Posts

Showing posts with the label శ్వేతా మీనన్

తన "డెలివరి " ద్రుశ్యాలను సహితం సినిమా నిర్మాతలకు అమ్ముకున్న "నటీ మణీ " శ్వేతామీనన్ !!

Image
                                       ఆమె ఒక నటీమణీ. పేరు  శ్వేతా మీనన్ . మళయాల సినిమారంగాన్ని తన అంగాంగ ప్రదర్శనతో ఉర్రూతలూపిన  శ్రుంగార నాయిక. ఆవిడగారికి పబ్లిసిటీ మీద యమ మోజు. ఎందుకంటే అదే మరి ఆమెను హైలెట్ చేసింది. అందుకే ఆమెగారు ప్రతిదానిని తన పబ్లిసిటీ కీ వాడుకుంటుంది. ప్రపంచం లో ఏ స్త్రీకి అయినా మాతృత్వం వరం. స్త్రీ ప్రసవించే సమయంలో తనను మంత్రసాని, లేక డాక్టర్లు తప్పా ఎవరూ చూడకూడదని కోరుకుంటుంది. అమెరికన్ సంస్కృతిలో భర్త కంపల్సరిగా ఆమె దగ్గర ఉండాలి.కానీ తను కూతురికి జన్మనిస్తూ, ఆ ప్రసవించే ద్రుశ్యాలను కూ డా సినిమా డైరెక్టర్ ను పిలిచి షూట్ చేయమని కోరిందంటే ఆమె ఆడదేనా? ఆ ద్రుశ్యాలను తను నటిస్తున్న సినిమా లో చూపించడం కోసమట! స్త్రీలు ప్రసవ వేదనలు పడే సమయం లో ఎంత వేదన అనుభవిస్తారో ప్రజలకు ప్రత్యక్ష్యం  గా చూపడానికే తప్పా వేరే ఏ ఉద్దేస్యం లేదని ఆవిడ గారి భర్త బుకాయిస్తున్నాడు. స్త్రీలు ఎంత నరక యాతన అనుభవించేది చూపించడానికి ఇప్పటికే చాలా విజ్ణాన చిత్రాలు ఉన్నాయి. ...