దండలు వేసుకుంటే, పెండ్లి చేసుకున్నట్లయితే,బండలు వేసుకుంటే విడాకులు తీసుకున్నట్లా?
అప్పుడప్పుడు మన కె.సి.ఆర్. అన్న కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తుంటారు. అలాంటిదే నిన్న పెండ్లి సందర్బంగా అయన ఇచ్చిన నిర్వచనం. నిన్న ఆయన గారు ఏదో పెండ్లికి అహ్వానిస్తే వెళ్ళి నట్లుంది.అక్కడ తెలంగాణా గురించి కాని, రాజకీయాలు గురించి కాని మాట్లాడడానికి సందర్బం కాదనుకున్నట్లుంది. మరి ఏమి సందేశం ఇవ్వాలా అని ఆలోచించి నట్లుంది. నలుగురికి నచ్చినది తనకు ఎలాగు నచ్చదు, కాబట్టి అసలు ఈ తాళి కడితే నే పెండ్లి అయినట్లు బావించమనే సిద్దాంతం ఎకాడినుంచి వచ్చిందా అని కించిత్ ఆలోచించ గా ఆయనకు చటుకున్న చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతే వెంటనే విషయం విడమరచి చెప్పే సరికి అక్కడున్న వరు తెల్లబ...