Saturday, 10 December 2016

మనకు కావల్సింది "గ్రుహహింస" చట్టమా? "గ్రుహ పరిరక్షణ" చట్టమా?         

  మనకున్న చట్టాల్లో ఎక్కువుగా దుర్వినియోగమవుతున్నది "గ్రుహహింస" చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశ్యం  ప్రధానంగా కుటుంబంలో బాగమైన స్త్రీల సమస్యను పరిష్కరించడం.ఒక వ్యక్తి రక్షణ కోసం మొత్తం కుటుంబం విచ్చిన్నమవుతున్నా ఈ చట్టం పట్టించుకోదు. బార్యాభర్తల మద్య ఏర్పడే సమస్యలను ముందు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలి అని ఉన్నప్పటికి ఆచరణలో అది విఫలమవుతుంది. ఈ చట్టం వలన స్త్రీ లను కుటుంబ హింస నుండి  రక్షించే పేరుతో కుటుంబ వ్యవస్తలోకి చొరబడిన చట్టం {పోలిస్} చివరకు కుటుంబాన్ని కూల్చివేస్తుంది. అటు కుటుంబం నుండి బయటపడిన స్త్రీ కూడ చివరకు పొందేది శూన్యమే.

  దీనంతటికి మూల కారణం ఇంట్లొని  సమస్యలను,వీదిలొ  సమస్యలను ఒకే రీతిగా చట్టం నియంత్రణలోకి తేవడమే కాక, వీటి నియంత్రణకు పోలిస్ వారిని వినియోగించడం కుటుంబ వ్యవస్తను నాశనం చేస్తుంది. దీనివలన కుటుంబాలలోకి రాజకీయ నాయకుల జ్యొక్యం ఎక్కువైపోతుంది. చేతకాని ప్రబుత్వాల పనితీరు వల్ల కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్త ఏది లేక పోవడం వలన బార్యను తిట్టిన భర్త, వెలయాలిని తిట్టిన విటుడు ఒకే జైల్ లో ఉండాల్సిన పరిస్తితి.

                                                     కుటుంబం  అంటే రక్త సంభదీకుల మరియు వైవాహిక సంభoదీకుల జీవన గ్రుహం. అది కొన్ని వందల యేండ్ల పరువు ప్రతిష్త తో కూడిన  చరిత్ర గలది కావచ్చు. లేక అప్పుడే ఏర్పడిన అనుబంద కూటమి కావచ్చు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ప్రకారం "కుటుంభ రక్షణ" అనెది ప్రభుత్వాల విది.కుటుంబాల విచ్చిన్నతకు దారి తీసే ఏ చట్టమయిన మానవ  హక్కుల ఉల్లంఘనలో బాగంగా బావించాలి. కేవలం స్త్రీ లు మాత్రమే కుటుంబ సబ్యులు కారు, పిన్నలు పెద్దలు అందరూ దానిలో బాగమే. కేవలం  వ్యక్తి సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకుని తయారు చేసిన "గ్రుహ హింస" చట్టం అంతిమంగా గ్రుహ విచ్చిన్నతకు దారి తీసేలా తయారు అయింది.

                                                                             

 
           "గ్రుహ హింస" చట్టం బదులు "గ్రుహ పరి రక్షణ" చట్టం చేసి, కుటుంబ సమస్యలను సివిల్ సమస్యగా బావించి, వాటి పరిష్కారం కొరకు " కుటుంబ న్యాయ స్తానాల" పర్యవేక్షనలో పని చేసే ఒక ప్రత్యేక నియంత్రణ వ్యవస్త ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీని వలన కుటుంబ సబ్యులు వారి కుటుంభ గౌరవ మర్యాదలకు భంగం కలగని రీతీలో తమ సమస్యలు పరిష్కరించుకో గలుగుతారు.సాధారణ  పోలిస్ వారి జ్యోక్యం ఉండదు కాబట్టి, రాజకీయ జ్యోక్యం కూడ ఉండదు.

                          ఒక్క ప్రాణ నష్టం  విషయం లో తప్పా, కుటుంబ సబ్యుల మద్య ఏర్పడె ఇతర కుటుంబ సమస్యలన్నీ, ఈ ప్రత్యేక చట్ట పరిదిలోకి తేవాలి. ఒక వేళా బార్య బర్తలు, లేక ఇతర సబ్యుల మద్య ఇక ఏ నాటికి కలువలేని దుర్బర పరిస్థితులు ఏర్పడి, కుటుంబ సభ్యులు దురుద్దేశ్యం తో ఎక్కువ హాని కలిగిస్తే , అట్టి వారికి "విడాకులు" లాంటివి ఇప్పించి, ఇతర చట్టాల ప్రకారం వారిని విచారించవచ్చు. ఉదాహరణకు ఒక భర్త బార్యను కత్తితో పొడిచి హత్య చేయ బొయాడు.  ఈ సమస్యను ముందు ’కుటుంబ  న్యాయ స్తానం" పరిశిలించి వారికి విడాకులు మంజూరు చెయ్యాలి.ఆ తరవాత భర్తని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షించాలి. ఒక వేళా  భర్త పశ్చాతాప పడితే ,అందుకు బార్య క్షమిస్తే, అతనినికి ప్రత్యేక  "కుటుంబ శిక్ష" విదించే విదంగా "గ్రుహ పరిరక్షణ " చట్టం లో ఏర్పాటు ఉండాలి. అంటే ఒక విదంగా "ఫ్యామిలీ పీనల్ కోడ్ " అనే ప్రత్యేక  చట్టం  ఏర్పాటు చేయాలి .

  రాజ్యం కంటే కుటుంబమే  గొప్పది. ఆ రాజ్య రక్షణకు పని చేసే సైనికుడు తప్పు లేక నేరం చేస్తే, ప్రత్యేక మార్షల్ లా చట్టం ఉన్నట్లే, కుటుంబ సబ్యుల తప్పులను లేక నేరాలను నియత్రించడానికి ప్రత్యేక చట్టం మరియు నియంత్రణ వ్యవస్త అవసరం అని నా అభిప్రాయం.
              present Act:-- "Protection Of Women From  Domestic Violence Act"

              Proposed Act:--" Protection Of  Family From Domestic Disturbances Act"

                                                  కుటుంభో రక్షతి రక్షితః         
                                             (2/4/2013 Post Republished). 

