ఆలుమగలు అంటే తనువుల పరంగా కాదు , మనసుల పరంగా అని చాటి చెపుతున్న సీతారామ కళ్యాణం !!!
. భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు , ఆలు మగల మద్య అన్యోన్యత ఉన్నంత వరకు సీతా రాముల ఆదర్శ దాంపత్యం గురించి జనులు చెప్పుకుంటూనే ఉంటు0టారు . హైందవ సంప్రాదాయంలో ఆలుమగలు ను విడి విడి గా చూడటం జరుగదు . హిందువులు జరిపే, గృహలలో పూజలు మొదలుకుని , దేవాలయాలలో మరియు ఇతర సామూహిక పూజల వరకు తప్పకుండా దంపతులు పాల్గోనవలసిందే . ఒక వేళా తన జీవిత బాగస్వామి రాలేని లేక లేని పరిస్తితులలో కూడా వారు ఉన్నట్లుగానే బావించి పూజలు జరపుతారు . అంతే కాని వివాహం కాని వారికి క్రతువులు జరిపించే అధికారమే లేదు . ఇదే విషయం మనకు రామాయణం లో "స్వర్ణ సీత" ఉదంతంలో తెలుస్తుంది . రాములవారు ప్రజల మాటకు విలువిచ్చి , కట్టుకున్న ఇల్లాలిని అడవిలో వదలి రమ్మని తమ్ముడిని ఆజ్ఞాపిస్తాడు . ఆ రోజు నుంచి ఇక్కడ రాజ ప్రాసాదంలో రాములువారు , అక్కడ అడవిలో సితమ్మ వారికి నిరంతరం ఒకరి మిద ఒకరికి ద్యాస . తమ జీవిత బాగస్వాములనే తలచుకుంటూ మానవులుగా తమ విద్యుక్త ధర్మాన్ని న