హిందూ నాయకుడికి "మహా పండిత" బిరుదు ప్రదానం చేసిన చిలకలూరిపేట దళిత సంఘాలు !!!
మొన్ని మద్య చిలకలూరి పేట కు చెందిన దళిత సంఘాలు వారు, తెలుగు పండితుడు , బౌద్ద మతాభిమాని , గొప్ప వక్త అయిన ఒక మాస్టర్ గారికి "మహా పండిత " బిరుదు ఇచ్చి , అయన పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు . నిజంగా అయన ఆ బిరుదుకు అర్హుడే అనటంలో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు . అయితే ఆ బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యాన్ని ,అయన అభిమానులు ఎవరో వీడియో తీసి యూటూబ్ లో పెట్టారు . అయన ఉపన్యాసాలు చాలా ఉత్తేజితంగా ఉంటాయి కాబట్టి , అప్పుడప్పుడు అయన ఉపన్యాసాలను విని ఉన్న నేను , అయన గారి బిరుదు ప్రదానోత్సవ సన్నివేశం చూసి ఆనందిద్దాం అనుకున్నా . కాని మొత్తం విడియో చూసినప్పటికి అ స్టేజి మీద ఉన్న వారు , ఆ అరచే అయన తప్పా , సన్మాత గ్రహీత ఎవరో , అయన ముక్కూ మోహం ఎలా ఉంటుందో , కొత్తగా చూస...