సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకోని "పురం నాగమణి "
రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత P.V. సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది. ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్ర...