Posts

Showing posts from April, 2013

మనకు కావల్సింది "కుల సోషలిజమా?లేక వర్గ సో(శో)షలిజమా?

Image
                                                          మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది.   కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా?   నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్తి నుండి విడదీసి అది ఒక శాశ్వత సామాజిక హోదా గా మార్చాం కాబట్టి!కాబట్టి ఇప్పుడు కులం ను బట్టి వ్రుత్తి చెప్పలేక పోయినా వారి వారి సామాజిక హోదాను అంచనా వెయ్యొచ్చు.అలా అందరి అంటే, అన్ని కులాల సామజిక హోదాను సమానం చెయ్యడమే నిజమయిన సోషలిజం. దీనినే "క్యాస్ట్ సోషలిజం" లేదా "సర్

"నిర్బయ" ఉదంతం తర్వాతే మన దేశంలో అత్యాచారాలు ఎక్కువయాయా!?

                                                                 చూడబోతే అలానే అనిపిస్తుంది. నిర్బయ కేస్ తర్వాత, దేశ ప్రజలలో చెలరేగిన ఆందోళన , ఆ తర్వాత జరిగిన చట్ట సంస్కరణల వలన, స్త్రీల పై జరిగే అత్యా చారాలకు కటీన శిక్షలు విదించేటట్లు, చట్టాలు రావడం వలన ఖచ్చితంగా కామాందులలో భయం అనేది పుట్టి ,అత్యాచారాల క్రైం రేట్ తగ్గుతుందేమోనని బావించిన వారికి నిరాశే మిగులుతుందనుకుంటా!   ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బంగా డీల్లీ హై కోర్ట్ వారు కూడ ఈ విషయం లో ఆందోళన వ్యక్త పరచారు. ఈ మద్య విపరీతంగా పెరిగిపోతున్న స్త్రీల మీద లైంగిక దాడులు గురించి , వాటికి కారణాలు గురించి సమగ్ర అద్యయనం జరగాలన్నారు. అవును ఇది అక్షరాల సత్యం. మూలం కనుక్కోకుండా, పై పై పూతలు, మందులు రొగాన్ని తగ్గించనట్లే, వేయి "నిర్భయ" చట్టాలున్న పరిస్తితిలో మార్పు ఉందకపోవచ్చు.   నేను ఇది వరకి టపాలలో చెప్పినట్లు "తప్పుడు కేసులు" సంస్క్రుతీ మన దేశ  పోలిస్ కేసులలో ఒక దౌర్బాగ్యం. డబ్బులకు ఆసపడో, బలమఈన సెక్షన్లు పెడితే తప్పా ప్రత్యర్దులను లొంగదీయలేమన్న తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి. చివరకు ఈ కేసుల

న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టిన సి.బి.ఐ.

Image
                                                                            బారతదేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్త మన సి.బి.ఐ. ఈ మద్య కాలంలో అది రాజకీయ సంకెళ్ళు తెంచుకుని "స్వతంత్ర దర్యాప్తు సంస్థ" అనే పేరును సార్థకం చేసుకోవాలని తహ తహ లాడుతున్నట్లుంది. అందుకే "బొగ్గు కుంభ కోణం కేసులో సుప్రీమ్ కోర్టు వారికి ఇచ్చిన అపిడవిట్ లో, తాము నివేదికను న్యాయ శాఖా మంత్రి చూశాకే ,కోర్టులో సమర్పించామని, ఇకనుండి అలా చెయ్యమని చెప్పింది. అంతకు ముందు ఇదే విషయం మీద ప్రభుత్వం  తాము సి.బి.ఐ. వారి విచారణ నివేదికలో జ్యోక్యం చేసుకోలెదని చెప్పిందట!కాని సి.బి.ఐ. మాత్రం నిజం వెళ్ళగక్కి, రాజకీయ జ్యోక్యాన్ని అత్యున్నత న్యాయస్తానం  ముందు  తేట తెల్లం చేసింది. అ మాటతో న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టినట్టయింది..    మనది అటు ఇటు కాని వ్యవస్త కాబట్టి, సదరు న్యాయ శాఖా మంత్రి నిప్రభుత్వం వెనకేసుకు వస్తుంది కాని, అదే వేరే   దేశం లో అయితే రాజీనామా చెయ్యక తప్పదనుకుంట అంత "అబద్దం" అవలీలగా చెప్పినందుకు. మనది "సత్యమేవ జయతే" అన్న అధికార చిహ్నం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ అదికారం లో ఉన్న వారు

