పెళ్ళాం మీద అలిగి వెళ్ళిపోయినా, గాడిదలకూ పోలిస్ సెర్చ్ డ్యూటి తప్పదా !?
వెనుకటికి ఒకాయన అపరాద పరిశోదన నవలలు చదివి , చదివి , తానూ ఒక డిటెక్టివ్ అయి బాగుండు అనుకున్నాడట . వెంటనే కొంత డబ్బు ఖర్చు చేసి "xxx డిటెక్టివ్ ఏజెన్సి" అనే దానిని అట్టహాసంగా ప్రారంభించాడట. మొదటి రోజు మొదటి బేరం ఏమి తగులుతుందా అని ఎదురు చూస్తున్న అ డిటెక్టివ్ గారి దాగ్గరకు , పంచే పైకెగ దోపుకుని , ఆయాసంగా ఒగర్స్తూ ఉన్న వ్యక్తీ ఒకరు రావడం జరిగింది . వచ్చి రావడంతోనే "అయ్యా ఇక్కడ, కనపడకుండా పారిపోయిన వాళ్ళ , జాడ కనిపెడతరంటగా " అని అడిగే సరికి , మొదటి కేసు ఏదో మిస్సింగ్ పర్సన్ కేసు తగిలందుకుని "అవును" , అన్నాడట ఔత్సాహిక డిటెక్టివ్ . దానికి ఆ ఆసామి "బ్బాబ్బాబు ! మీకు పుణ్యముంటుంది . వారం రోజుల నుంచి నా గాడిద కనపడటం లేదు . వెతికి పెడితే "చచ్చిమీ కడుపున పుడతా " అని అంటుoటే తెల్ల ముఖం వేసాడట ఆ కొత్త డిటెక్టివ్ . మన రాష్ట్రం లో పోలిస్ వార...