Friday, 9 December 2016

పిల్లలున్న "గొడ్డు మోతు"తల్లితండ్రులు అంటే వీరే !


                                                                     


                                  సాదారణంగా సంతానం లేని పశువులని "గొడ్డుమోతు పశువులు " అనటం కద్దు . అలాగే పిల్లలు లేని స్త్రీలను కూడా కొంత మంది తోటి స్త్రీలు గొడ్డుమోతు వారు అని అవమానిస్తూ అవహేళన చేస్తుంటారు . కాని ఇది సరి అయిన పద్దతి కాదు. పిల్లలు కలుగక పోవడం అనేది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ , దాని కోసం చింతిo చవలసిన విషయం కాని, సంతాన హినులను అదేదో పాపం చేసిన వారిలాగా చూడాల్సిన అవసరం లెదు.
   ముక్యంగా హిందూ జీవన విదానంలో "సప్త సంతానం " గురించి చెప్పడం జరిగింది . అందులో కడుపున పుట్టిన వారు ఒక బాగం మాత్రమె . హిందూ గృహస్తుకు పేరు తెచ్చె మిగతా 6 రకాల సంతానం లో దత్త పుత్రులు , కవితలు , గ్రందరచనలు చెయ్యడం  , పాఠశాలలు కట్టించడం , చెరువులు తవ్వించడం, మొదలగు పనులన్నీ "సప్త సంతానం " లో బాగమేనని చెప్పారు . కాబట్టి పిల్లలు లేని వారు నిస్సందేహంగా "గొడ్డు మోతులు " కారు . మరి గొడ్డు మోతులు అంటే ఎవరో చూదాం .
       ప్రతి వ్యక్తీ తనకు సహజ సంతానం ఉన్నా లేక పోయినా "పితృ హ్రుదయం" మాత్రు హ్రుదయం " ఉంటే చాలు . అంటే తమ పిల్లల పట్ల తమకు కలిగే మమతాను రాగాలే ఇతరుల పిల్లల పట్ల కలిగి ఉంటే వారు తల్లి తండ్రులు అని పిలబడటానికి అర్హులే . కాని కొంత మంది తల్లి తండ్రులకు తమ పిల్లల పట్ల కూడా మమతాను రాగాల సంగతి దేవుడెరుగు , ఏ మాత్రం జాలి కరుణా లేకుండా కర్కశంగా వ్యవహరిస్తుంటారు . ఉదాహరణకు క్రింది వీదియోలోని హొమ్ టూషణ్ టిచరమ్మను చూడండి . కలకత్తాకు చెందిన ఈవిడ తనకు అప్పచెప్పిన విద్యార్దిని ఎంత దారుణంగా హింసిస్తుందో ? సి .సి  కెమెరాల పుణ్యామాని ఈ విడ గారి దురాగతం బయట పడింది కాని లేకుంటే అ బిడ్డడు రోజూ ఎంత నరకం అనుభవించాల్సి వచ్చేదో? ఆవిడకు  తన పామిలీ తో కూడా సత్సంబందాలు సరిగా లేవట. ఆమె స్వబావమే శాడిజం . కాబట్టి ఇలాంటి తల్లి కి పిల్లలు ఉన్నా ఆమె "గొడ్డుమోతు " క్రిందే లెక్క .
                
   

       అలాగే మొన్న కాకినాడలో అంధ విద్యార్దుల పాఠశాలలో ఒక అంధ విద్యార్దిని ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో కరస్పాండెంట్ దారుణంగా కొట్టాడు . విచిత్రం ఏమిటంటే అ కరస్పాండెంట్ కూడా అంధుడే . అయినా సరే సరే అతినిలో పితృ హృదయం లోపించటం వలన అంత దురాగతానికి పాల్పడ్డాడు . కాబట్టి అతను కూడా "గొడ్డుమోతు " కేటగిరి లోకి చేరతాడు . అతని గొడ్డుమోతు తనం ఎంత దారుణంగా ఉందో క్రింది విడియోలో చూడ గలరు . ఆ దృశ్యం చూస్తుంటే , మాత్రు హృదయం , పితృ హృదయం ఉన్న వారెవరికైనా కళ్ళు చెమ్మగిల్లక మానవు.

                                                                 
                                                   (24/7/2014 Post Republished).                 

Thursday, 8 December 2016

పాపం ! కత్రినా కైఫ్ ని ఆమె గారి భర్త ఎన్ని సార్లు "రేప్ " చేసాడో !!?
                               పూర్వకాలం లో దేవతలు నివసించే దేవలోకం కి, మానవులు నివసించే ఈ  భూలోకం కి కనెక్షన్ లు ఉండేవి . అందుకే అప్పుడప్పుడు అప్సరసలు  అయినా రంభ ఊర్వశి మేనకలు లాంటి వారు ,లేక వరూధిని లాంటి వారు భూ విహారానికి వచ్చి సేద దీరీ పోతుండే వారు అట . భూమి మీద కంటికి నచ్చిన వాడెవడు అయినా కనపడితే వాడితో అచ్చిక బుచ్చిక లాడి , కొన్నాళ్ళు వాడితో గడిపి , కడుపొ కాలో వస్తే ,పుట్టిన వారిని భూమి మీద తమ తో గడిపిన మగాడి ముఖాన కొట్టి ఎంచక్కా దులుపుకుని దేవలోకానికి వెళ్లగల స్వేచ్చా స్వాతంత్ర్యాలు సదరు దేవసాను లకు ఉండేవి . దేవతలను నిరంతరం తమ నృత్య గానాలతో ఎంటర్ టైన్ మెంట్ చేయడమే వారి వృత్తి కాబట్టి వారికి ఆ స్వేచ్చా స్వాతంత్ర్యాలు అవసరమే మరి  , వారు దేవతలు కాబట్టి వారి గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా నిరంతరం  యవ్వనం తో ఉండటం  వారికి ఉన్న స్పెషాలిటీ .

       కాలాంతరాన దేవలోకానికి , భూలోకానికి కనెక్షన్ తెగిపోయినా,  సదరు దేవతా జాతి లో కొందరు, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో హీరోయిన్ మాదిరి  ఉంగరాలు పారేసుకున్న వారెవరో ,దేవలోకానికి సకాలం లో దేవ లోకం కి వెళ్ళ లేక ఇంకా భూమి మీదే ఉండి పోయారు . అలా భూమి మీద ఉండిపోయిన దేవ కన్యలు భూమి మీద తమకు తమ నడవడికలకు అనుకూలంగా ఉన్న వివిధ బాషల సినిమా పీల్డు లు అయిన "బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్థిరపడి పడి పోయారు . 

