సీమాంద్రా ఉద్యోగుల "ఉద్యమ కధ" కంచికి చేరనుందా?




                                                              


  చిన్నప్పుడు పరవస్తు చిన్నయ సూరీ గారి కధలు పాఠ్యాంశాలుగా ఉండేవి.అందులోని కధలు ఇప్పటికి గుర్తు వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి "పరాధికారం పైన వేసుకుని చచ్చిన గాడిద" కధ ఒకటి.

   ఒక ఊరిలోఒక రజకుడు ఉండేవాడు. అతనికి బట్టలు మోయడానికి ఒక గాడిద, ఇంటిని కాపల కాయడానికి ఒక కుక్క ఉన్నాయి. అందులో కుక్క కి యజమాని అంటే  తగని ఒళ్ళు మంట. ఎందుకంటే దానికి సరిపోను తిండి పెట్టడని. ఆ కారణం చేత ఇంటి కాపలా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేది. కానీ గాడిద మత్రం అలా కాదు. తనతో ఎంత చాకిరి చేయించినా దానిలో స్వామి భక్తి చెక్కు చెదరలేదు. యజమానికి నమ్మకంగా పని చేయాలన్నదే దాని అభిమతం.

  ఒక రోజు ఆ రజకుడు చాకి రేవుకు వెళ్ళి వచ్చి ఒంటి బడలికతో ఆదమరచి నిద్రిస్తున్నాడు. అంతలో ఒక దొంగ రజకుడి ఇంటికి కన్నం వేసి దొంగ తనం చేస్తున్నాడు. దానిని కుక్క, గాడిద రెండూ గమనించాయి. దొంగ ప్రవేశిస్తే మొరగవలసిన బాద్యత కుక్కది. కానీ యజమాని మీద కోపంతో అది మొరగలేదు. దానిని గమనించిన గాడిద కుక్కను కారణమడిగితే, తనను పట్టించుకోని  యజమానికి ఎంత సేవ చేసినా వ్రుధాయే అంటుంది. వారి మద్య కర్తవ్య నిర్వహణ గురించి చాలా చర్చ జరుగుతుంది. చివరకు గాడిద " నీవు నీ కర్తవ్యాన్ని మరచి పోయినా నేను యజమానిని మేల్కొల్పి  దొంగ తనం నుండి రక్షిస్తాను అని పెద్దగా ఓండ్ర పెడుతుంది. కుక్క అరిస్తే ఎవరో పరాయి వారు తన ఇంటికి వచ్చారు అని రజకుడు ఆలోచించేవాడే. కానీ గాడిద ఓండ్ర పెట్టడం వల్లా అది పని లేక అరుస్తుందని, దాని వల్లా బంగారం లాంటి తన నిద్ర పాడైందని బావించిన అతడు, పిచ్చి కోపంతో ఒక దుడ్డు కర్రను చేత బట్టుకు వచ్చి గాడిదను కొట్టగా, అది ఆయువు పట్టున తగిలి గాడిద చచ్చిపోతుంది. అదీ కధ!

  పై కదలో నీతి ఏమిటంటే ఎవరి పని వారు చేస్తే పలితం ఉంటుంది. లేకుoటే దుష్పలితాలు ఏర్పడవచ్చు. ఇది మన సీమాంద్రా ఉద్యోగులకూ వర్తించవచ్చు. సుమారు అరవై రోజుల పైగా వారు రాష్ట్ర విభజన ఆపమని ఉద్యమం చేస్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు డిల్లీలో నిరవదిక నిరాహార దీక్ష మొదలెట్టే వరకు కేంద్రం వారు స్పందించ లేదు. రెండు నెలలుగా జీతాలు లేకుండా, పెళ్ళాం బిడ్డల్ని కష్ట పెడుతూ ఉద్యమం చేస్తున్నా  కేంద్ర ప్రబుత్వ రాజకీయ నిర్ణయాలు ఏ మాత్రం మారలేదు సరి కదా, వారు అనుకున్నది మరింత వేగంగా కానిచ్చేస్తున్నారు. మరి ఉద్యోగులు సాదించిందేమిటి? కరెంట్ కట్ చేసి తమ ప్రాంత ప్రజలనే ఇబ్బంది పెట్టారు. రవాణా స్తంబింప చేసి తమ ప్రాంతం వారి జేబులకే మరింత చిల్లు పడేలా చేసారు. ఇదంతా చూస్తుంటే "చెరువు మీద అలిగిన సామెత అయింది, సీమాంద్రా ఉద్యోగుల ఉద్యమం.

   చంద్ర బాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్లు జగన్ గారికి, కాంగ్రెస్ కి మాచ్ పిక్సింగ్ అవడం నిజమే అయితే కాంగ్రెస్ కి సీమాంద్రా ప్రాంతం లో పార్టీ బవిష్యత్ గురించి బేపికర్. కాంగ్రెస్ గా కోల్పోయి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ రూపంలో పాయిదా పొందుతుంది.కాబట్టి చచ్చినా ఉద్యోగుల ఉద్యమాన్ని పట్టించుకోదు. ఉద్యోగుల ఉద్యమం మీద "బొత్సా" లాంటి నాయకులకు గౌరవమే లేదు. అందుకే ఆయనకి వ్యతిరేకంగా విజయనగరంలో ఎంత రభస జరిగినా బెదిరేది లేదంటున్నాడు. పై పెచ్చు, "గట్టిగా మట్లాడినంత మాత్రానా ఒరిగేదేమిటి, ఎపుడు ఎలా ప్రవర్తించాలో తెలియని వారు సాదించేది ఏమి లేదు" అంటూ ముఖ్యమంత్రి గారిని పరోక్షంగా విమర్సిస్తూ, ఆయన అసమర్దుడు అని తేల్చేసారు. మరి సీమాంద్రా ఉద్యోగుల ఉద్యమం పట్ల సీమాంద్రా నాయకులకే సదభి ప్రాయం లేనపుడు వారి ఉద్యమం ఎలా సక్సెస్ అవుతుంది? అందుకే రేపు సీమాంద్రా ఉద్యోగులతో ముఖ్యమంత్రి గారు జరిపే చర్చలుతో వారి ఉద్యమాన్నీ ఆపుచేయవచ్చు.

  రాజకీయంగా సీమాంద్రుల తరపున తాము పోరాడతామని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక హామి తీసుకుని, ఇన్నాళ్ళు తాము చేసిన ఉద్యమ దినాలను నష్టపోకుండా ఉండేలా ఒక హామి పొంది దానితో సిమాంద్రా ఉద్యోగులు తమ అందోళనకు స్వస్తి చెప్పవచ్చు. లేదంటే పై కదలో గాడిదలా  నష్టపోనూ వచ్చు. ప్రజలకు హాని చేసే రాజకీయ నిర్ణయాలు అనబడే దొంగల నుండి కాపాడే బాద్యత పై కదలో  కుక్క లాంటి రాజకీయ నాయకులది. వారు తమ బాద్యతను మరచి పోయినా ఆ అధికారం ఇంకొకరు చెలాంయించ లేరు. చెలాయించినా చెల్లు బాటు కాదు. కాదు కూడదు అంటే నష్టమే తప్పా పలితం అనుమానమే.మరి రేపటితో సీమాంద్రా ఉద్యోగుల ఉద్యమ కధ కంచికి చేరనుందా? చూదాం ఏమి జరుగనుందో?            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!