మన దేశం లో "డేటింగ్" ని" లేచిపోవడం" అంటారా!

                                                                    పద్దెనిమిది యేండ్లు నీండితే చాలు ఏమి ఎంజాయి చేసినా, చెయ్యక పోయినా "వయస్సు" ని ఎంజాయి చెయ్యవచ్చు. నేను మొన్నటి దాక డేటింగ్ అనేది విదేశి సంస్క్రుతి, మనకు అలాంటి విదానం లేదు కాబట్టి,మన వివాహ వ్యవస్త చాలా వరకు స్వచ్చంగా ఉందని అనుకునే వాడిని.   మనలో చాలా మంది పెద్దలు అనబడే వారు, చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు.వారు ప్రజలకు ఇచ్చే సందేశాలు వేరుగా ఉంటాయి,తాము ఆచరించే విదానాలు వేరుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తాము నిజమని నమ్మిన దానిని ప్రజలకు చెప్పే దైర్యం లేకపోవడం.ఉదాహరణకు కొన్ని వందల సినిమాలలో ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో లేపుకుపోవడం "హీరోఇజం" గా ప్రదర్సించి యువతరం చేత వహ్వా అనిపించుకున్న హీరో గారు, తన నిజ జీవితంలో అటువంటి పరిస్తితే తన కుటుంభంలో ఎదురైతే, మాట్లాడకుండా చాటు మాటు చర్యలతో, అట్టి ప్రేమ కార్యకలాపాలని వ్యతిరేకిస్తాడు తప్పా, నోరు తెరచి ఇటువంటి తల్లి తంద్రుల అనుమతి లేని పెండ్లిళ్లు మన సంస్క్రుతికి వ్యతిరేకం అని గట్టిగా చెప్పడు. లేదూ తాను సినిమాలో చూపే "హీరోఇజమే" కరెక్ట్ అనుకుంటే, హ

'శాడిజం' కి' రాడిజం 'మాత్రమే కరెక్ట్!

Image
  వంద సార్లు చెప్పు, వేయి సార్లు చెప్పు,లక్షసార్లు చెప్పినా "లైంగికాసురులు" మారరుగాక మారరు. ముఖ్యంగా చిన్న పిల్లమీద లైంగిక దాడి చేసే నీచులుకి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు. మొన్న డిల్లీలో జరిగిన అయిదేళ్ళ పాప మీద లైంగిక దాడి రోజూ దేశంలో జరుగుతున్న వాటిలో ఒకటి మాత్రమే. అయితే అక్కడ ప్రజలు అంతగా తిరగబడటానికి కారణం, మూడు నెలల క్రితం జరిగిన "నిర్భయ" ఉదంతం నుండి డిల్లీ పోలిసులు గుణపాటం నేర్చుకోపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమయింది.    ఒక చేతకాని వెదవ చిన్న పిల్లను హీంసిస్తే, దాని మీద కేసు నమోదు చెయ్యలేని పోలిసుల వెదవతనానికి పెల్లుబుకిన నిరసన అది.లైంగికంగా అసమర్దులైన వారు,తమ అసమర్దతను కప్పిపెట్టుకోవడానికి,ఇటువంటి శాడిస్ట్ పనులు చేస్తుంటారు. చిన్నపిళ్ళలు వీరు చేస్తున్న పని చూసి బాదతో భయంతో విల విల లాడుతుంటే,అది చూసి శాడిస్ట్ల మగ అహంకారం త్రుప్తిపడుతుంది. ఇది ఖచ్చితంగా మానసికి సమస్యే అయినప్పటికి ఆ కారణం తో వారిని కటినంగా సిక్షించే విషయమ్లో  జాలి చూపించాల్సిన అవసరం చట్టానికి ఉండకూడదు.    ఈ మద్య ఇటువంటి బాల లైంగిక వేదింపుల  కేసులు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి కారణం నేను పై

యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం"

Image
                                                                                                        యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం" అలు మగల అనుబందానికి సీతారామ దాంపత్య జీవితం చక్కని ప్రతీక.కస్ట సుఖాలలో బార్యాబర్తలు ఎలా పాలు పంచుకోవాలో తెలిపే వీరి దాంపత్య జీవనం మనకి ఆదర్శం. రాజ రికంలో పుట్టినప్పటికి, దర్మం కోసం వీరు అనుబవించిన కస్టాల ముందు మనవి ఒక లెఖ్ఖా?నిత్యం ఈ దేవతా మూర్తులను కొలిచే మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే,సంసారాలను విడాకుల వరకు తీసుకు వెళ్లడం ఎంతవరకు సమంజసం. కట్టుకున్న వాళ్లతోనే సర్దుకుపోలేని వారు సమాజంలో ఎలా ఇతరులతో సర్దుకుపోగలుగుతారు?దాంపత్యమంటే ప్రేమతో కూడిన సర్థుబాటు.దీనిని తెలిసికోలేక సంసారాలు పాడు చేసుకుంటున్న వారు ఎన్ని సార్లు సీతారామ జపం చేసినా, నిష్టతో శ్రీరామ నవమి  కల్యాణాలు చేయిస్తున్నా   నిష్పలమే.              ఆ సీతారాముల ఆశీసులు అందరికి ఉండాలని ప్రార్థిస్తూ....

తాగితే ఆడ ఐనా, మగ ఐనా ఒకటే!

                                                                      మొన్న రెండు  చోట్ల వేర్వేరు ఘటనలు జరిగాయి.మొదటిది తెనాలిలో తాగుబోతులైన యువకులు ఒక అమ్మాయిని అల్లరి చేసే క్రమంలో ఆమె తల్లిని లారీ క్రిందకు నెట్టి చంపారని పోలిస్ వారి సమాచారం. అలాగే హైద్రాబాదులో కొంతమంది అమ్మాయిలు పబ్బులో ఫుల్ గా తాగేసి, అర్థరాత్రి రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేసి మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేసారని వార్తలు.   అర్థరాత్రి స్వాతంత్ర్యం గురించి గాంది గారు కన్న కలలు మనవాళ్ళు ఇలా నిజం చేస్తున్నందుకు ఎలా సిగ్గుపడాలో తెలియడం లేదు.అర్థరాత్రి ఒంటిగంట వరకు బారులకు లైసెన్స్ లు ఇచ్చిన ఈ సెన్స్ లేని పాలకుల వల్ల జరిగే అనర్థాలు ఇవి అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసిన, అసలు తాగడం అనేది తప్పు అని, ఒక వేళా అలవాటు ఉంటే దానిని లిమిట్ గా ఎలా వినియోగించాలో చెప్పే నిబందనలు ప్రబుత్వం చేసిందా? చెయ్యదు. ఎందుకంటే మనకున్న ప్రదాన వనరుల్లో "మద్యపానం" ఒకటి కాబట్టి.     మనకు తాగడంలో, వాగడంలో, ఉన్నంత స్వేచ్చ బహూశా ఏ దేశంలో ఉండవనుకుంటా!ఈ మద్యనే ఎందుకో ప్రజల్లో చైతన్యం వచ్చినట్లుంది,ముందు వెనుక కానక ఇష్టం వచ్చినట్లు వాగే వారిన

భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?

