ప్రేమ పెండ్లిళ్ళు విషయంలో "మనవు" వాదానికి బలం ఇచ్చిన కేరళ హైకోర్టు వారి డివిజన్ బెంచ్ తీర్పు !.
నేను నిన్నఒక బ్లాగు మిత్రుడి ద్వారా ఒక విషయం తెలిసి చాలా ఆనందించాను . ఎందుకంటే నేను 14 అక్టోబర్ 2012 న ఇదే బ్లాగులో " తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన" అనే టపా పెట్టడం జరిగింది . అందులో " ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. ఒక వ్యక్తి ఇరువురి ఇచ్చా రూపమే కాదు వారి అనువంశిక లక్షణాల స్వారూపం కాబాట్టీ తను బవిష్యత్తులో ఎవరితో కలిసి తమ వంశానుక్రమాని అభివ్రుద్ది పరచుకోవాలి అనే విషయములో ఆ వ్యక్తి తల్లి తండ్రులకు సంపూర్ణ అదికారముంది. దానిని కాదనే హక్కు రాజ్యా వ్యవస్తకు ఉండటం అభిలషనీయం కాదు. ఇది కచ్చితంగా ఒక కుటుంభ పరిరక్షణ హక్కులకు బంగం కలిగించడమే అని మా అభిప్రాయం. యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో...