ఆస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించిన రాకెట్లు సూపర్ సక్సెస్ అవుతుంటే , నాస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించినవి అట్టర్ ప్లాప్ అవుతున్నాయి ! ఎందుకని?
నేను ఇదే బ్లాగులో " మేమే విజ్ణానులం అనుకునే వారు ఇస్రో చెర్మన్ గారిని ని చూసి నేర్చుకునేది చాలా ఉందనుకుంటా!. " అనే టపాలో ఒక మాట చెప్పాను . అది PSLVC 22 ఉపగ్రహం ప్రయోగం సందర్బంగా ఇస్రో చైర్మన్ అయిన శ్రీ రాధా క్రిష్ణ గారు రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల కొండకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నప్పుడు వచ్చిన విమర్శల సందర్బంగా వెలిబుచ్చిన నా అభి ప్రాయం . అదేమిటంటే " మనిష్ బౌతికంగా ఎంత విజ్ణాన వంతుడైనప్పటికి, అతను మానసికంగా తనను నడిపించే శక్తి ఈ విశ్వంలో ఏదో ఉందనే బావిస్తుంటాడు. అది మూడ విశ్వాసం కాదు.అనాదిగా అతని నరనరాల్లో జిర్ణించుకుని ఉన్న మత లేక అద్యాత్మిక పరమైన బావన. సాక్షాత్తు ఐన్ స్టీన్ అంతటి వాడే "సైన్స్, మతమూ అనేవి ఒకే వ్రుక్షానికి ఉన్న రెండు కొమ్మలు లాంటివి " అన్నాడు. కాబట్టి అన్నింటికి సైన్స్ సమాదానం చెప్పలేదు అనేది మనకు అనుభవమే. అలా అంతిమ సత్యమ్ కనుగొనబడే వరకు అటు ఆద్యాత్మికత బావననలు, ఇటు విజ్ణాన బావనలు ఉండి తీరతాయి. కొన్ని కోట్ల ఖర్చు పె