                                                                          మీకు ఉగాది శుభా కాంక్షలు తెలపటానికి ముందు ఒక వీషయం తెలుసుకుందామనిపించి ఈ ప్రశ్న వేస్తున్నాను.   మీరు ఎప్పుడైనా బయట పనుల ఒత్తిడిలో ఉన్నప్పుడు, మనసు చికాకుగా అనిపించిదనుకోండి మీరు వెంటనే  ఎక్కడికి వెళతారు? భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?    ఒక వేళా మీకు మొదటి చోటుకే వెళ్లాలనిపిస్తే మీ అంత అద్రుష్ట వంతుడు ఈ భూమి మీద వేరొకడు లేదు. "గ్రుహమును మించిన స్వర్గసీమ ఇల యందు కలదే"?. కాని చిన్న, చిన్న అపోహలు, కలతలు మన సంసార గ్రుహాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయి. వాటిని పరిష్కరించి,బార్యా భర్తలను సరిదిద్దే ఓపిక ఈ నాటి పెద్దల్లో లేదు, ఒక వేళా ఎవరైన పెద్దలు చెపితే సర్థుకు పోయి సంసారం చేసే గుణం పిన్నల్లో లేదు. ఈ మద్య  కొందరిని చూశాను. ముప్పై యేండ్లు కాపురం చేసి, పిల్లలు పెద్దవారిని చేసిన దంపతులు సహితం తమ మద్య పొసగడం లేదని విడాకుల కోసం అర్థించడం. మనలో ఈ సర్థుకు పోయే గుణం ఎందుకు తగ్గుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?    మన చుట్టూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, ద్వని కాలుష్యం, మన జీవన సరళి లో మార

నీతి బాదితుల ఓదార్పు యాత్ర కథ!

                                                                        నిన్న నా దగ్గరకు ఒక వీరాభిమాని వచ్చాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు కి వీరాభిమాని.వాళ్ళ నాయకుడు  చనిపొతే, పాపం ఈయన సంవత్సరం  పాటు తెగ ఏడ్చాడు.ఎందుకంటే,ఆయన తర్వాత  ఈ రాష్ట్రానికి దిక్కేవరూ లేరు అని.అలా ఆయన లాగా బాదపదే వాళ్ళు లక్షల్లో ఉన్నారట!అందుకని వారందరిని ఓదార్చడానికి ఆ చనిపోయిన నాయకుడి కుమారుడు "ఓదార్పు యాత్ర" పేరుతో రాష్ట్రమంతా పర్యటించి తన తండ్రి మరణ బాదితులను ఒదార్చడం ప్రారంబించాడాట.అందరిలాగా కేవలం ఒదార్పు మాటలు కాకుండ కాస్త ఘనంగా ఓదార్చితే, మంచిదనుకున్నాడో ఏమో,ఒక్కొక్క కుటుంభానికి లక్ష రూపాయలు ఇచ్చి మరీ ఓదార్చాడట!.ఆ దెబ్బతో అబ్బా, ఓదార్పు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందట.   కాని ఆ పైనున్న ప్రభువు చిన్న చూపు చూసాడు కాబోలు, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని జైల్ పాలయ్యడు ఆ వీర నాయకుడు.ఇక అక్కడ్నుంచి ఆయన్ని ఓదార్చాడానికి జైల్కి అభిమానులు  క్యు కడితే, జైల్ అదికారులు నిబoదనలు చూపించి ఓదార్పు యాత్ర జైల్ లో కుదర అనే సరికి,పాపం అభి మానులు దిగాలుగా ఇండ్లకు వెళ్ళి, ఇంట్లో పోటో నీ ఓదారుస్తున్నారట!.   ఇల

చేవెళ్ల చెల్లెమ్మకు, పులివెందుల అన్న ఇచ్చిన బహుమానం, "చార్జ్ షీట్" లొ స్థానం.

                                                                         పాపం, కరుణామయుడు, దయామయుడు, మడమతిప్పని మహా యోదుడు, నమ్మిన వారిని అనునిత్యం కాపాడతాడని పేరున్న ఆయన్ని నమ్మినందుకు సాక్షాతు రాష్త్ర తొలి హోమ్ మంత్రి గారు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. పాపం పోలిస్ వారు ఏమి అనలేక అటు చట్ట నిబందనలని కాదనలేక ఆవిడ గారి పేరును  "చార్జ్ షీట్" లో పెట్టి మా పనయిపోయింది ఇక పైనున్న "అమ్మ" ఇష్టం, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిష్టం అన్నట్టు  కామ్ గా చూస్తున్నారు.    వ్యక్తులుని నమ్మి గుడ్డిగా అనుసరించే వారికి మన రాష్త్ర హోమ్ మంత్రి గారి ఉదంతం, ఐ.ఎ.ఎస్ అదికారిణి శ్రీ లక్ష్మి గారి ఉదంతం ఒక కను విప్పు కావాలి. నాటి దర్మం స్థానాన్ని నేడు చట్టాలు ఆక్రమించాయి. కాబట్టి దర్మాన్ని ఆచరించకపోయినా కనీసం  చట్టాలను గౌరవించి వాటి ప్రకారమే చేస్తే ఈ తిప్పలు ఉండేవి కావుగా.   పాపం ఆ శ్రీ లక్ష్మి ని చూస్తే జాలి వేస్తుంది. అతి చిన్న వయసులో ఐ.ఎ.ఎస్ అధికారిణిగా ఉన్నత శికరాలు ఎక్కింది.మంచి పేరు తెచ్చుకుంది. కాని ఏమి లాభం?ఒక్క మాయని మచ్చతో అదః పాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సహాయకులు లేకుండ

అరవై యేండ్ల స్వాతంత్ర్యంలో 90% మంది ప్రజలు పశువులుగా మారారా?

 ఈ అనుమానం ఏవరికైనా కలుగుతుంది, ప్రెస్ కౌన్సిల్ చేర్మన్ కట్టూ మార్కండేయ గారి మాటలు వింటే! ఈ మద్య ఆయన భారతీయ వోటర్ మహయశయుల మీద ఆయన గారికున్న విలువైన అభిప్రాయం సెలవిచ్చారు. ఇక్కడ ప్రజలులో 90% మంది కుల మతాల ఆదారంగా వోట్లేసే పశువులంట!మరి ఆ పశువులు ఎన్నుకున్న వారు నియమిస్తే ప్రెస్ కౌన్సిల్ చేర్మన్  పదవిని అలంకరించాడానికి కట్టూ గారికి మనసెలా ఒప్పిందో?   అరవైయేల్లలో ఇలా ప్రజలు పశువులుగా మార్చిన ఈ ప్రజా స్వామ్యం పనికి రానిది అని ఒక జస్టిసే సెలవిచ్చాకా, దానిని ఖండించలేని స్తితిలో ఉన్న ఈ దిక్కుమాలిన రాజకీయ వ్యవస్త మనకు అవసరమా? ఆలోచించండి!దీనిని సమూలంగా ప్రక్షాళన చేసే మగాడే లేనప్పుడు, వీరందరు చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలకు తలలు ఊపి,ఊపి పాపం ప్రజలు పశువులుగా మారిపోయినట్లుంది.అందుకే వీరి కోసం మంచి పశువుల కాపరి రావాల్శి ఉందనుకుంటా!      ప్రజలు ఇక నైనా తలలు ఊపడం మాని లోపలి మెదడుతో ఆలోచించడం మొదలెదితే మంచిది. లేకుంటే భరత ఖండం కాస్తా పశుల ఖండం గా మారుతుంది!    

"త్రిమూర్తులు" ను చూడాలనుకుంటున్నారా? ఎలాగో చూడండి!

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

ఎన్ని రోజులు ఉద్యోగం చేసామన్నది కాదన్నయా! ఎంత మంది గుండేల్లో నిద్ర పోయామన్నదే ముఖ్యం".

