మన దేశం లో "డేటింగ్" ని" లేచిపోవడం" అంటారా!
పద్దెనిమిది యేండ్లు నీండితే చాలు ఏమి ఎంజాయి చేసినా, చెయ్యక పోయినా "వయస్సు" ని ఎంజాయి చెయ్యవచ్చు. నేను మొన్నటి దాక డేటింగ్ అనేది విదేశి సంస్క్రుతి, మనకు అలాంటి విదానం లేదు కాబట్టి,మన వివాహ వ్యవస్త చాలా వరకు స్వచ్చంగా ఉందని అనుకునే వాడిని.
మనలో చాలా మంది పెద్దలు అనబడే వారు, చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు.వారు ప్రజలకు ఇచ్చే సందేశాలు వేరుగా ఉంటాయి,తాము ఆచరించే విదానాలు వేరుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తాము నిజమని నమ్మిన దానిని ప్రజలకు చెప్పే దైర్యం లేకపోవడం.ఉదాహరణకు కొన్ని వందల సినిమాలలో ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో లేపుకుపోవడం "హీరోఇజం" గా ప్రదర్సించి యువతరం చేత వహ్వా అనిపించుకున్న హీరో గారు, తన నిజ జీవితంలో అటువంటి పరిస్తితే తన కుటుంభంలో ఎదురైతే, మాట్లాడకుండా చాటు మాటు చర్యలతో, అట్టి ప్రేమ కార్యకలాపాలని వ్యతిరేకిస్తాడు తప్పా, నోరు తెరచి ఇటువంటి తల్లి తంద్రుల అనుమతి లేని పెండ్లిళ్లు మన సంస్క్రుతికి వ్యతిరేకం అని గట్టిగా చెప్పడు. లేదూ తాను సినిమాలో చూపే "హీరోఇజమే" కరెక్ట్ అనుకుంటే, హ్రుదయపూర్వకంగా వాటిని అనుమతించాలి. మనం ఈ మద్య చూశాం చాలా గొప్పగ చెప్పబడిన మీడీయా ప్రేరేపిత "ఆర్య సమాజ" వివాహం, ఆరు నెలలు తిరగక ముందే,ఆగం ఆగం అయ్యి, చివరకు విడాకులకు దారి తీసింది.
ఈ రోజు తాజాగా ఒక యం.యల్. యే గారికి ఈ చేదు అనుభవం ఎదురవుతున్నట్లు ఉంది. కేవలం మోహ ఆకర్షనని ప్రేమా గా బ్రమించి ఇంట్లో చెప్పకుండా లేచీ పోయే వారు ఎక్కువ అవుతున్నారు. వారికి బందువుల అండ దండలు ఉండవు కాబట్టి , కొన్నాలు ప్రేమా సామ్రాజ్యాన్ని ఏలి, చివరకు బ్రతకడానికి ప్రేమ ఒక్కటే చాలదని, ఇంకా చాల అవసరమని బావించి ఎవరిండ్లకు వారు వెళ్ళి పోతున్నారు. ఇ ప్రక్రియ చూస్తుంటే ప్రాశ్చాత్య విదానమఈన "డేటింగ్" అనేది గుర్తుకు వస్తుంది. అక్కడి సమాజాలలో పెండ్లికి ముందు ఒకరి నొకరు అర్థమ్(?) చేసుకోవడానికి కలిసి తిరగడమనే ప్రక్రియను "డేటింగ్" అంటారట. వారి సమాజం దానిని ఆమోదించింది కాబట్టి వారిలో స్వచ్చత ఉంది. కాని ఇక్కడ అలాంటిది లేదు. కాని ఇండైరెక్ట్ గా అలాంటిదే చేస్తున్నారు. "లేచి పోయారు" అనే ప్రక్రియ క్రింద కొంతకాలం ఆబగా అన్నీ కానిచ్చేయడం, మోజుతీరాక వదిలేసి పోవడం. ఇదీ ఇక్కడి దౌర్బాగ్య పరిస్తితి.
ఈ విదానం మారి మన వివాహా వ్యవస్తలో స్వచ్చత ఉండాలంటే, వివాహానికి, తల్లితండ్రుల లేదా "ప్యామిలి కోర్టు" ల అను మతి తప్పని సరి చేయ్యాలి. ఇదే విషయం మీద నేను ఇంతకు ముందు ఒక టపా పెడితే కొన్ని విమర్శలు వచ్చాయి.అయినా నేను అంత గొప్ప పెద్ద మనిషిని కాదు కాబట్టి నేను నమ్మిన దానిని చాటడానికి వెరువను గాక వెరువను
వెనుకటి టపాను చూడడానికి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html
Comments
Post a Comment