'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చేసిన పెయిడ్ మీడియాకు , 'మౌల్వి కమరుద్దిన్' కామలీలలు కనపడలేదా?!!
సమాజం లో తప్పులు జరుగుతున్నపుడు వాటిని ఎత్తి చూపడం మీడీయాకు ఉన్న గురుతరమైన బాద్యత. దానిని కాదని ఎవరూ అనలేరు. కానీ మెజార్తీ హిందువుల జన్మభూమి అయిన మన దేశం లో లో కేవలం హిందూ స్వాములు తప్పులు చేసినప్పుడు పని కట్టుకుని నానా యాగీ చేస్తూ ఉన్న మీడియా వారికి , అదే పనిని అన్యమత గురువులు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో అర్దం కావడం లేదు. తప్పు ఎవరూ చేసినా తప్పే. ధర్మ గురువులు, మతగురువులు లాంటి హోదాలో ఉన్న వ్యక్తులు పది మందికి ఆదర్శం గా ఉండాలి. కాని చెప్పేవి శ్రీ రంగ నీతులు చేసేవి "స్త్రీ రంగ " పనులు అయినప్పుడు వారిని నమ్మి అనుసరిస్తున్న భక్త కోటి మనో బావాలు దెబ్బ తింటాయి. వారు పాటించే మతానికి చెడ్డ పేరు వస్తుంది. అలా కేవలం హిందూ మతాన్ని పలచన చేసే ఉద్దేస్యం తో పని చేస్తున్న కొంతమంది మీడియా వారు హిందూ స్వాములు ఏ చిన్న తప్పు చేసినా ఒకటికి పది సార్లు ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలలో తెగ ఊదర గొట్టెస్తుంటారు. దీని మీద యాంటీ హిందూ అనలిస్ట్లు చేత తెగ విశ్లేషణలు చేయిస్తూ హిందూ మతం లో ఉన్న వారం