                                                      పై చిత్రాలలో మొదటివారు సోనియాగాంది గారి అల్లుడు 'రాబర్ట్ వాద్రా', బూ అక్రమాల మీద విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అదికారి శ్రీ "అశోక్ ఖేమ్కా" కాగా, రెండవ వారు అంద్రా, కర్ణాటక సరిహద్దులను చెరిపివెయ్యడమేకాక, రెండు రాష్ట్రాల వనరులను దోచుకున్న మహ తిమింగళాలను కటకటాల వెనుకకు నెట్టి,వారి మీద విచారణ చేపట్టిన తెలుగు సింహం సి.బి.ఐ జె.డి. శ్రీ లక్ష్మి నారాయణ.  గమ్మతేమిటంటే వీరిద్దరి ముఖాలలో  కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి!విరిద్దరిని అన్నదమ్ములు అంటె ఎవరఈనా నమ్మేయొచ్చు! ఇలాంటి ముఖ కళవళికలు ఉన్న వారంతా నీతి నిజాయితి గల అధికార్లు అవుతారా? మీలొ ఎవరైనా ముఖం చూసి జాతకం చెప్పే వారుంటె చెప్పండి!  " ఎన్ని రోజులు ఉద్యోగం చేసామన్నది కాదన్నయా! ఎంత మంది గుండేల్లో నిద్ర పోయామన్నదే ముఖ్యం"".అవినీతితో అవసాన దశ దాకా బ్రతకాలా! నీతిగా ఒక్కరోజు బ్రతికిన చాలు". ప్రస్తుతం ఈ దేశానికి కావాల్శిన ఆదర్శ  అధికార్లు ఇలాంటి వారే! . వీరిద్దరి కుటుంబాలను ఆ లక్ష్మి నరసింహుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ......

మానభంగం కంటే ఘోరమయింది "మర్యాద భంగం"!

  మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మంచిపనిని అతి త్వరగా చేశారు.అదే నండి మహిళా రక్షణ కొరకు "నిర్భయ"బిల్లును చట్ట రూపం లోకి తెచ్చారు. ఈ సవరణ చట్టం వలన ఇక నుండి "మాన భంగం " నేరస్తులకు కటిన శిక్షలు విదించే వీలు ఉంటుంది.అంత వరకు సంతోషమే.కాని పరస్పర అంఘీకార శ్రుంగారానికి పద్దెనిమిదేళ్ల  వయసును నిర్దారించడం కొంత అబ్యంతరకరమే.   బారతదేశం లో విశిష్టమైనది, బలమయినది కుటుంభ వ్యవస్త.ఆటువంటి కుటుంభ వ్యవస్తకి పునాది "మనువు" .  అంటే  వివాహం. ప్రతి తండ్రి తన కుమార్తెను యోగ్యుడైన వరునికి ఇచ్చి పెండ్లి చేయ్యాలని కోరుకుంటాడు. " "కన్యాదానం" అనేది వివాహ తంతులో అత్యంత ప్రాదాన్యత గలది. అలాగే పెండ్లి అనేది పూర్తిగా మతపరమయిన చర్య. దీనిలో చట్టం జ్యోక్యం చేసుకోవడమంటే అది మతపరమయిన ప్రాదమిక హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది. మరి ఇటువంటి పరిస్తితిలో కుటుంభ సబ్యులకు "అంగీకార శ్రుంగారం" వయస్సును చట్టం ఎలా నిర్దారిస్తుంది? పెండ్లి కాని యువతీ యువకులు కేవలం చట్టం అనుమతించిందని "శ్రుంగారానికి " సై అంటే వారిని నియంత్రించే అదికారం "కుటుంభ" సబ్యు

"సౌర శక్తి" ని వినియోగించడమే నిజమైన "సూర్యోపాసన"!

http://ssmanavu.blogspot.in/2013/03/blog-post_8803.html పూర్తీ టపా కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి