సీమాంద్రా ఉద్యోగుల "ఉద్యమ కధ" కంచికి చేరనుందా?
చిన్నప్పుడు పరవస్తు చిన్నయ సూరీ గారి కధలు పాఠ్యాంశాలుగా ఉండేవి.అందులోని కధలు ఇప్పటికి గుర్తు వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి "పరాధికారం పైన వేసుకుని చచ్చిన గాడిద" కధ ఒకటి. ఒక ఊరిలోఒక రజకుడు ఉండేవాడు. అతనికి బట్టలు మోయడానికి ఒక గాడిద, ఇంటిని కాపల కాయడానికి ఒక కుక్క ఉన్నాయి. అందులో కుక్క కి యజమాని అంటే తగని ఒళ్ళు మంట. ఎందుకంటే దానికి సరిపోను తిండి పెట్టడని. ఆ కారణం చేత ఇంటి కాపలా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేది. కానీ గాడిద మత్రం అలా కాదు. తనతో ఎంత చాకిరి చేయించినా దానిలో స్వామి భక్తి చెక్కు చెదరలేదు. యజమానికి నమ్మకంగా పని చేయాలన్నదే దాని అభిమతం. ఒక రోజు ఆ రజకుడు చాకి రేవుకు వెళ్ళి వచ్...