తెలంగాణా సోగ్గాడి "సాగు సొగసు" చూడతరమా!?
తెలంగాణా పోరాట రధసారధి K.C.R గారు ఉంటే తెలంగాణా భవన్ లో లేకుంటే తన ఫాం హౌస్ లో ఉంటుంటారు. తెలంగాణా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ కి వచ్చిన కీలక తరుణం లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చక్కగా తన పాం హౌస్ లో కూర్చుని తన పార్టి నేతలకు అక్కడినుండే మార్గ దర్శనం చేస్తున్నారు అంటే ఆ వ్యవసాయ క్షేత్రం అంటే అయన గారికెంత మక్కువో తెలుస్తుంది. అసలు పొద్దస్తమానం ఆ పాంహౌస్ లో కూర్చుని అయన చేస్తున్న అంత గొప్ప వ్యసాయం ఏమిటి అంటూ ఆయనను ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. మెదక్ జిల్లా ,పూర్ మండలం, ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఈ పాం హౌస్ లోకి ఎవరు పడితే వారు స్వేచ్చ గా వెళ్ళడానికి వీలు లేదు. ఒక ప్రొటెక్టేడ్ ఏరియా లాగ దీని ని పర్యవేక్షిస్తు...