'శాడిజం' కి' రాడిజం 'మాత్రమే కరెక్ట్!
వంద సార్లు చెప్పు, వేయి సార్లు చెప్పు,లక్షసార్లు చెప్పినా "లైంగికాసురులు" మారరుగాక మారరు. ముఖ్యంగా చిన్న పిల్లమీద లైంగిక దాడి చేసే నీచులుకి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు. మొన్న డిల్లీలో జరిగిన అయిదేళ్ళ పాప మీద లైంగిక దాడి రోజూ దేశంలో జరుగుతున్న వాటిలో ఒకటి మాత్రమే. అయితే అక్కడ ప్రజలు అంతగా తిరగబడటానికి కారణం, మూడు నెలల క్రితం జరిగిన "నిర్భయ" ఉదంతం నుండి డిల్లీ పోలిసులు గుణపాటం నేర్చుకోపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమయింది. ఒక చేతకాని వెదవ చిన్న పిల్లను హీంసిస్తే, దాని మీద కేసు నమోదు చెయ్యలేని పోలిసుల వెదవతనానికి పెల్లుబుకిన నిరసన అది.లైంగికంగా అసమర్దులైన వారు,తమ అసమర్దతను కప్పిపెట్టుకోవడానికి,ఇటువంటి శాడిస్ట్ పనులు చేస్తుంటారు. చిన్నపిళ్ళలు వీరు చేస్తున్న పని చూసి బాదతో భయంతో విల విల లాడుతుంటే,అది చూసి శాడిస్ట్ల మగ అహంకారం త్రుప్తిపడుతుంది. ఇది ఖచ్చితంగా మానసికి సమస్యే అయినప్పటికి ఆ కారణం తో వారిని కటినంగా సిక్షించే విషయమ్లో జాలి చూపించాల్సిన అవసరం చట్టానికి ఉండకూడదు. ఈ మద్య ఇటువంటి బాల లైంగిక వేదింపుల కేసులు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి...