Posts

Showing posts with the label దస్ రూపాయా

విష్ణు రూపాయా, శివ రూపాయా " కంటే "దస్ రూపాయా, సౌ రూపాయా"నామార్చనే బెటర్ అంటున్నారు!

Image
నమో సౌరూపాయా, నమో నమః                                                              మన పూర్వికుల జీవన శైలి కి అదునికులమని చెప్పుకునె మన జీవన శైలికి ఎంతో తేడా ఉంది.ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడీస్తున్న మహమారి అవినీతి. ఇదొక అంటువ్యాది వైరస్ లాగా అత్యంత వేగంగా మనలోకి వ్యాపించింది. దీనిని మన పెద్దలు చేసిన చట్టాలు తప్ప ఎక్కువమంది తప్పుగా బావించటం లేదు. ఎందుకంటే మనం కొలిచే దేవుళ్లు మారి పోయారు కాబట్టి. అదెలాగంటే   మన పూర్వికులకు దైవభక్తి ఎక్కువ. అలాగే దైవబీతి కూడా ఎక్కువే. ఈ లొకం లో పాపం చేస్తే ,ఈలొకంలో కన్నా, పై లోకం లో బాదలు ఎక్కువ అనుభవించాల్సి వస్తుందనే భయం కూడా వారికి ఉండేది. అందుకే తెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు స్వామీ అని వేడుకునే వారు. అటువంటివారు "లంచం" అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికి భయపడే వారు.అన్నీ కాలాలోను నీతితో మెలిగే ప్రజలు తో పాటు అవినీతితో చరించే వారు కూడా ఉండొచ్చు. కాని ఎవరి పర్సెంటేజ్ ఎక్కువుగా ఉంది అనే దాని మీద మరి సమాజం లో ధనానికా, గుణానికా? దేనికి ప్రాదాన్యత ఇచ్చారు అనే దాని మీద ఆ సమాజపు విలువలు లెక్క కట్టాలి. అలా మన కంటే మన పూర్వికులే విలువలున