      ఉంగరాలు పారేసుకోవటం వలన గత్యంతరం లేక భూలోక సినిమా తారలుగా మారిన వీరికి మానవ సంబంధాలు , వారు ఏర్పరచుకున్న నియమాలు అన్ని అర్ధం లేని నాన్సెన్స్ గా అనిపిస్తుంటాయి . అందుకే ఆ మధ్య "కుష్బూ " అనే సినీ దేవత "పెండ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పే లేదు " అని చెప్పి జనాలలో సంచలనం సృష్టించింది . దానితో ఆమెకు బోల్డంతా పబ్లిసిటీ వచ్చే సరికి ,కాణి ఖర్చు లేకుండా తన సినీ కెరీర్ కు అవసరమైన పబ్లిసిటీ వచ్చినందుకు ఆమె ఏంతో సంతోషించింది అట . ఆ తర్వాత బాలీవుడ్ దేవత "దీపికా పడుకునే " అనే ఆవిడ వివాహిత స్త్రీలకు బయట సెక్స్ కావాలా ? వద్దా ? అనేది స్త్రీల చాయిస్ అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. దానితో ఆవిడ గారికి పిచ్చ పబ్లిసిటీ వచ్చింది . ఇక నిన్న గాక మొన్న, తన బాయ్ ప్రెండ్ లలో ఎవరికీ వైప్  కావాలో తేల్చుకోలేక పోతున్న  "కత్రినా కైఫ్ " అనే తళుకులాడి " ఇండియాలోని ఇంతులు , మొగుళ్ళు చేసే  రేప్ లతో చాలా అన్యాయానికి గురి అవుతున్నారు ,కాబట్టి స్త్రీలు వైవాహిక రేప్ లకు వ్యతిరేకంగా తమ గళం విప్పి , వైవాహిక రేప్ వ్యతిరేక చట్టం తెచ్చి భర్తలను జైళ్లలోకి తోయించాలి " అని సెలవు ఇచ్చింది . ఇలా ఒక్కొక్క సినీ  దేవత చెప్పే శృంగార నిబంధనలు  ,దేవతలకు   పనికొస్తాయేమో కానీ ,పెండ్లి చేసుకుని సంసార గృహం లో సాఫిగా కాపురం చేసుకోవాలి అనే   మనుషులకు మాత్రం ఏ మాత్రం పనికి రానివి .
                                           

     "రేప్ " కి , స్వచ్చందం గా సెక్స్ లో పాల్గొనడానికి ముఖ్యమైన బేధం , "అంగీకారం " అనేది . భార్యా భర్తలు మధ్య సెక్స్ కోసం అంగీకారం అనేది తడవ తడవ కు తీసుకోవడం సాధ్యం కాదు . అందుకే వివాహం నాడే తన జీవిత భాగస్వామికి జీవితకాల అంగీకారం తెలియ చేయబడుతుంది . వివాహం అనేది పక్కాగా మత పరమైన క్రియ . వివాహ తంతు లేకుండా కలసి ఉండే వారికి "రేప్ " లు లాంటి నిబంధనలు అవసరం ఏమో కానీ , వివాహం ,ముక్యంగా హిందూ వివాహ పద్దతి ద్వారా ఏకమైనా దంపతుల మధ్య "రేప్ " అనే పదమే ఉండరాదు . హిందూ వివాహ వ్యవస్థలో పెండ్లి అయిన భార్యా భర్తలు ఇరువురు ను ఒకటిగానే భావిస్తారు . కాబట్టి ఏక  మనస్కులు అయిన భార్యా భర్తలు మధ్య "అంగీకారం " లేదనే వంకతో మొగుడ్ని శిక్షించాలి అని కోరడం హిందూ వివాహం యొక్క కాన్సెప్ట్ కె భంగం . ఇది కచ్చితంగా మత స్వేచ్ఛలో జ్యోక్యం చేసుకోవడమే .

                                                             


                       భారత రాజ్యాంగం తన పౌరులకు , తమ ఇష్టం వచ్చిన మత పద్ధతులు స్వీకరించడాని కి , వివాహం చేసుకోవడానికి , అవివాహితులుగా ఉండడానికి , తమకు నచ్చిన వారితో పళ్లెం ని , పక్కను పంచుకోవడానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చినప్పుడు , వీళ్ళ బరి తెగించిన బావాజాలాన్ని ప్రజలు అందరి మీద రుద్దడం ఎందుకు? దేవతలకు మానవులకు మాదిరి వావి వరుసలు ఉండవు. నీతి నియమాలు ఉండవు . ఇష్టం వచ్చినట్లు బ్రతుకచ్చు . తమకు నచ్చిన వారితో , నచ్చిన విదంగా , నచ్చినంత కాలం ఉండవచ్చు .నచ్చితే వివాహం చేసుకోవచ్చు ,నచ్చక పొతే విడాకులు తీసుకుని , ప్రెష్ గా మరొకరితో సెట్ అయిపోవచ్చు . ఇది సినిమా తారలు లాంటి ప్రొఫెషన్ లో ఉన్న వారికి అనువైన జీవన విధానం కావచ్చు . కానీ ఒక పద్దతి ప్రకారం సంసార గృహాలు ఏర్పాటు చేసుకుని , తమ కుటుంబాలు అభివ్రుది చేసుకోవాలి అనుకునే వారి కి కొన్ని ప్రివిలేజ్ లు ఉంటాయి .ఉండాలి కూడా . అవి లేకపోతె , రేప్ లు చేసాడు అని భర్తలని , నస పెట్టి హింసిస్తుందని భార్యలను చట్టాలు శిక్షించాలి అని కోరితే ,కుటుంబాలు కూలిపోతాయి .పురుషాధిక్యత కల ఈ  దేశం లో భార్య పోరు తట్టుకోలేక ఆత్మ న్యూన్యతా భావంతో ఉరి వేసుకున్న అభాగ్యుల లెక్కలు రికార్డుల్లో రావు. లేకుంటే భర్తల రేప్ ల కంటే భార్యల హింసలే అధికం గా కనపడేవి. హింస ఏ రూపం లో ఉ న్నా, దానికి  ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే . అది భార్యా భర్తల విషయం లో  అయినప్పుడు కౌన్సలింగ్ ఇచ్చి చక్కదిద్దాలి తప్పా , జైళ్లల్లో పెట్టి కాదు .

