అద్దెకడుపుల విపరీతపుపోకడల విషయం లో " మనవు" కోరికను మన్నించిన కేంద్ర మంత్రి మండలి !! ?
ది .28/6/2016 న తేదీన ఇదే బ్లాగులో దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!! అనే పోస్ట్ ప్రచురించడం జరిగింది. అందులో నటుడు తుషార్ కపూర్ తాను వివాహం చేసుకోకుండా కేవలం సింగిల్ పేరెంట్ గా సరోగసి పద్దతిలో ఒక బాబుకు తండ్రిగా మారిన విధానం ని నిరసిస్తూ " ఈ ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు ఇచ్చారు? చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది? అని అడగడం జరిగింది. ఇదే