లగడపాటి గారు మాటి మాటికి చెప్పే బ్రహ్మాస్త్రం అదేనా?


                                                                          

తెలంగాణా ఏర్పాటుకి కేంద్ర ప్రబుత్వం ఒ.కె. చెప్పిన నాటినుండి "లగడపాటి" గారు తన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందని, అది సరి అయిన సమయంలో అంటే ఆంద్రప్రదేశ్ ను సమైఖ్యంగా ఉంఛటానికి గల దారులన్నీ మూసుకుని పోయాకా ఆ ఆస్త్రం వదులుతాను అని, దాని వలన విభజన ఆగిపోతుందని, పదే పదే చెపుతున్నారు. ఆ బ్రహ్మాస్త్రం ఏమై ఉంటుందా అని ఆయన మాటలుని సీరియస్ గా తీసుకునే వారు తెగ ఆలోచిస్తుంటే, ఆ .. ఇవ్వన్నీ పనిక్ రాని మాటలే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తను అన్న మాటకు కట్టుబడినట్లు, శరవేగంగా రాష్ట్ర విభజన చర్యలు కానిచ్చేస్తుంది. దీనితో సీమాంద్రా నాయకులకు దిక్కు తోచని పరిస్తితి ఎదురయింది. మరి లగడపాటి గారు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారో ఆశావాదులుకు అర్దం కావటం లేదు. అసలు ఆయన దగ్గర ఉన్న ఆ మహా అస్త్రం ఏమిటి అనేది కూడా తేలలేదు.నేను ఇంతవరకు అనుకున్నది ఏమిటంటే, కేంద్ర పెద్దలకు ఆంద్రప్రదేశ్ లోని కొంత మంది రాజకీయ నాయకులకు ఏదో చీకటి ఒప్పందాలు జరిగిఉంటాయని, వాటి గుట్టు మట్లు లగడ పాటి గరికి తెలుసు కాబట్టి, వాటిని ప్రజల ముందుంచుతానని కేంద్ర పెద్దల్ని బయపెట్టడానికే, బ్రహ్మస్త్రం బ్లాక్మెయిలింగ్ ఆలోచన చేసి ఉంటారనుకున్నాను. కానీ గత రెందు రోజులుగా సీమాంద్రా ఉద్యోగులు, నాయకులు చేస్తున్న ప్రకటణ చూస్తుంటే అది కాదు అనిపిస్తుంది.

ముఖ్యం గా మొన్నటినుంచి సీమాంద్రా వారు ఆర్టికిల్ 371-D ప్రస్తావన తెస్తూ, ఆ ఆర్టికిల్ సవరించనంత కాలం రాష్ట్ర విభజన చేయడం అసంభవం అంటున్నారు. దానిని సవరణ చెయ్యాలంటే పార్లమెంటులో2/3 వంతు మెజార్టీ అవసరమని, అది లేదు కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ పని చెయ్యజాలదని సమైఖ్యాంద్రా కోరుకునే వారి నమ్మక్కం.అది తప్పు అని, సాదారణ మెజార్టీతో ఆర్టికిల్ 371-D సవరణ చెయ్యోచ్చని, కాబట్టి రాష్ట్ర విభజన అనివార్యం అని విభజన వాదులు అంటున్నారు. అసలు ఆ ఆర్టికిల్371-D ఏమి చెపుతుంది? ఇరువైపుల వారి వాదనలో ఉన్న బలాబలాలు వేరొక టపాలో చూద్దాం.ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమీటటే ఒక వేళ ఆర్టికిల్ 371-D అడ్డం పడి రాష్ట్ర విభజన ఆగిపోతే, దాని వలన రాష్ట్రంలో ని ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఇది తెలంగాణా వారిని సీమాంద్రా ప్రజల మీదకు ఉసిగొల్పేలా చెయ్యదా? మరి ఇలా ఎన్నాళ్ళు తెలంగాణా, సీమాంద్రా ప్రజలు ఒకరి మీద ఒకరు ద్వేష బావాలతో మనుగడ సాగించాలి. కాబట్టి దీనికి ఇరువైపుల ఒక సామరస్య వాతావరణం కల్పించే చర్యలు చేపట్టి, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగుంటే మంచిదని నా అభిప్రాయం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!