                           వివాహం మత పరమైనది .సెక్స్ విషయం లో భర్తలు , బయటి మగాళ్లు ఒకటే అనే భావన కలిగిన  సినీ దేవతలు లాంటి  వారు ,వివాహం చేసుకోకుండా , సహజీవన పద్దతిని ఎంచుకోవడం మంచిది .ఇలాంటి వారు పడకగదిలో CC  కెమెరాలు అమర్చుకుంటే , ఎప్పుడైనా తాము రేప్ కు గురి అయినప్పుడు , తమ అంగీకారం లేకుండా జరిగిందని నిరూపించుకోవడానికి , CC  కెమెరా ఫుటేజ్ లు పనికొస్తాయి .కాబట్టి ఉంగరాలు పోగొట్టుకుని దేవ లోకాలకు  తిరిగి వెళ్లలేక , నానా సతమవుతూ , తమ దేవసానుల నియమాలను మానవ సమాజం మీద రుద్దాలని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్న సినీ తారలు మీద మనం జాలి పడాలి . వారు పోగొట్టుకున్న ఉంగరాలు వెతికి ఇచ్చి  తక్షణమే వారిని దేవ లోకానికి  పంపించి వేస్తె మంచిది . లేకుంటే సమాజం లో అన్ని కృత్రిమమైన మాయా సంబంధాలే  తప్పా , స్వచ్ఛమైన అత్మియతో కూడిన మానవ సంబంధాలు మిగిలి ఉండవు.

           
    అసలు కత్రినా కైఫ్ లాంటి పెండ్లి కానీ లేడి  స్టార్ కి "మ్యారిటల్ రేప్ " నిషేధం గురించి ఎందుకు ఆలోచన వచ్చిందో ? కనీసం పెండ్లి చేసుకుని బాధలు ఏవైనా అనుభవించి ఉంటె , ఆమె గారి భర్త ఎన్ని సార్లు "రేప్ " చేసాడో , అందుకే దాని గురించి గొంతెత్తింది అని అయినా అనుకోవచ్చు. భారత దేశం లో హిందూ జీవన విధానం లో భాగమైన పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఎదో విధంగా దెబ్బ తీసి తమ సంస్కృతిని వ్యాపింప చేయాలనే దుష్ట పన్నాగాలు పన్నుతున్న విదేశీ బావజాలికులే ఇలా సినీ తారల చేత స్టేట్ మెంట్ లు ఇప్పిస్తున్నట్లు ఉంది . 

అంగార గ్రహానికి " మామ్ "(MoM) లు పంపుతున్న విజ్ఞానులు, భూమి మీదకు "అమ్మ" లు రాకుండా అడ్డుకుంటున్నారు !

                                                                   
  


                              ఆడపిల్లలు పుట్టి పెరిగాక, తలయెత్తే స్వేచ్చా ,స్వాతంత్ర్యాలు , రక్షణ సంగతి కంటే అసలు వారిని భూమి మీదకు రానియ్యకుండా చేస్తున్న మనలోని అజ్ఞానం తో కూడిన ఆధునిక విజ్ఞానం , దానికి దోహద పడుతున్న నేటి వ్యాపార వాద సంస్క్రుతి మరియు శాస్త్ర విజ్ణాన అభివృద్ధి గురించి మనిషి అన్న వాడు ఆలోచించవలసిన  అవసరం ఎంతైనా ఉంది

   ఈ  దేశం లో చాలా మంది విజ్ఞానులు ప్రజల్లో మూడత్వం పారద్రోలుతున్నామని ప్రచారం చేసుకుంటూ, కేవలం హిందూ జీవన విదానం లోని ,కొంతమంది పొట్ట కోటి కోసమో, లేక ప్రజల్ని ఆకర్షించడం కోసం చేసే గారడీ విద్యలను ఎత్తి చూపుతూ , హిందువుల మత  విశ్వాసాలు వలననే దేశం లో అజ్ణానం ఉందని ప్రచారం చేస్తున్నారు. దీనికి అన్య మతాలు కు చెందిన విదేశి సంస్తలు నుండి పెద్ద ఎత్తున నిధులు అట్టి విజ్ఞాన ప్రచార సంస్తలకు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేవలం హిందూ సంస్తలు , వ్యక్తులు ని  టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్న ఈ  విజ్ఞానులు చెప్పే దానిలో నిజమున్నా , వారి ప్రచార విదానం వలన అన్య మతాలు ఈ దేశం లో లాబ పడుతున్నాయి అని గ్రహించిన హిందువులు వారిని కానీ, వారు చెప్పే దానిని కానీ పెద్దగా పట్టించుకోవటం లేదు సరి కదా , ఈ  మద్య ప్రజలు  వారి నిజాయితిని ప్రశ్నించడం ఎక్కువైంది. దీని వలన గారడీ చేసే వాడు, దానిలోని మర్మం విప్పి చెప్పే వాడు ఇద్దరూ ప్రజల ద్రుష్టిలో ఒకటే ! జస్ట్ ఎంటర్ టైన్మెంట్ ! అంతె!

  ఒకనాడు మతపరమైన   విద్యా జ్ఞానంతో కొంతమంది మత వాదులు ఎలా విర్రవీగి ఈ  సమాజ పతనానికి కారకులయ్యారో, ఈ నాడు అదే పాత్రను శాస్త్ర విజ్ఞానం తో కొంతమంది విజ్ఞానులు అని చెప్పబడుతున్నవారు చేస్తున్నారు. ఏ విజ్ఞానం అయినా అంతిమంగా  ప్రజలకు మేలు చేకూరిస్తేనే సార్దకత. దానిని పది కాలాల  పా టు ప్రజలు ఆదరిస్తారు. గాందీ గారు చెప్పినట్లు "సమాజానికి మానవ హననానికి కారణమైన అణుబాంబు ను కనిపెట్టిన శాస్త్రవేత్త కన్నా , ఒక గుడ్డివాడిని రోడ్డు దాటించడం లో సాయపడే బాలుడు ఎంతో మిన్న" అన్నదే సమాజానికి ఎంతో అవసరం. హిందూ జీవన విదానం లో శాస్త్రీయ దృక్పదం కి ఎప్పుడో పెద్ద పీట వేసారు. మన సాంప్రదాయాలు లో ఇంచుమించు శాస్త్రీయ దృక్పదాలు ఉన్నవే ఎక్కువ. కానీ రాను రాను కొన్ని విదేశి శక్తులు మన సమాజం లోకి ప్రవేశించడం వలన , వారి నుండి మన మతాన్ని కాపాడుకోవటానికి కొంత చాందస వాదాన్ని కూడా  భరించవలసిన పరిస్తితి. అది ఇప్పటికి కొనసాగుతోనే ఉంది.

   హిందూ జీవన విదాన విశిష్టతను విదేశాలలో చాటి చెప్పిన వివేకానందుల వారు సహితం" సన్యాసులు రోజూ ఒక నల్ల బోర్డు , చాక్ పీస్ తీసుకువెళ్ళి , సామాన్యులకు సైన్స్ గురించి చెప్పండి " అన్నారు తప్పా , చాందస వాదాన్ని ప్రబోదించ మనలేదు. కానీ హిందువులలోనే కాదు , అన్య మతాలలో కూడా చాలా మందికి , వారికి కరువైన మానసిక ప్రశాంతత ను శాస్త్రీయ విజ్ఞానం  కంటే అలౌకిక బావనలే కలుగ చేస్తున్నాయి కాబట్టి శాస్త్రీయ బావనలోతో పాటు అలౌకిక బావన లు సజీవంగా ఉంటున్నాయి. ఒక్క హిందూ జీవన విదానమే అటు అలౌకిక తత్వాన్ని, ఇటు శాస్త్రీయ దృక్పదాన్ని సమానంగా ఆదరిస్తుంది కాబట్టే విజ్ఞానులు అని చెప్పుకుంటున్న కొంత మంది ఎంతగా హిందూ బావనలను గేలి చేస్తున్నా వారి మీద ప్రజలు హింసాయుత దోరణిలో రియాక్షన్ చూపటం లేదు. అదే ఇతర మత విశ్వాసాల జోలికి వెలితే ఏమి జరుగుతుందో వారికి తెలుసు కాబట్టి వారి జోలికి వెళ్ళడానికి సాహసించరు విజ్ణానులు. ఈ  కారణం వలన కూడా ఈ దేశ సాంప్రదాయక బావనలు మాత్రమే ఎక్కువుగా దాడికి గుర్వతున్నాయి. ఇది మెజార్తీ ప్రజలకు బాద కలిగిస్తుంది. అందుకే  శాస్త్రీయ దృక్పదం  అవగతం చేసుంకున్నా , దాని పేరుతో మత  విశ్వాసాలను విమర్శిస్తే ఊరుకోడు . ఉదాహరణకు "కర్ణుడు కుంతికి, సూర్యుడు కు  పుట్టాడు అంటే , ఇప్పుడు ఎవరూ నమ్మరు.కారణం సూర్యుడు తను ఉన్న చోటు నుంచి ఒక అంగుళం భూమికి దగ్గరగా  జరిగినా భూమిఉండదు అన్న సంగతి తెలుసు కాబట్టి! కానీ దాని పేరుతో భారతాన్ని కించపరస్తే ఊరుకోరు. ఈ  చిన్న పాయింట్ చాలా మంది విజ్ఞానులకు అర్దం కాక , ఏదేదో చెప్పి ,వారు చివరకు ప్రజలకు అంటరాని వారయ్యారు. అంటే ప్రజలు వారి మాటలు పట్టించుకోవడం మాని వేసారు. తెలివిగల సంస్కరణ వాదులు మతం లోనే ఉండి అజ్ఞానాన్ని రూపుమాపాలనుకుంటారు .. తెలివిలేని వారు నాస్తికత్వంతోనో, అన్యమత విశ్వాసాల పేరుతోనో అజ్ఞానాన్ని రూపు మాపాలని ప్రయత్నించి, చివరకు వారు చెప్పే మాటలు ప్రజలు ఎందుకు వినటం లేదో అర్ధంకాక, అసహన పరులై, వీరంగం వేస్తూ ఆబాసు పాలు అవుతూ ఉంటారు.
                                                                         

                                                                   

                   నేను పైన చెప్పినట్లు ఏ దృక్పదం అయినా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. ఉదాహరణకు మనం భూమి మీద నుండి విశ్వ పరిశోదనల పేరుతో కొన్ని వేల  కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర గ్రహాల మీదకు వ్యోమ నౌక లను పంపుతున్నాం. విదేశియులు సేకరించిన సమాచారం మనకు పనికి వచ్చినా, విశ్వ శొదనలో  మేమూ పోటిదారులమే అనే అహం తృప్తి పరచుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ సమాజానికి ఎంతో అవసరమైన "అమ్మ" ను ప్రసాదించే ఆడపిల్లను మాత్రం ఈ  భూమి మీదకు రావడానికి మాత్రం అంగికరించలేని మనస్తత్వాన్ని పారదోలడానికి , రాకెట్లకు పెట్టే ఖర్చులో పది వంతు అయినా పెడుతున్నామా? ఆలోచించండి? ఏది మనకు పనికి వచ్చే శాస్త్రీయ దృక్పదం? అంగారక గ్రహానికి స్పేస్ షిప్లు పంపేదా? ఆడపిల్లలను బూమి మీదకు రానిచ్చేదా? శిశువుల్లో లింగ నిర్దారణ కి కారణం పురుషుడే కానీ స్త్రీ కాదు అని ఈ  నాడు ప్రజలలో ఎంత మందికి తెలుసు? తెలిస్తే పుట్టిన ఆడపిల్లను అంత దారుణంగా బండ కేసి కొట్టి చంపుతారా వెదవలు ! ఆ పేరుతో రెండవ పెండ్లి చేసుకోవాడానికి సిద్ద పడతారా మగ పుంగవులు. కనీసం ఈ  విషయం తెలిస్తే ఆడపిల్లలను కన్ననిందను తాము భరిస్తారా ఆడపిల్లలు? బరించరు కాక బరించరు. కానీ ఈ  విషయం లో ప్రజలకు శాస్త్రీయ దృక్పదం కలిగించరు. ఎందుకంటే అది వారి లింగ నిర్దారణ వ్యాపారానికి దెబ్బ కాబట్టి, డాక్టర్లకు లాస్ కాబట్టి! పెరిగిన శాస్త్ర విజ్ఞానం ఆడపిల్లలను దారుణంగా పుట్టకముందే చంపేస్తుంటే, అది తప్పు అని మత విశ్వాసాలు గొంతెత్తి  అరుస్తుంటే , వాటి మీద యుద్దం చెయ్యరే విజ్ఞాన వీరులు? ఇటువంటి డాక్టర్లు , లేబరిటరీలు మీద ఎన్ని  కేసులు పెట్టారు సో కాల్డ్ విజ్ఞాన వాదులు. ఈ  ప్రమాదం ముందే గ్రహించడం వలననే "ఆడపిల్ల పుడితే మహా లక్ష్మి" అనే విశ్వాసాన్ని హిందూ జీవన విదానం లో కలిగించారు పూర్వులు. కానీ వరకట్నం, పెరిగిన శాస్త్రీయ విజ్ఞానం ఆడపిల్లల్ని భూగ్రహం మీదకు రాకుండా చేస్తున్నాయి.
                                                                         
