పక్కింటాయన అసమర్దుడు అయితే మన ఇంటికి కూడా తప్పవు తిప్పలు!
మనం ప్రశాంతం గా జీవించాలంటే కేవలం మన ఇంట్లో వారు క్రమశిక్షణ తో వ్యవహరిస్తే చాలదు. పొరుగింట్లో వారు కూడా క్రమశిక్షణ గల వారై ఉండాలి. ఉదాహరణకి మనం మన పిల్లల్ని చక్కని క్రమశిక్షణలో పెంచుతూ,ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకుండా సర్దుకు పోయే తత్వాన్ని అలవర్చి, ప్రశాంతంగా జీవించుదామని అనుకోవచ్చు. కాని పక్కింట్లో పరిస్తితి వేరు అనుకోండి.మొగుడు చెప్పిన పెళ్ళాం వినదు. పెళ్ళాం చెప్పిన మాట మొగుడికి రుచించదు. వీరిద్దరు చెప్పే దాని వినే పరిస్తితిని పిల్లలు ఎప్పుడో దాటి పోయారు. పిల్లలు పెంకిగా మారి పోయారు. "తల్లికి వంగని వాడు దాతికి(వద్య శిల) కూడ వంగడు" అని సామెత. కాబట్టి పెద్దోళ్ళ కంట్రోల్ లేని పొరుగింటి...