జీతం ఎక్కువ ఇయ్యలేక " ఆవారా" గాడిని అద్యాపకుడుని చేస్తే, 11 మంది మీద అత్యాచారం చేసాడట!
నల్గొండ జిల్లాలో మరొక ఘోరం జరిగింది. మొన్ననే ఒక B.Tech అమ్మాయిని ఒక మాజీ సర్పంచ్ కిరోసిన్ పోసి చంపిన వైనం మరువక ముందే ఘోరాతి ఘోరం, నిచాతి నీచమైన పని ఒకటి ఈ జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద వూర మండలం ,లోని ఎనిమిది తండ లో V.R.O అనే స్వచ్చంద సంస్త ఒక పాఠశాల(ట్యూషన్ పాఇంట్) నడుపుతుంది. ఆ పాఠశాలలో గిరిజన బాలికలకు ఉచిత విద్య నందిస్తున్నారు. పిల్లలను డబ్బులు ఖర్చు చేసి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించే స్తోమత లేని పేద గిరిజనులు తమ పిల్లలను ఈ స్వచ్చంద సంస్త ఆద్వర్యంలో నడిపే స్కూలులో నైనా చదువు కుంటే మెరుగైన చదవు అబ్బుతుందని గంపెడంత ఆశతో చేర్పించి ఉంటారు. ఇక కొన్ని స్వచ్చంద సంస్తల పని తీరు కూడ అంతంత మాత్రమే. ఎవరో దాతలు ఇస్తున్న సొమ్ముతో నడుపుతున్న సంస్తలుకు నైపుణ్యం , అనుభవం ఉన్న ట్యూటర్లు ను నియమించే స్తోమత ఉండదు. అందుకే అదే గ్రామానికి చెందిన ఒక ఆవారా గా తిరిగే వాడిని ఆ పిల్లలకు చదువు చెప్పడానికి అద్యా...