                                                          

     అందుకే ప్రజలకు  పనికి వచ్చే శాస్త్రీయ విజ్ఞానమే ప్రజలకు అందాలి ,దాని కోసమే ప్రబుత్వాలు క్రుషి చెయ్యాలి తప్పా , పోటి తత్వంతో ప్రస్తుతం పనికి రాని  వాటి కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించవలసిన పనిలేదు అని నా అభి ప్రాయం.అంగార గ్రహానికి " మామ్   "(MoM) లు పంపటం కాదు, ,   భూమి మీదకు "అమ్మ" లు ను రానిచ్సెదే  నిజమైన శాస్త్రీయ  విజ్ఞానం అని నా దృడాభిప్రాయం 

 

Wednesday, 7 December 2016

వనబోజనాలకు జనం "నిల్ ' ! కులబోజనాలకు కలెక్షన్ పుల్ !


                                                                            

                                            వనసమారాదన పేరిట కార్తీక మాసం లో జరుపుకునే వనబోజనాలు చివరకు "సిటి లో మా కుల బలం ఇది " అని జరిపే బల ప్రదర్శనలుగా మారినట్లు కనిపిస్తుంది. మనది ప్రజాస్వామ్య దేశం . కులం మతం వలదని ఎన్ని చెప్పుకున్న అవి ఆదర్శాల జాబితాలో ముందు  ఆచరణ జాబితాలో వెనుక బడి ఉన్నాయి. కొంతమంది ఆదర్శ వాదులు కుల బోజనాలు వద్దు. అందరూ కలసి కుల రహితంగా వనబోజనాలు చేయాలి అని చెపుతున్నారు. అయితే ఈ  ఆదర్శ బోజనాలు గురించి చెప్పేవారు , అసలు జనం కులబోజనాలు పట్ల ఎందుకు మక్కువ చూపుతున్నారో ఆలోచించకుండా స్తేట్మెంట్ ల మీద స్తేట్మెంట్లు ఇస్తుంటే , వారి దారి వారిదే జనం దారి జనం దే అన్నట్లు ఉంది.

                                    వనబోజనాలు అనేవి సంవత్సరానికి ఒక  సారి జరుపుకునే కార్యక్రమం. మనం పెండ్లిల్లకు వెళ్ళినా , పేరంటాలకు వెళ్ళినా, చివరకు దైవ కార్యక్రమాలకు వెళ్ళినా  అక్కడ పాల్గొనే వారంతా కుల రహితంగానే  పాల్గొంటారు. కాని వన సమారాదనకు వచ్చే సరికి కుల పరంగానే జరుపుకుంటున్నారు అంటే అందులో ఉన్న మతలబ్ వేరే! అదే తమను తాము తమ బందువులలో పరిచయం చేసుకోవడమే కాక , పెండ్లి ఈడొచ్చిన తమ పిల్లలను కమ్మునిటికి  పరిచయం చేయాలనే ఉద్దేస్యం. అలాగే అంటే ఒక రకంగా సాముహిక పెండ్లి చూపుల తంతు లాంటిది కూడా. ఈ  రోజుల్లో మారేజ్ బ్యూరో  బిజినెస్ కూడా కోట్లలో నడుస్తుంది కాబట్టి, కులబోజనాలు కుడా ఒక రకం గా మనీ, టైమ్  అదా చేసే కార్యక్రమం  కాబట్టి చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. 

    ఇక పోతే రెండవ అంశం రాజకీయ పరమైనది. ఈ  సిటి లో మాకుల బలం ఇంత ! సదరు బలం అంతా మా కంట్రోల్ లోనే ఉంది  అని రాజకీయ బల ప్రదర్శన చేసుకోవడానికి  కుల బోజనాలు మంచి వేదికలు . అందుకే కొంతమంది  సదరు కులబోజనాల కయ్యే ఖర్చును తామే భరించి , వాహనలను  సమకూర్చి  కుల జన సమీకరణ చేస్తున్నారు. అంటె కాకుండా తమ పార్టిలో ఉన్న కుల గాడ్ పాదర్ లను ఆహ్వానించి  తమ దమ్ము ఇది అని వారి ద్రుష్టిని ఆకర్షించి తద్వారా పార్టి పరంగా లబ్ది పొందుతుంటారు. 

                                                                             
                           
                                                      

                                     అయితే కుల బోజనాలకు అటెండ్ అయినంత మాత్రానా జనం లో కుల పిచ్చి ఉందనుకోవడమ్ అవగాహనా రాహిత్యమే అవుతుంది. మన దేశం లో ఇంకా కుల పరం గానే వివాహాలు అదికంగా జరుగుతున్నాయి. కులాంతర వివాహాలను సమాజం ఆమోదిస్తున్న ఇంకా పూర్తి స్తాయిలో అవి జరగటం లేదు. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక సారి జరుపుకునే వన బోజనాలను బందు జన బోజనాలుగా జరుపుకుంటే పైన చెప్పిన విదంగా లాభమే  కాని నష్టం ఏముంది అనే బావన ప్రజలలో ఉండబట్టె కుల బోజనాలకు కలెక్షన్ పుల్ గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. "నీవు ఒకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అనట్లు " రాజకీయ నాయకులు అరేంజ్ చేస్తున్న ఈ  ప్రీ  పంక్షన్ లకు జనం కూడా బందువులను కలుసుకుని ఆనందంగా గడపుదామని, అలాగే తమ ఈడొచ్చిన పిల్లలను తమ కమ్యూనిటికి న పరిచయం చేదామని అనుకోవడం వలనే అవి అంత సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడ జనం ఉంటె అక్కడ రాజకీయ రాబందులు వాలుతుంటాయి కాబట్టి , పైకి నాయకులు ఎన్ని ఆదర్శాలు వల్లించినా , కులబోజనాలకు హాజరవుతూనే ఉంటారు తమ ఓటు బ్యాంక్ ను కాపాడుకుంటూనే ఉంటారు . 
                     కులం అనేది ఒక రోజులోనో , సంవత్సరం లోనో , దశాబ్దంలోనో , శతాబ్దం లోనో ఏర్పడింది కాదు. తరతరాలుగా వస్తున్న ఆ వ్యవస్థని  పని కట్టుకుని మార్చాలి అంటె అది కాని పని. కాలంతరం చేత ఏర్పడింది  కాలాంతరం తోనే మాయమవుతుంది. దానిని రూపుమాపటానికి విదేశి బావజాల సిదాంతాల పేరుతో చేసే రాదాంతాలు కంటె హిందూ జీవన విదాన లేక ఆశ్రమ జీవన విదాన సిద్దాంతమే  ఎక్కువుగా ఉపయోగ పడుతుంది  అని నేను దృడంగా నమ్ముతున్నాను. ఏ నాటికైనా భారతం లోని కులాలు అన్నీ హిందూ మత ఏకీకరణ తోనే అద్రుశ్యమవుతాయి . అప్పటి వరకు కుల బోజనాలు జరుగుతునే ఉంటాయి .

                 కులం అనేది అదృశ్యం కావాలంటే ముందు కులాధిక్యత అహంకారం నశించాలి . అన్ని కులాలు ఆయా వృత్తులు నుంచి రూపాంతరం చెందినవే కాబట్టి , మనిషి కులానికి గుణానికి సంబంధం లేదని , బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు కాజాలడు అనే వేద కాలం నాటి మాటను అగ్రవర్ణాల వారు , కండక్టర్ కొడుకు కలెక్టర్ కాగలడు అనే నేటి పరిస్థితిని  నిమ్నవర్గాల వారు సదా గుర్తు ఉంచుకుంటూ అందుకు అనుగుణంగా సమాజాభివృద్ధి కొరకు కృషి చేస్తే కులాధిక్యత అనేది దానికి కదే మాసిపోతుంది . ఏనాడైతే కులాధిక్యత అనేది సమాజం లో ఉండదో , ఆ నాడు కులం అనే దాని అవసరం కూడా ఉండదు . దానిని సాధించగలిగింది హిందువులంతా ఒకటే అనే  "హిందూ ఏకాత్మత " భావం  . 
                                                 (7/12/2015 Post Republished).  

Tuesday, 6 December 2016

అతను ప్రేమించినది ఎవర్ని? భార్యనా? లేక ఆమెనా?


                                                                       

ఇది ఒక బార్యా,భర్తల ప్రేమ కథ లాంటి నిజం.వారివురు భార్యా భర్తలు.అతను ప్రభుత్వ ఉడ్యొగి, ఆమె గ్రుహిణి . వారివురు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు అని చెప్పవచ్చు. అమే లేనిదే జీవితమే లేదు అన్నట్టు ప్రవర్తించేవాడు అతను ఆమే అంతె. ఎక్కడికి వెళ్ళినా జంటగానే వేళ్లేవారు. వారి కి ఇద్దరు ఆడపిల్లల్లు. సంసారం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫిగా హాపీగా సాగిపోతుండెది.ఇద్దరు ఆడపిల్లల్లు యుక్తవయస్కులు అయ్యారు.

  అటువంటి తరుణంలో ఆ దేవుడికి వారి ప్రేమను చూసి కన్ను కుట్టిందేమో, పాపం ఆమెకు కాన్సర్ జబ్బు చేసి సంవత్సరం లోపులోనే చనిపోయింది. మేమంతా చాలా బాద పడ్డాం. అతను ఎలా జీవిస్తాడు అని ఆందోళన పడ్డాం. కాని విచిత్రంగా మూడు నెలల లోపే అతను తిరిగి వివాహం చేసుకున్నాడు. ఆడపిల్లల్లు ఆ పెళ్లికి అబ్యంతరం పెట్టినా లెక్క చెయ్యకుండా రెండవ జీవితాన్ని కొనసాగించాడు.

 ఆ తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చెయ్యగానే, అతనికి ఏదో ముల్లు గుచ్చుకుని,సెప్టిక్ అయి, అతను మరణించడం,ఆ తర్వాత రెందవ అమ్మాయి పెళ్లి అయి,ఆస్తులు, పిల్లలు, రెండవ బార్య పంచుకుని ఎవరి దారిన వారు బ్రతుకుతున్నారు. ఇదీ కథ,

                                 ప్రియమైన పాటకులారా! నాదొకటే సందేహం.సుమారు ఇరవై సంవత్సరాలు, పదిమంది ఈర్ష్యపడెలా ప్రేమైక జీవితం సాగించిన అతను, బార్యా చనిపోయి, మూడు నెలలు గడవక ముందే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అంటే అతను తన బార్య మీద చూపింది నిజమయిన ప్రేమా? కాదా?అతను ప్రేమించింది దేనిని? బార్యనా లేక ఆమేనా(మనస్సు)?ఎందుకంటే బార్యలు ఎంతమందైనా దొరకొచ్చు, కాని ఆమె మాత్రం దొరకదు.అతను చేసింది సామాజికంగా తప్పు కాక పోయినప్పాటికి,  మరీ మూడు నెలలు గడవక మ0దే బార్యను మరచిపోవడం అంటే " ప్రేమ" గురించి అనుబందాలు గురించి ఆలోచించే వారికి ఎలాగో ఉంటుంది. ఏ మంటారు?  
                                                (25/11/2012 Post Republished).

Sunday, 4 December 2016

టెర్రరిస్టులకు మతం లేదు ! రేపిస్టులకు మగతనం లేదు! ???

                                                                         

                                   మతం లేదు అంటున్న ఉగ్రవాది శవయాత్రకు హాజరైన అతని మతస్తులు .                           

                            ఈ  మద్య కొంత మంది మొహమాటస్తులు ఒక వింత వ్యాక్య చేస్తున్నారు. దానిని ముందు ఎవరు అన్నారో తెలియదు కాని ప్రతి వారూ దానినే పట్టుకుని వేలాడుతున్నారు. అదే " ఉగ్రవాదులకు మతం లేదు " అనే మాట . ఉగ్రవాదులు అంటే ఏ ఉగ్రవాదులో చెప్పకుండా , ఉగ్రవాదులు అందరిని ఒకే గాటన కట్టి "ఉగ్రవాదులకు మతం లేదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం?

    ఉగ్రవాదం అనేది, కొంత మంది  తాము నమ్మిన సిద్దాంతాన్ని ప్రజలను భయబ్రాంతులకు  గురి చేసి అయినా సరే వారి మీద రుద్దాలి అనుకునేది .ఈ క్రమంలో అమాయకులను చంపినా అది సిద్దాంత అమలులో బాగంగా గానే ఉగ్రవాదులు బావిస్తారు.   ఆ సిద్దాంతం వామపక్ష బావజాలమైతే  వారిని నక్షలైట్లో ఇంకో పేరు తోనో పిలుస్తారు. వారికి భగవంతుడి మీద నమ్మక్కం ఉండదు కాబట్టి వారికి మతం లేదు అని చెప్పినా ఒక అందం చందం. కాని ఒక మత గ్రంధం లోని వ్యాక్యలను ఉదహరిస్తూ , తాము దాని కోసమే , తమ దేవుడి మాటను అమలు  చేసే క్రమంలో నే పవిత్ర యుద్దం చేస్తున్నామని బాహాటంగా ప్రకటించడమే కాక , ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఖర్చుతో మత సైనికులకు తర్పీదు నిచ్చి , దేశాల మీదకు వదలి , తమకు నచ్చని వారిని యదేచ్చగా చంపివేస్తూ , ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటె  వారికి "మతం లేదు " అని చెప్పటం కరెక్టా? 

    నిజానికి వారి మత గ్రందాల్లో "పవిత్ర యుద్దం" అనే పదమే లేకుంటే, ఒక వేళ ఉన్నా దాని అర్దం వేరు అనుకుంటే , ఆ మతానికి చెందిన మతాచార్యులు ఉగ్రవాద తండాలకు వెళ్లి వారికి పవిత్ర యుద్దం అంటె ఏమిటో   తెలియచెప్ప వచ్చుగా . వారు తమ మాట వినకపోతే వారికి తమ మతానికి సంబందం లేదని బహిరంగంగా ప్రకటించ వచ్చుగా . అహ ! అలా చేయరు. వారు ప్రజలను చంపుతున్నప్పుడు మెదలకుండా కూర్చోవడమొ , లేకపోతే మొక్కుబడి స్టేట్ మెంట్లు ఇవ్వడమో చేస్తారు. ప్రభుత్వాలు వారిని ప్రాసిక్యూట్ చేసి , న్యాయ స్తానాలు వారిని శిక్షించే టప్పుడు మాత్రం టెక్నికల్ వంకతో అరునోక్క రాగాలు తీస్తూ నానా యాగి చేస్తారు. ఉగ్రవాదుల శవయాత్రలకు  వేలాదిగా హాజరై తమ మత నివాళులు అర్పించేతప్పుడు ఉన్న మతం , వారు అదే మతం పేరు చెప్పి దమన కాండ చేసే నిర్వహించేటప్పుడు ఎలా లేకుండా పోతుందో , "ఉగ్రవాదులకు మతం లేదు " అని ప్రకటించే వారు చెప్పాలి. కాబట్టి మత ఉగ్రవాదులకు ఉన్నదే మతం. వారు వారి మత కార్యకలాపాల్లో బాగంగానే దానిని నిర్వహిస్తున్నారు. దానిని కప్పి పెట్టి వ్యాక్యాలు చేయడమంటే రోగం ఉన్న వాడికి రోగం లేదని బుఖాయించడమే . 

      ఇలా ప్రతి వారు చెప్పే బాష్యాలకి తల ఊపుకూంటు పోతే రేపు రేపిస్టులకి మగతనం లేదు అని ఎవరైనా చెప్పినా అమాయకంగా నోట్లో వేలు వేసుకుని వినాలి. నిజమైన మగవాడు రేప్ చెయ్యడు, వాడిలో ఏదో తీవ్ర బావాలు ఉండడం చేతనే అలాంటి పనులు చేస్తున్నాడు, అది నిజమైన మగతనం కాదు అని,టెర్రరిస్టులను మత హీనులు అని సూత్రీకరించినట్లే ,  రేపిస్టులకు కూడా మగ హీనులుగా సూత్రీకరించవచ్చు. ఈ దేశం లో వినేవాడు చెప్పేవాడికి ఎప్పుడు లోకువే కాబట్టి ఎలా చెప్పినా పర్వాలేదు . 

     మతాచారమైన , కామాచారమైన అది పూర్తిగా వ్యక్తీ గతం .ఇవి  ప్రతి వ్యక్తికి ఉంటాయి . కొంతమందికి ఉండకపోవచ్చు . వీటిని   తమకు నచ్చిన వారి పట్ల , వారి అనుమతితో,  నచ్చినవిదంగా , సమాజానికి వ్యతిరేకం కాకుండా ,కట్టుబాట్లకు లోబడి నిర్వర్తించుకోవాలి .కాని  తమలోని అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికో ,తమ ఆదిపత్యం నిరూపించుకోవడానికో ,ఇతరుల హక్కుల ను హరించడనికి తెగబడటమే టెర్రరిస్టులు అయినా రేపిస్టులు అయినా చేసే పని .  దానిని నిర్ద్వందంగా , మొహమాటం లేకుండా ఖండించాలి తప్పా , వారికి మతం లేదు, వీరికి మగతనం లేదు అంటె, ఎవరికీ ఏదో తెలుసుకోవడానికి పరీక్షలు ఆ పై దండనలూ తప్పవు. .
                                                                (31/7/2015 Post Republished).