజమే అనుకుంది . సిమాంద్ర లోని తెలుగు ప్రజలు ఉప్పెనలా కధలి వస్తుంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో ఉప్పొంగిన సమైక్యతా బావం ఇది అని నా లాంటి అమాయకులు అనుకున్నారు . కాని అది అంతా ఉత్తిదె అని ఇటివలి పరిణామాలు చూచిస్తున్నాయి . మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర తెలుస్తుoది అన్నట్లుంది సిమాన్ద్రులలో సమైక్యత సంగతి .ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానిని మర...